Today Horoscope: మనం కొన్ని సందర్భాల్లో ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ఇబ్బందుల్లో పడుతుంటాం. అందుకే కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా.. జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. అందుకే పనులను మొదలుపెట్టే ముందు కొంతమంది తమ జాతకం, దినఫలాలపై దృష్టిసారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (నవంబర్ 8న) సోమవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. ఓసారి తెలుసుకుందాం..
మేష రాశి: ఈ రాశి వారు ఈ రోజు కీలక వ్యవహారాలపై దృష్టిసారించాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబసభ్యుల సలహాలు సూచనలు పాటించాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.
వృషభ రాశి: ఈ రాశివారికి అన్ని రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి నూతన కార్యాలను ప్రారంభిస్తారు. బంధవులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి.
మిథున రాశి: కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ.. మనోధైర్యంతో ముందుకు సాగాలి. బుద్ధిబలాన్ని ఉపయోగించి ఆటంకాలను అధిగమిస్తారు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. జాగ్రత్తలు అవసరం.
సింహరాశి: ఈ రాశి వారు చేపట్టిన పనులను వేగంగా పూర్తిచేస్తారు. పనులకు ఆటంకం కలుగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. ఆచితూచి అడుగేయాలి.
కన్య రాశి: ఈ రాశివారికి మిశ్రమకాలం. శారీరక శ్రమ పెరగడంతోపాటు అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్య విషయల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి.
తుల రాశి: అన్ని పనులను సకాలంలో పూర్తిచేస్తారు. శారీరక శ్రమ ఫలిస్తుంది. ముఖ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు చేసే అవకాశముంది.
వృశ్చిక రాశి: ఈ రాశివారికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. కొన్ని సంఘటనలు మనోవేదనకు గురిచేస్తాయి. గొడవలకు దూరంగా ఉండాలి.
ధనుస్సు రాశి: ఈ రాశివారు శుభవార్త వింటారు. అవసరానికి ఆర్థిక సహాయం అందుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.
మకర రాశి: ఈరోజు చేపట్టిన పనులను ప్రణాళికాబద్దంగా సకాలంలో పూర్తిచేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి.
కుంభ రాశి: శ్రమ పెరిగినప్పటికీ… అనుకూల ఫలితాలు వస్తాయి. ముఖ్యమైన సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు.
మీన రాశి: ఈ రాశి వారు అనుకున్న పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేస్తారు. శారీరక శ్రమ పెరిగుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు.
Also Read: