Horoscope Today: ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. శనివారం రాశి ఫలాలు..

కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు చేపట్టాలన్నా కొందరు తమ జాతకాలు, రాశిఫలాలను (Rasi Phalalu) అనుసరిస్తుంటారు. ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటుంటారు.

Horoscope Today: ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. శనివారం రాశి ఫలాలు..
Horoscope Today

Updated on: Aug 06, 2022 | 7:15 AM

Today Horoscope: జీవితంలో కొన్నిసార్లు మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే కీలక నిర్ణయాలు ఇబ్బందుల్లో పడేస్తుంటాయి. అందుకే కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు చేపట్టాలన్నా కొందరు తమ జాతకాలు, రాశిఫలాలను (Rasi Phalalu) అనుసరిస్తుంటారు. ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటుంటారు. ఆగస్టు 6 (శనివారం) న రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

  1. మేషం: ఈ రాశి వారికి శుభఫలితాలు ఉన్నాయి. ఒక ముఖ్యమైన పనిని సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన విషయంలో పురోగతి లభిస్తుంది.
  2. వృషభం: ఈ రాశివారికి ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలదు. కీలక విషయాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ప్రయాణాలు చేస్తారు.
  3. మిథునం: చేపట్టే పనుల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. పనులకు గుర్తింపు లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో లాభం చేకూరుతుంది.
  4. కర్కాటకం: ముఖ్యమైన వ్యవహరాల్లో పెద్దల సలహాలు సూచనలు తీసుకోవాలి. శారీరక శ్రమ పెరిగినప్పటకీ.. ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అనవసర విషయాలలో తలదూర్చకండి.
  5. సింహం: ఈ రాశి వారికి శుభ సమయం. కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. స్పష్టమైన ఆలోచనలతో ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి.
  6. కన్య: ఈ రాశివారు సమస్యలను అధిగమిస్తారు. కీలక విషయాల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. అందరి నుంచి ప్రశంసలు లభిస్తాయి.
  7. తుల: ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. చేపట్టిన పనుల్లో శ్రమ అధికమైనప్పటికీ.. ఆశించిన ఫలితం వస్తుంది. ఏకాగ్రతతో ముందుకు సాగాలి.
  8. వృశ్చికం: ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో పురోగతి లభిస్తుంది. సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. కుటుంబం నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి.
  9. ధనుస్సు: చేపట్టిన కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఆశించిన ఫలితం వస్తుంది. శుభ కార్యక్రమాలలో బంధుమిత్రులతో గడుపుతారు. పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి సహాయం అందుతుంది.
  10. మకరం: ఈ రాశివారు చేపట్టిన పలు కార్యాల్లో స్థిరమైన ఫలితాలను అందుకుంటారు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా బలపడతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం.
  11. కుంభం: చేపట్టిన కార్యక్రమాల్లో ఉత్సాహంతో పనిచేసి ఆశించిన ఫలితాన్ని పొందుతారు. ఆర్థికంగా బలపడతారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. విందు, వినోద కార్యక్రమాల్లో సన్నిహితులతో పాల్గొంటారు.
  12. మీనం: ఈ రాశివారు ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. భవిష్యత్తు ప్రణాళికల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలు ఫలిస్తాయి.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి