Horoscope Today: ఈ రాశివారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.. ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..!
Horoscope Today: చాలా మంది ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటారు. రాశి ఫలాల (Rasi Phalalu)ను అనుసరించే..
Horoscope Today: చాలా మంది ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటారు. రాశి ఫలాల (Rasi Phalalu)ను అనుసరించే వారు చాలా మంది ఉంటారు. ఏ పనులు చేపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి.. ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందుకు సాగుతారు. ఏప్రిల్ 16 (శనివారం)న రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
- మేష రాశి: భవిష్యత్తు ప్రణాళిక వేస్తారు. వ్యాపారాలలో ముందుకు సాగుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
- వృషభ రాశి: చేపట్టిన పనులలో అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. ముఖ్యమైన కొనుగోళ్లు చేపడతారు.
- మిథున రాశి: అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ముందుకు సాగుతారు.
- కర్కాటక రాశి: కీలక వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. అనవసర విషయాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.
- సింహరాశి: కొన్ని కీలక నిర్ణయాలు అనుకూలంగా మారుతాయి. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
- కన్య రాశి: అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
- తుల రాశి: మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తోటి వారి నుంచి సహాయం అందుకుంటారు. కొందరి ప్రవర్తన వల్ల మీకు కాస్త ఇబ్బందిగా మారుతుంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.
- వృశ్చిక రాశి: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
- ధనుస్సు రాశి: వృత్తి, ఉద్యోగాల వారికి మంచి జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.
- మకర రాశి: సొంతింటి వ్యవహారంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి.
- కుంభ రాశి: కొన్ని పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బందులు పెడతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాల్లో మంచి అవకాశాలు కలుగుతాయి.
- మీన రాశి: భవిష్యత్తు కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కొన్ని విషయాలో బాధిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
ఇవి కూడా చదవండి: