Horoscope Today: రాశి ఫలాలు.. ఈ రాశుల వారు పడని వారితో దూరంగా ఉండటం మంచిది

|

Dec 14, 2021 | 5:56 AM

Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తులో ఏం జరుగబోతుందో ముందే తెలుసుకోవాలిని ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా తమ రోజు ఎలా ఉంటుంది.. ఏలాంటి..

Horoscope Today: రాశి ఫలాలు.. ఈ రాశుల వారు పడని వారితో దూరంగా ఉండటం మంచిది
Follow us on

Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తులో ఏం జరుగబోతుందో ముందే తెలుసుకోవాలిని ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా తమ రోజు ఎలా ఉంటుంది.. ఏలాంటి పరిణమాలు జరుగుబోతున్నాయి అని తెలుసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో రాశిఫలాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. డిసెంబర్‌ 14 (మంగళవారం) రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం.

మేష రాశి:
మానసికంగా దృఢంగా ఉంటారు. బంధుమిత్రుల సహాయం అందుతుంది. పడనివారితో దూరంగా ఉండటం మంచిది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

వృషభ రాశి:
ఆరోగ్యంపై దృష్టి సారించాలి. మానసిక శక్తి పెంచుకోవడం మంచిది. ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. అధికారులతో జాగ్రత్తగా ఉడాలి.

మిథున రాశి:
పెండింగ్‌లో ఉన్న ఓ సమస్య పరిష్కారం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో లాభాలు పొందుతారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు పడాతారు.

కర్కాటక రాశి:
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కీలక విషయాలలో నిర్ణయాలు తీసుకుంటారు.

సింహ రాశి:
అధికారులతో మంచి సంబంధాలు ఏర్పర్చుకుంటారు. సమస్యలను అధిగమిస్తారు. కొన్ని విషయాలలో ఆటంకాలు ఎదురవుతాయి. అధికంగా శ్రమించాల్సి ఉంటుంది.

కన్య రాశి:
అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి సాధిస్తారు.

తుల రాశి:
దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి సాయం అందుకుంతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాలు.

వృశ్చిక రాశి:
చేపట్టే పనులలో ఆటంకాలు ఎదురైనా ధైర్యంతో పూర్తి చేస్తారు. కుటుంబంలో సానుకూల వాతావరణం ఉండకపోవచ్చు. గోసేవా చేయడం వల్ల మంచి జరుగుతుంది.

ధనుస్సు రాశి:
మీమీ రంగాలలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యమైన పనులను చేపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. అధికంగా శ్రమించాల్సి ఉంటుంది.

మకర రాశి:
కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇతర విషయాలలో జోక్యం కలిగించుకోకపోవడం మంచిది.

కుంభ రాశి:
విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ధైర్యంతో ముందుగా సాగితే మంచి ఫలితాలు ఉంటాయి.

మీన రాశి:
ముఖ్యమైన విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఎంతో మంచిది. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. పెద్దలను సంప్రదించి కీలక లావాదేవీలు చేయడం మంచిది. శతృల విషయాలో ఆచితూచి అడుగులు వేయాలి.

ఇవి కూడా చదవండి:

Varanasi: పవిత్ర నగరం వారణాసిలో ఈ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తే జన్మధన్యం..

Lord Ganesha: బొప్పాయి పండులో బుల్లి ఆకృతిలో బొజ్జగణపయ్య.. మండపంలో ఉంచి పూజలు