ఆ రాశుల వారికి ఊహించని పురోగతి, శుభవార్తలు.. 12 రాశుల వారికి సోమవారం నాటి దినఫలాలు..
ఆగస్టు 31, 2026 సోమవారం రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబం, ఆరోగ్యం, ప్రయాణాలకు సంబంధించిన దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఏ రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది? ఎవరు జాగ్రత్తగా వ్యవహరించాలి? ఈరోజు రాశిఫలాల్లో పూర్తి వివరాలు తెలుసుకోండి.

Horoscope Today (August 31, 2026): మేషం రాశి వారి ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారంలో మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. వృషభం రాశి వారి వృత్తి, వ్యాపారాల్లో ఒకటి రెండు ఆర్థిక సమస్యలు ఒత్తిడికి గురి చేస్తాయి. ఉద్యోగంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. మిథునం రాశి వారి వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిపాటి మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా బాధ్యతల్లో మార్పువస్తుంది. మరి మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఆదివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1):
ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారంలో మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. వృత్తి జీవితం లాభసాటిగా సాగిపోతుంది. అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తవుతాయి. ఆదాయానికి తగ్గ ఖర్చులుంటాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందు తాయి. కుటుంబ జీవితం ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిచిపోతుంది. జీవిత భాగస్వామి ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. పిల్లలు విజయాలు సాధిస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2):
వృత్తి, వ్యాపారాల్లో ఒకటి రెండు ఆర్థిక సమస్యలు ఒత్తిడికి గురి చేస్తాయి. ఉద్యోగంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన విధంగా కొన్ని ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు కూడా డిమాండ్ పెరుగుతుంది. బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. రుణ సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3):
వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిపాటి మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా బాధ్యతల్లో మార్పువస్తుంది. వ్యాపారాల్లో లాభాలకు ఇబ్బందేమీ ఉండదు. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడ తారు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది కానీ, వృథా ఖర్చులు ఇబ్బంది పెడతాయి. నిరుద్యోగు లకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్ని పట్టుదలగాపూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుంచి ఆశించిన తోడ్పాటు అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష):
ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో అదనపు లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు అందివస్తాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు సఫలమవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు, ఆదరణ పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిలకడగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం జాగ్రత్త. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన శుభవార్త వింటారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1):
ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని పెండింగ్ పనుల్ని పూర్తి చేస్తారు. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. పిల్లల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. మిత్రుల వల్ల వృథా ఖర్చులు కొద్దిగా పెరుగుతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2):
వృత్తి, ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా పురోగమిస్తాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగు తాయి. ప్రధాన విషయాలలో కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు, సమస్యలు చాలావరకు ఒక కొలిక్కి వస్తాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సమస్యల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆహార, విహారాల్లో వీలైనన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. ప్రయాణాలు లాభిస్తాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3):
ఆదాయం బాగానే ఉంటుంది. అవనసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. ఆర్థిక సహాయాలు కూడా తగ్గించుకోవడం మంచిది. వ్యాపారాలు నిదానంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. పని ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రతి పనిలోనూ వ్యయప్రయాసలుంటాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. అవసర సమయాల్లో బంధుమిత్రుల నుంచి సహాయం లభిస్తుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట):
ఉద్యోగంలో అధికారులు అతిగా ఉపయోగించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో పోటీ ఉన్నా లాభా లకు లోటుండదు. మిత్రుల సహాయంతో పనులన్నీ పూర్తవుతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. అనుకోకుండా వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కా రమవుతుంది. కొందరు బంధువులతో అపార్థాలు తలెత్తవచ్చు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించవచ్చు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1):
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం కొనసాగుతుంది. మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో కీలక మార్పులు చేపడతారు. లాభాలకు ఇబ్బందేమీ ఉండదు. ముఖ్యమైన పనులన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. కొందరు బంధుమిత్రులకు సహాయం చేస్తారు. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం అవసరం. ఆదాయానికి లోటు ఉండదు కానీ, కొన్ని అనవసర ఖర్చులు పెరగడానికి అవకాశం ఉంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2):
ఉద్యోగంలో చిన్నా చితకా సమస్యలు తొలగిపోతాయి. అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వృథా ఖర్చులతో ఇబ్బంది పడతారు. బంధువర్గం నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. విదేశాల నుంచి ఉద్యోగపరంగా ముఖ్యమైన సమాచారం అందుతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండకపోవచ్చు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3):
ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. ఆస్తి వివాదం నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇష్టమైన బంధువులతో శుభ కార్యంలో పాల్గొంటారు. కుటుంబ పరిస్థితులు బాగా మెరుగ్గా, అనుకూలంగా ఉంటాయి. ఆదాయానికి లోటుండదు. ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబ పెద్దలతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగాఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి):
కుటుంబ వ్యవహారాల్లో పారదర్శకంగా వ్యవహరించడం శ్రేయస్కరం. ఇంట్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. కొందరు బంధువుల నుంచి సమస్యలుంటాయి. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ జీవితం బాగానే సాగిపోతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.