Horoscope 7 July 2021: కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం.. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా పడే అవకాశం..

|

Jul 07, 2021 | 6:02 AM

Horoscope 7 July 2021: రాశిఫలాలను నమ్మి పనులు చేసేవారు చాలా మంది ఉంటారు. ముఖ్యంగా మనం రోజు ప్రారంభించేటపుడు

Horoscope 7 July 2021: కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం.. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా పడే అవకాశం..
Horoschope Today
Follow us on

Horoscope 7 July 2021: రాశిఫలాలను నమ్మి పనులు చేసేవారు చాలా మంది ఉంటారు. ముఖ్యంగా మనం రోజు ప్రారంభించేటపుడు మంచి చెడుల గురించి తెలుసుకుంటే.. ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుస్తుంది. అందుకోసమే జనాలు రాశిఫలాలను చూస్తుంటారు. ఈ నేపథ్యంలో జూన్ 7 న రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

మేష రాశి: భార్య భర్తల సామరస్య ధోరణి వల్ల కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. అనుకున్న కార్యాలను సాధించాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. వ్యాపారస్తులు తమ భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించండి.

వృషభ రాశి: అనుకున్న కార్యాలను సాధించాలంటే సహనం, పట్టుదల అవసరం. కొత్త నగలు కొంటారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. దైవప్రార్థన వలన మానసిక బలం చేకూరుతుంది. వ్యాపారస్తులు లాభాల కోసం మరింత కష్టపడాలి.

మిధున రాశి: ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ముఖ్య నిర్ణయాలను ఆలోచించి ధైర్యంగా తీసుకోండి. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. పెద్ద వారి ఆశీర్వచనాలు లభిస్తాయి తోబుట్టువుల సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ కొరకు మరిన్ని పెట్టుబడులు పెడతారు

కర్కాటక రాశి: ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న కోర్టు కేసు తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఆఫీసులో పనులను చకచకా పూర్తి చేస్తారు. ఫిట్ నెస్ పై పూర్తి శ్రద్ధ పెట్టండి.

కన్యారాశి: కొంతమందికి దూరప్రయాణాల వల్ల శ్రమ ఖర్చు ఉంటుంది. అధిక కోపం వల్ల ఒత్తిడి ఉంటుంది. యోగ మెడిటేషన్ ఒక మంచి ఉపాయం. ఆఫీసు పనులను శ్రద్ధతో పూర్తిచేయండి అందరి ప్రశంసలు పొందుతారు. మీ భార్య భర్తల సామరస్య ధోరణి వల్ల కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. విదేశాలకు పైచదువులకు వెళ్లాలనుకునే విద్యార్థులకు శుభవార్త.

సింహరాశి: ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. కొత్త అవకాశాలు లభిస్తాయి. బహుమానాలు అందుకుంటారు. ఒక శుభవార్త అందుతుంది దానివల్ల కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. స్నేహితుల బంధువుల సహాయ సహకారాలు లభిస్తాయి. మీరు పొదుపు చేసిన డబ్బు మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది.

ధనుస్సు రాశి: ఆశావహ దృక్పథంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆదాయ వ్యవహారాలు మెరుగు పడతాయి. కుటుంబ సభ్యులు ముఖ్యంగా పెద్ద వారి సూచనలను స్వీకరించండి. అవసరాలకు తగినంత ఖర్చు పెడతారు. ఆఫీసు పనులను ఓపిక, సహనంతో పూర్తి చేయండి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు.

వృశ్చిక రాశి: ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారస్తులు లాభాలు కోసం మరింత కష్టపడాలి. ప్రభుత్వ టాక్స్ వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులు రోజూ ఆఫీసుకు ఆలస్యంగా రావడం వల్ల ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. పనులను సకాలంలో కష్టపడి పూర్తి చేస్తారు.

తులారాశి: ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోండి. అప్పులు ఎవరికీ ఇవ్వకండి. ఇస్తే భవిష్యత్తులో సమస్యలు రావచ్చు. ఆఫీసులో పనులలో మీ నిబద్ధత మరియు సామర్థ్యంపై అందరి ప్రశంసలు మీరు చేస్తున్న దుబారా ఖర్చులు ఇంట్లో సభ్యులకు నచ్చకపోవచ్చు.

మకర రాశి: ఒత్తిడి వల్ల కోపం, ఎసిడిటి, అనారోగ్యంగా ఉంటారు. ఆలోచించండి కుటుంబంలో కలహాలు వల్ల మానసిక అశాంతి ఉంటుంది. పాతబాకీలు వసూలవుతాయి. ఆఫీసులో అదనపు బాధ్యతల వల్ల అధిక శ్రమ ఉంటుంది. ఫిట్నెస్ పై శ్రద్ధ పెట్టండి.

కుంభరాశి: ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. స్నేహితుల సహాయం లభిస్తుంది. ఆఫీసు పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. మరింత కష్టపడండి. కావాల్సినంత ధనం చేతికందుతుంది బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. సరైన పథకాలలో పెట్టుబడులు పెట్టండి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు.

మీన రాశి: సహనం పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆఫీసు పనుల్లో అధిక శ్రమ. పనులు సకాలంలో పూర్తి కావాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. ఆదాయం పర్వాలేదు కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించండి.