Horoscope Today: వీరు విరోధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి .. శుక్రవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

|

Aug 05, 2022 | 6:37 AM

Horoscope Today: సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకోవాలి. స్థిరంగా ఆలోచనలు ఉండాలి. విందులు, వినోదాలు, శుభకార్యాల్లో పాటిస్తారు. గిట్టనివారితో తక్కువగా మాట్లాడడం మంచిది. సుబ్రహ్మణ్యస్వామిని సందర్శించుకుంటే శుభం కలుగుతుంది.

Horoscope Today: వీరు విరోధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి .. శుక్రవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Follow us on

మేషం

సన్నిహితుల సహకారంతో కీలక పనులు, ముఖ్యమైన వ్యహహారాల్లో విజయం సాధిస్తారు. కుటుంబ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. కొందరు తప్పుదారి పట్టించే అవకాశం ఉంది. సాయి నామం పఠిస్తే మంచిది.

వృషభం

ఇవి కూడా చదవండి

సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకోవాలి. స్థిరంగా ఆలోచనలు ఉండాలి. విందులు, వినోదాలు, శుభకార్యాల్లో పాటిస్తారు. గిట్టనివారితో తక్కువగా మాట్లాడడం మంచిది. సుబ్రహ్మణ్యస్వామి సందర్శించుకుంటే శుభం కలుగుతుంది.

మిథునం

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వృథా ప్రయాణాలతో అనవసర ఖర్చులు. ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి. వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే శుభప్రదం.

కర్కాటకం

ఈరాశివారికి మానసికంగా దృఢంగా ఉంటారు. అనవసర గొడవలకు దూరంగా ఉండాలి. ఇష్టదేవతలను ప్రార్థించడం వల్ల మరిన్ని సానుకూల ఫలితాలు పొందుతారు.

సింహం

కుటుంబ సభ్యులు,ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా సానుకూల ఫలితాలు పొందుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం వల్ల మరిన్ని మంచి ఫలితాలు అందుకుంటారు.

కన్య

కీలక పనులు, వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. అయితే కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. అనవసర ప్రయాణాలతో సమయాన్ని వృథా చేయకండి. నవగ్రహ ఆరాధన శుభప్రదం.

తుల

ఈరాశివారికి స్వల్ప ధనలాభం ఉంది. అనవసర గొడవలకు తావివ్వకండి. ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. విష్ణు సహస్రనామాలు పఠించడం ద్వారా అంతా మంచి జరుగుతుంది.

వృశ్చికం

మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో అనుకూలం.మరీ ఎవరినీ ఎక్కువగా నమ్మవద్దు. శ్రీరామ నామాన్ని జపిస్తే మేలు చేకూరుతుంది.

ధనస్సు

సమయపాలన పాటించడం మంచిది. అప్పుడే సానుకూల ఫలితాలు పొందుతారు. ఉన్నతాధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అనవసర భయాందోళనలకు గురవుతారు. పరమేశ్వరుడి సందర్శనం వల్ల లాభాలు పొందుతారు.

మకరం

మనస్సుపై లగ్నం చేయండి. సానుకూల ఫలితాలు పొందుతారు. మనోధైర్యం కోల్పోకుండా చూసుకోవాలి. కొన్ని విషయాల్లో సొంత నిర్ణయాలు వికటిస్తాయి. సమయాన్ని వృథా చేయకండి. ఇష్టదైవారాధన మాత్రం మానవద్దు.

కుంభం

తోటివారి సహకారం లభిస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలుగుతాయి. ఆర్థికంగా సానుకూల ఫలితాలు పొందుతారు. ఒక శుభవార్త ఇంట్లో సంతోషం నింపుతుంది. శ్రీరామనామాన్ని జపించడం వల్ల మేలు జరుగుతుంది.

మీనం
ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. మనోధైర్యంతో ముందుకెళ్లాలి. బంధు, మిత్రులతో మంచిగా మసులుకోవాలి. కీలక విషయాల్లో అశ్రద్ధ రానీయకండి. ఇష్టదైవారాధన మాత్రం మరవద్దు.

NOTE: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.