Horoscope 8 July 2021: రాశిఫలాలను నమ్మి పనులు చేసేవారు చాలా మంది ఉంటారు. ముఖ్యంగా మనం రోజు ప్రారంభించేటపుడు మంచి చెడుల గురించి తెలుసుకుంటే.. ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుస్తుంది. అందుకోసమే జనాలు రాశిఫలాలను చూస్తుంటారు. ఈ నేపథ్యంలో జూన్ 8 న రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.
మేష రాశి: అనుకున్న కార్యాలను సాధించాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ భార్య భర్తలు కుటుంబ వ్యవహారాల మీద గొడవలు పడతారు. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. ఆఫీసు పనులలో అధిక శ్రమ. పనులను సకాలంలో పూర్తి చేయాలంటే మరింత కష్టపడాలి. ఆదాయ వ్యవహారాల్లో పెద్దవారి సహాయం లభిస్తుంది.
వృషభ రాశి: సహనంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు. వ్యాపారంలో భాగస్వాముల పట్ల జాగ్రత్త వహించండి. ఆఫీస్ పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. అనవసరపు ఖర్చులు వలన డబ్బుకి ఇబ్బంది. బంధువుల దగ్గర తీసుకున్న అప్పును వెంటనే తీర్చి వేయండి లేకుంటే చిక్కుల్లోపడతారు.
మిధున రాశి: ఆత్మవిశ్వాసాన్ని వదిలి పెట్టకండి. దైవప్రార్థన వల్ల మానసిక బలం. ప్రముఖ వ్యక్తుల సహాయం వల్ల ఎంతో ధైర్యం. డబ్బు సహాయం కోసం మీ దగ్గరకి జనాలు వస్తారు. మీ స్థితిగతులను తెలుసుకొని నిర్ణయం తీసుకోండి. ఆఫీసు పనులలో మీ నిబద్ధత మీద అందరి ప్రశంసలు. అతిశీతల పదార్ధాలు తినడం వలన పంటి నొప్పి.
కర్కాటక రాశి: ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆఫీసు పనుల్లో తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. పనులను పూర్తిచేస్తారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. పెట్టుబడులు పెట్టే ముందర అన్ని రకాల పథకాల గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.
కన్యారాశి: చేద్దామని అనుకున్న కార్యాలలో ఆటంకాలు. సహనంతో సరైన ప్రణాళికతో ప్రయత్నించండి. అనవసరమైన ఆడంబరాల కోసం ఖర్చు పెట్టడం వల్ల కలిగిన నష్టాన్ని గుర్తిస్తారు. తోటి ఉద్యోగులతో వాదోపవాదాలకు దిగకండి. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి. దాని వలన అపార్ధాలు తొలగిపోతాయి. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువ.
సింహరాశి: ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఈరోజు మీకు కావలసినంత ఆనందంగా గడపండి. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఆఫీసులో పని పట్ల మీ నిబద్ధతకు అందరి ప్రశంసలు. కావాల్సినంత ధనం చేతికందుతుంది. కుటుంబ అవసరాల కోసం ఖర్చు పెడతారు. ఫిట్నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం.
ధనుస్సు రాశి: పట్టుదలతో ఆశావాద దృక్పథంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆఫీసులో పనులను అధిక శ్రమ ఉన్నప్పటికీ సహనంతో సకాలంలో పూర్తి చేయండి. మనసు నిండా ధైర్యం నింపుకోండి. భయాలను పిరికితనాన్ని వదిలిపెట్టండి. కుటుంబ సభ్యులతో ఆదాయ వ్యవహారాల గురించి చర్చిస్తారు. కావలసిన ధనం చేతికందుతుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు.
వృశ్చిక రాశి: అతిగా బాధపడటం వల్ల మానసిక విచారం. దాని వల్ల ఎసిడిటీ. వీటిని వదిలించుకోండి. స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆఫీసులో పని పట్ల మీ నిబద్ధతకు అందరి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి. మీ పిల్లలతో గడపటం వలన మీకు ఎంతో ఎనర్జీ. అప్పులను తీర్చలేక ఉంటే ఇబ్బంది పడవలసి వస్తుంది.
తులారాశి: అనుకున్న కార్యాలను సాధించాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. దైవప్రార్థన వల్ల మానసిక బలం. పాతబాకీలు వసూలవుతాయి. ఆఫీసులో పనులను సకాలంలో పట్టుదలతో పూర్తి చేస్తారు. మీ భార్య భర్తల సామరస్య ధోరణి వల్ల కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. కుటుంబ సభ్యుల అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.
మకర రాశి: ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న కార్యాలు సాధిస్తారు. ఆదాయ వ్యవహారాలు మానసిక అశాంతిని కలగజేస్తాయి. ధైర్యాన్ని కోల్పోకండి. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ప్రేమికులకు మర్చిపోలేని రోజు. తోటి ఉద్యోగులతో సామరస్యంగా ఉండండి ఆధిపత్యం చెలాయించాలని చూడకండి. ఆదాయం పరవాలేదు.
కుంభరాశి: కుటుంబంలో కలహాల వల్ల మానసిక అశాంతి. ఇంటిలో పెద్ద వారి సలహాలు తీసుకోండి. చాలా మంది మీ దగ్గర నుంచి ఏదో ఆశిస్తారు ఎవ్వరికి తొందరపడి మాట ఇవ్వకండి. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేస్తారు తోటి ఉద్యోగుల మరియు పై అధికారుల ప్రశంసలు. ఆదాయ వ్యవహారాలు మరింత మెరుగు పడతాయి.
మీన రాశి: ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోండి. అతిగా తినడం వల్ల ఊబకాయం. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. భార్యతో గడపటం వల్ల మీకు ఎంతో ఎనర్జీ. ఊహించని శుభవార్త అందుతుంది. దానివలన కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం.