Horoscope Today: వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope (February 25, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయానికి లోటుండకపోవచ్చు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. వృషభ రాశి వారు ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి వారికి ఆర్థికంగా అనుకూలత పెరుగుతుంది. పాత రుణాలు తీర్చగలుగుతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Daily Horoscope 25 Feb 2026

Edited By:

Updated on: Feb 25, 2026 | 5:31 AM

దిన ఫలాలు (ఫిబ్రవరి 25, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయానికి లోటుండకపోవచ్చు. వృషభ రాశి వారు ఇంటా బయటా అనుకూల పరిస్థితులు నెలకొనే అవకాశముంది. మిథున రాశి వారికి ఆర్థికంగా అనుకూలత పెరిగే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తొలగిపోతాయి. వృత్తి, వ్యాపారాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో పట్టుదలగా ముందుకు సాగుతారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు, ముఖ్యమైన కార్యక్రమాల్లో అవరోధాలు అధిగమిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ, ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తయి, చికాకులు తగ్గుతాయి. అవసరానికి మించి చేతిలో డబ్బు ఉండే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెట్టే సూచనలున్నాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం అవసరం.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి అవసరమైన పెట్టుబడులు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా అనుకూలత పెరుగుతుంది. పాత రుణాలు తీర్చగలుగుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు పనికి వస్తాయి. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి పెరుగుతుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. నూతన భూ సంబంధిత క్రయవిక్రయాల్లో లాభాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా సాగి పోతాయి. ఇతరుల బాధ్యతలను నెత్తిన వేసుకోవడం వల్ల బాగా ఇబ్బంది పడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పిల్లలు మంచి ఫలితాలు సాధిస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగులకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆటుపోట్లు అధిగమించి లాభాలు అందుకుంటారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణ సూచనలున్నాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కొద్ది శ్రమతో మొండి బాకీలను వసూలు చేసుకుంటారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచే ప్రయత్నాలను వేగిరం చేస్తారు. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి దూరపు బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలను ఆచరణలో పెట్టడం వల్ల మంచి ఫలితాలుంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

చేపట్టిన పనులు, వ్యవహారాలు, కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితులు ఉంటాయి. కొన్ని ముఖ్యమైన రుణాలను తీర్చగలుగుతారు. గృహ నిర్మాణ ఆలోచనలను ఆచరణలో పెడతారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. సహోద్యోగులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. చేపట్టిన పనుల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. కొన్ని ముఖ్య మైన విషయాల్లో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు బాగా కలిసి వస్తాయి. దగ్గర బంధువుల నుంచి శుభ కార్యాల ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ వృథా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

చేపట్టిన పనులన్నీ సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి. విలువైన వస్తువులు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలను అందుకుంటారు. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రశాంతతను పొందుతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. కార్యకలాపాలు, లావాదేవీలు, క్రయ విక్రయాలు ఉత్సాహంగా సాగుతాయి. రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైన వస్తు సామగ్రి కొనుగోలు చేస్తారు. వాహన యోగం పట్టే అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది. కుటుంబపరంగా ఒత్తిడి ఉంటుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలపైన దృష్టి పెట్టడం మంచిది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ధన సంబంధమైన ఇబ్బందులు కొద్దిగా ఒత్తిడి కలిగిస్తాయి. కుటుంబ విషయాల మీదా, పిల్లల చదువుల మీదా శ్రద్ధ పెట్టడం మంచిది. చేపట్టిన ముఖ్యమైన పనులు, వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులు చాలా కాలంలో నిరీక్షిస్తున్న అవకాశాలను దక్కించుకుంటారు. ఉద్యోగంలో అధికారుల ఆదరణ ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్ది శ్రమతో లాభాలు పొందుతారు. ఆదాయానికి లోటుండకపోవచ్చు. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపగలుగుతారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఇతరులతో వ్యవహరించడంలో తొందరపాటు పనికి రాదు. కొందరు బంధువుల నుంచి శుభకార్యాల ఆహ్వానాలు అందుతాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలుంటాయి. మిత్రులతో అపార్థాలు తొలగిపోతాయి. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో శ్రమాధిక్యత బాగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ, తిప్పట, వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి.

Follow Us