Horoscope Today: ఈరోజు ఏ రాశివారికి వ్యాపారం, ఉద్యోగంలో కలిసి వస్తుంది.. ఏ రాశి వారి కుటుంబంలో సంతోషం ఉంటుందంటే..

|

Aug 28, 2021 | 7:42 AM

Horoscope Today (August 28th 2021): ప్రతి వ్యక్తి తనకు ఇష్టమైన దేవతను ఆరాధిస్తాడు.. భక్తితో పూజిస్తాడు. అయితే  రాశిఫలాలను నమ్మి పనులు చేసేవారు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా మనం రోజు మొదలు పెట్టాలనుకుంటే..

Horoscope Today: ఈరోజు ఏ రాశివారికి వ్యాపారం, ఉద్యోగంలో కలిసి వస్తుంది.. ఏ రాశి వారి కుటుంబంలో సంతోషం ఉంటుందంటే..
Horoscope Today
Follow us on

Horoscope Today (August 28th 2021): ప్రతి వ్యక్తి తనకు ఇష్టమైన దేవతను ఆరాధిస్తాడు.. భక్తితో పూజిస్తాడు. అయితే  రాశిఫలాలను నమ్మి పనులు చేసేవారు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా మనం రోజు మొదలు పెట్టాలనుకుంటే.. ఆ రోజు జరగబోయే మంచి చెడుల గురించి తెలుసుకోవాలని.. అప్పుడు ఏమి చేయాలి అనే విషయం గురించి ఓ అంచనాకు రావాలని.. రాశిఫలాలను చూస్తుంటారు. ఈ నేపధ్యంలో ఆగస్ట్ 28న రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేష రాశి: ఈరోజు ఈ రాశివారికి అనుకూలంగా ఉంది. శుభవార్త వింటారు. గౌరవ మర్యాదలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.

వృషభ రాశి: ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. ప్రయాణం చేసే సమయంలో జాగ్రత్త తీసుకోవాలి. దైవ దర్శనం చేసే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

మిధున రాశి: ఈరాశి వారికి ఆదాయం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. బంధుమిత్రులను కలుస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలుంటాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి.

కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారికి అన్ని విషయాలు అనుకూలంగా ఉంటాయి. తీసుకున్న నిర్ణయాలు సంతోషం కలిగిస్తాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. శుభవార్త వినే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారికి ప్రతికూల అంశాలు ఏర్పడే అవకాశం ఉంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది. ఏర్పడతాయి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. అనారోగ్య బాధలు అధికమవుతాయి.

కన్య రాశి: ఈ రాశివారికి పనులకు ప్రతికూలత ఏర్పడుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. బంధు మిత్రులతో శత్రుత్వం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లల విషయంలో నిర్ణయాలను అలోచించి తీసుకోవాల్సి ఉంది.

తుల రాశి: ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనుల్లో అవరోధానాలను అధిగమించి సక్సెస్ ను అందుకుంటారు. కుటుంబంతో, బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశి వారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆకస్మికంగా ఆదాయంపొందే అవకాశం ఉంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు పెడతారు. కీర్తి, ప్రతిష్ఠలు అధికమవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

ధనుస్సు రాశి: ఈరోజు ఈ రాశివారికి మిశ్రమఫలితాలుంటాయి. మిత్రులతో విబేధాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు ఏర్పడి ఆదాయం తగ్గుతుంది. క్రీడాకారులకు, రాజకీయ నేతలతో పాటు ఉద్యోగస్థులకు కొన్ని చిక్కులు ఏర్పడి చికాకు పెడతాయి. ఏమైనా కొత్తపనులు చేపట్టాలనుకుంటే వాటిని వాయిదా వేసుకోవడం ఉత్తమం.

మకర రాశి: ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది. కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. దైవ దర్శనం చేసుకుంటారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. కొత్త వ్యాపారాలలో మరింత ఉత్సాహం. నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది. పేరు ప్రతిష్టలు లభిస్తాయి.

కుంభ రాశి: ఈరాశి వారు చేపట్టినటువంటి పనులు విశేషంగా పూర్తి చేసుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉంటారు. వృత్తి వ్యాపారమున వ్యవహార అనుకూలత కలుగుతుంది. మానసిక ఆనందం పొందుతారు. వృత్తి, విద్యారంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది.

మీన రాశి: ఈ రాశివారికి ఈరోజు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. రాబడి కంటే ఖర్చులు అధికం. .. సన్నిహితులతో విభేదాలు ఏర్పడతాయి. చేపట్టిన పనులు నిదానంగా జరుగుతాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం దక్కదు. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది.

Also Read: Chanakya Niti: పాలకులకు.. మిత్రుడు అంటే ఎవరు.. ఎవరితో స్నేహం చేయాలో చెప్పిన చాణక్య..