
దిన ఫలాలు(ఫిబ్రవరి 8, 2026): మేష రాశికి చెందిన ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగ బాధ్యతలను సంతృప్తికరంగా నెరవేరుస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. మిథున రాశి వారు ఆదాయ వృద్ధికి ప్రయత్నాలు సాగించడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఆర్థిక, ఆస్తి వ్యవహారాలను చక్కబెట్టి ఆర్థిక లాభాలు పొందుతారు. కుటుంబ బాధ్యతల నిర్వహణలో కొద్దిగా శ్రమ, ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. మిత్రులకు సహాయంగా నిలబడతారు. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు పాటించడం అవసరం. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.
ఉద్యోగ బాధ్యతలను సంతృప్తికరంగా నెరవేరుస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమ, తిప్పట ఉంటాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. నిరుద్యోగులకు శుభ వార్త అందే అవకాశం ఉంది. కొందరు మిత్రులకు ఆర్థికంగా సాయం చేయడం జరుగుతుంది.
గురు బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయ వృద్ధికి ప్రయత్నాలు సాగించడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగులు అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. కుటుంబంలో ఒకటి రెండు సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది.
ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు, అవరోధాలు తొలగిపోతాయి. ఆత్మ విశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. గ్రహ బలం చాలావరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఊపందు కుంటాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగానికి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. బంధుమిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి.
వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలు లభి స్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. కొద్దిపాటి ధన యోగానికి అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు బాగా కలిసి వస్తాయి. గృహ, వాహనాల కొనుగోలు మీద దృష్టి పెడతారు. ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. బంధువుల వ్యక్తిగత విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది.
సప్తమ శని కారణంగా వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితిలో ఆశించిన స్థాయి మెరుగుదల ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆవేశకావేషాలకు ఇది సమయం కాదు. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి.
రోజంతా చాలావరకు బాగానే గడిచిపోతుంది. ఉద్యోగంలో మాత్రం కొద్దిగా ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది. అధికారుల నుంచి ఒత్తిడి బాగా పెరుగుతుంది. బాధ్యతలను, లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ వృద్ధి చెందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. మిత్రుల వల్ల ఇరకాటంలో పడే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. అన్నిటా వ్యవహార జయం ఉంటుంది.
గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సానుకూలంగా, సంతృప్తి కరంగా సాగిపోతాయి. కొద్ది ప్రయత్నంతో అనుకున్న పనుల్ని అనుకున్నట్టు పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల సహాయంతో వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. సేవా కార్య క్రమాల్లో పాల్గొంటారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది.
ప్రస్తుతం తృతీయ స్థానం బాగా బలంగా ఉన్నందువల్ల అన్ని విషయాల్లోనూ పురోభివృద్ధి కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. రాజీమార్గంలో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో మీ సలహాలకు, సూచనలకు ప్రాధాన్యం పెరుగుతుంది. సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలం అవుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా సాగిపోతుంది.
ఉద్యోగుల ప్రతిభకు, శ్రమకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలను పొందుతారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. శుభ కార్యాలకు సంబంధించిన ఆలోచనలు చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వస్తు వాహనాల కొను గోలు మీద దృష్టి పెడతారు. ముఖ్యమైన వ్యవహారాలను వ్యయ ప్రయాసలకోర్చి పూర్తి చేస్తారు. కుటుంబానికి సంబంధించిన పనుల మీదా, సొంత పనుల మీదా శ్రద్ధ పెట్టడం చాలా మంచిది.
గురు బలం అనుకూలంగా ఉంది. రోజంతా సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఊహించని ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారులు తమకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. అనుకున్న పనులు, వ్యవహారాలు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆదాయం పెరగడం, ఖర్చులు తగ్గడం జరుగుతుంది. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పరిచయస్థుల్లో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.