Today Horoscope: మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ప్రమాదంలో పడుతుంటాం. అందుకే కొత్తపనిని మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. అందుకే పనులను మొదలుపెట్టే ముందు కొంతమంది తమ జాతకం, దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (నవంబర్ 9)న మంగళవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మేష రాశి:
ముఖ్యమైన విషయాలలో ఆలోచించి అడుగులు వేయడం మంచిది. వ్యాపారాలలో జాగ్రత్తలు తప్పనిసరి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది.
వృషభ రాశి:
చేపట్టిన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఓ విషయం మిమ్మల్ని ఆనందం కలిగిస్తుంది. బంధుమిత్రులతో చేపట్టిన పనులలో మంచి ఫలితాలు లభిస్తాయి.
మిథున రాశి:
అవసరానికి తగిన సహాయం అందుకుంటారు. బంధుమిత్రుల సూచనలు, సలహాలు పాటించడం మంచిది. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
కర్కాటక రాశి:
మీమీ రంగాలలో మంచి లాభాలు పొందుతారు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు.
సింహ రాశి:
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభాలు పొందుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
కన్య రాశి:
చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి.
తుల రాశి:
ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. మానసిక ఆందోళన కలుగుతుంది. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
వృశ్చిక రాశి:
కొన్ని కొన్ని సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి.
ధనుస్సు రాశి:
చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. శతృవులపై విజయం సాధిస్తారు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుటుంది.
మకర రాశి:
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా ధైర్యంతో అధిగమిస్తారు. ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. మీపై నిందలు వేసే అవకాశం ఉంది.
కుంభ రాశి:
చేపట్టే పనులలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. బంధు,మిత్రుల సూచనలు, సలహాలు పాటించాలి.
మీన రాశి:
ఓ వ్యవహారంలో సమయానికి డబ్బులు చేతికి అందుతారు. వివిధ వ్యాపారాలలో పెట్టుబడులు పెడతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
ఇవి కూడా చదవండి: