దిన ఫలాలు (డిసెంబర్ 20, 2024): మేష రాశి వారికి ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశముంది. వృషభ రాశి వారికి వ్యాపారాలు ఆశించిన స్థాయిలో లాభసాటిగా సాగుతాయి. మిథున రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
గ్రహ బలం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీ పనులు, వ్యవహారాలు నిరాటంకంగా పూర్తవుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరి ష్కారమై, ఊరట లభిస్తుంది. కుటుంబ జీవితం సంతోషంగా సాగిపోతుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆహార, విహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
ఉద్యోగంలో కొద్దిగా పని భారం, పని ఒత్తిడి తప్పకపోవచ్చు. వృత్తి జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్య క్షేత్రం సందర్శిస్తారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. తోబుట్టువుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆదాయం సంతృప్తికర స్థాయిలో సాగిపోతుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది.
వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగులకు ఆశించిన సహాయ సహకారాలు అందజేస్తారు. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. ప్రతి విషయంలోనూ వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మిత్రులతో తొందరపాటు మాటలు మాట్లాడవద్దు. గృహ, వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందవచ్చు. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపో తాయి.
వృత్తి, ఉద్యోగాలు చాలావరకు సజావుగా సాగిపోతాయి. అధికారులకు చేదోడు వాదోడుగా ఉంటారు. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. అనుకున్న పనులన్నీ సంతృప్తి కరంగా పూర్తవుతాయి. ఆదాయానికి లోటు ఉండదు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. శ్రమ, తిప్పట ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలు, పనులను పూర్తి చేస్తారు. కుటుంబ విషయాల్లో కొద్దిపాటి ఓర్పు, సహనాలను పాటించడం మంచిది. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది.
వృత్తి, ఉద్యోగాలు సాదా సీదాగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొత్త అవకాశాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కొత్త నిర్ణయాలను అమలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఏ ప్రయత్నం చేపట్టినా విజయం సాధిస్తారు. కొందరు మిత్రులతో విందులో పాల్గొం టారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది.
వృత్తి, వ్యాపారాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. రాబడి బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఆదాయానికి లోటుండదు. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల ఆశించిన లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామితో వివాదాలకు అవకాశం ఇవ్వవద్దు. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగం లభించే సూచనలున్నాయి. ఆరోగ్య భంగం ఉండకపోవచ్చు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
ఉద్యోగంలో హోదా పెరగడానికి బాగా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. నిరుద్యోగులు ఎదురు చూస్తున్న శుభవార్త వింటారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా నెరవేరుతుంది. ఆర్థిక ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. ఆస్తి వ్యవహారాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. గృహ, వాహన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.
ఆర్థిక వాతావరణం అన్ని విధాలా మెరుగ్గా ఉంటుంది. భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేయడం జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. వృత్తి, వ్యాపా రాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగంలో బాధ్యతలు మారే సూచనలున్నాయి. కొందరు మిత్రుల వల్ల ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయట పడతారు. కుటుంబ పెద్దల సలహాలతో లాభం పొందుతారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
ఉద్యోగంలో అధికారులు, సహచరుల నుంచి ఆశించిన ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ముఖ్యమైన సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయటా గౌరవ మర్యా దలకు లోటుండదు. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు లాభదాయకంగా సాగిపోతాయి. ఆర్థికంగా ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు. తలపెట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చు బాగా పెరిగే అవకాశం ఉంది.
వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉండవచ్చు. విశ్రాంతి దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వ్యాపారంలో కొద్దిపాటి మార్పులు ప్రవేశపెడతారు. అదనపు ఆదాయ ప్రయ త్నాలు సజావుగా సాగిపోతాయి. అనేక మార్గాల్లో తప్పకుండా సంపాదన పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ధనపరంగా కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టడం మంచిది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది.
ఉద్యోగంలో బాధ్యతలు మారడానికి బాగా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు తగ్గ ట్టుగా లాభాలు గడిస్తారు. కుటుంబంలో కొద్దిగా పనిభారం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. జీవిత భాగస్వామితో వివాదాలకు అవకాశం ఇవ్వవద్దు. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. పిల్లలు చదువుల్లో వృద్దిలోకి వస్తారు.
వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, సానుకూలంగా సాగిపోతాయి. చిన్నా చితకా సమస్యలు, ఇబ్బం దులను అధిగమిస్తారు. వ్యాపారాల్లో లాభాలు బాగానే పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అను కూలంగా కొనసాగుతుంది. నిరుద్యోగులకు ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. బంధువు లతో శుభకార్యంలో పాల్గొంటారు. కుటుంబ జీవితం బాగా అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు ఉపశమనం పొందుతారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.