Horoscope Today: వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం.. 12రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు

| Edited By: Janardhan Veluru

Dec 31, 2024 | 5:01 AM

Today Horoscope (December 31, 2024): మేష రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా మానసిక ఒత్తిడికి గురవుతారు. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో మీ సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. హోదాలు పెరిగే సూచనలున్నాయి. మిథున రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం.. 12రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 31st December 2024
Follow us on

దిన ఫలాలు (డిసెంబర్ 31, 2024): మేష రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా మానసిక ఒత్తిడికి గురవుతారు. వృషభ రాశి వారు బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. మిథున రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు బాగా పెరుగుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఇంటా బయటా మీ మాటకు ఎదురుండదు. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. రావలసిన డబ్బు, బాకీలు వసూలవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా మానసిక ఒత్తిడికి గురవుతారు. గౌరవ మర్యాదలకు, పలుకుబడికి లోటుండదు. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో మీ సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. హోదాలు పెరిగే సూచనలున్నాయి. వ్యాపారాల్లో కొన్ని కీలక మార్పులు చేపడతారు. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహా రాలు చక్కబడతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. బంధువులలో ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో సకాలంలో బాధ్యతలను, లక్ష్యాలను పూర్తి చేస్తారు. మీ సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబసమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. పిల్లల గురించి శుభవార్తలు వింటారు. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. ఆదాయం బాగానే వృద్ధి చెందు తుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మిత్రుల వల్ల మోసపోయే అవకాశముంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించినంతగా లాభాలు రాకపోవచ్చు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆస్తి వివాదం ఒకటి అనుకో కుండా పరిష్కారం అవుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇష్టమైన బంధుమిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. కానీ, ముఖ్యమైన పనులు సాఫీగా సాగిపోతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాల మీద మరింతగా శ్రద్ధ పెంచడం మంచిది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆర్థిక ప్రయత్నాలు అను కూల ఫలితాలనిస్తాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. కొందరు చిన్ననాటి మిత్రులతో కాల క్షేపం చేస్తారు. బంధువులతో శుభ కార్యంలో పాల్గొంటారు. మంచి పరిచయాలు కలుగుతాయి. ఇంటా బయటా మంచి గుర్తింపు లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో మీ ప్రతిభా పాటవాలకు గుర్తింపు లభించడం, హోదా పెరగడం వంటివి జరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. రావలసిన సొమ్ము సమయానికి చేతికి అందు తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల సమాధానం లభి స్తుంది. ఆదాయంలో ఆశించిన పెరుగుదల ఉంటుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగు తాయి. ఇష్టపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం నిశ్చయమయ్యే అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో మీ సమర్థతను నిరూపించుకుంటారు. గౌరవాభిమానాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపా రాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. అద నపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే సూచ నలున్నాయి. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమై. మనశ్శాంతి కలుగుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో పని భారం, ఒత్తిడి తప్పకపోవచ్చు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగు తాయి. కుటుంబ జీవితం బాగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టడం మంచిది. కొందరు సన్నిహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూలపడతాయి. రావలసిన డబ్బు కూడా కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యల నుంచి బయ టపడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. బంధువుల నుంచి శుభ కార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ప్రముఖులతో స్నేహ సంబంధాలు ఏర్పడ తాయి. అనుకున్న వ్యవహారాలు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో పని ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంటుంది. విశ్రాంతి లభించని పరిస్థితి ఏర్పడుతుంది. అధికారులతో ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆశించిన స్థాయిలో రాబడి వృద్ధి చెందుతుంది. ఆదాయంలో ఆశించిన స్థాయిలో పెరుగుదల ఉంటుంది. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. నిరుద్యోగులకు ఆశించిన సమా చారం అందుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో శ్రమాధిక్యత ఎక్కువగా ఉంటుంది. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు, ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ముఖ్యంగా ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల విషయంలో ఆశించిన సమాచారం అందుతుంది. మీ సలహాలు, సూచనలకు విలువ ఏర్పడు తుంది. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. పిల్లల చదువులు సంతృప్తికరంగా సాగిపోతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. వ్యక్తిగత సమ స్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. దైవ కార్యాల మీద ఖర్చు ఎక్కువవుతుంది. పిల్లలకు చదువుల మీద శ్రద్ధాసక్తులు పెరుగుతాయి.