Horoscope Today: ఆ రాశి వారి పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.. 12 రాశుల వారికి మంగళవారం రాశిఫలాలు..!

| Edited By: Janardhan Veluru

Apr 30, 2024 | 5:01 AM

దిన ఫలాలు (ఏప్రిల్ 30, 2024): మేష రాశికి చెందిన నిరుద్యోగుల ప్రయత్నాలు ఈ రోజు చాలావరకు ఫలిస్తాయి. వృషభ రాశి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయట పడతారు. మిథున రాశి వారిపై వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు నమ్మకం బాగా పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశి వారి పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.. 12 రాశుల వారికి మంగళవారం రాశిఫలాలు..!
Horoscope Today 30th April 2024
Follow us on

దిన ఫలాలు (ఏప్రిల్ 30, 2024): మేష రాశికి చెందిన నిరుద్యోగుల ప్రయత్నాలు ఈ రోజు చాలావరకు ఫలిస్తాయి. వృషభ రాశి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయట పడతారు. మిథున రాశి వారిపై వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు నమ్మకం బాగా పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం కొనసాగుతుంది. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశముంది. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయప్రయాసలుంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు చాలావరకు ఫలిస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆర్థిక లావాదేవీల్లో లాభాలు చవి చూస్తారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయట పడతారు. ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉన్నా తగిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు పరవాలేదని పిస్తాయి. వృత్తి జీవితం కొత్త పుంతులు తొక్కుతుంది. అదనపు ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు అందివస్తాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు మీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది. ఉత్సాహంగా కొత్త బాధ్యతలను నిర్వర్తిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. మిత్రులతో సఖ్యత పెరుగుతుంది. బంధువుల్ని శుభ కార్యంలో కలుసుకుంటారు. కొందరు స్నేహితులు తప్పుదోవ పట్టిస్తారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఆధ్యాత్మిక, సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగిపోతాయి. మీ ప్రతిభకు కొత్త ప్రోత్సాహకాలను అందుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపారాలో చిన్నా చితకా సమస్యలను అధిగమిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆశించిన ఆఫర్లు అందుతాయి. కుటుంబ పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాలలో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు లాభాల పరంగా అభి వృద్ధి బాటపడతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమయ్యే అవకాశముంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. కొద్దిపాటి వ్యయప్రయాసాలతో పెండింగు పనులు, వ్యవహారాలు పూర్తవుతాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి.. ప్రయాణాల్లోనూ, ఆహార నియమాల్లోనూ జాగ్రత్త అవసరం.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగ జీవితం బరువు బాధ్యతలతో సాగిపోతుంది. వృత్తి జీవితంలో కొద్దిగా శ్రమాధిక్యంత ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఇష్టమైన బంధుమిత్రులను కలుసు కుంటారు. కుటుంబ పరిస్థితులు బాగా చక్కబడతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. మంచి పరిచ యాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పరవాలేదు. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో ఒత్తిడి, భారం తగ్గే అవకాశం ఉంది. వృత్తి జీవితం బాగా బిజీ అవుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. తలపెట్టిన పనులన్నీ పూర్తవు తాయి. రియల్ ఎస్టేట్, లిక్కర్, రాజకీయాలు వంటి రంగాల్లో ఉన్నవారికి అనుకూల వాతావరణం కనిపిస్తోంది. కుటుంబ పరిస్థితులు సానుకూలంగా, సామరస్యంగా ఉంటాయి. ఆరోగ్యం పరవా లేదు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో అధికారులు బరువు బాధ్యతలను పెంచుతారు. అధికారాలను పంచుకోవాల్సి వస్తుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఇష్టమైన బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయ త్నాలు సత్ఫలితాలనిస్తాయి. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1)

వృత్తి, ఉద్యోగాలలో అనుకోని ధన లాభం ఉంటుంది. వ్యాపారాలు మూడు పువ్కులు ఆరు కాయ లుగా ‍సాగిపోతాయి. కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అయ్యే అవకాశముంది. ప్రయాణాల వల్ల ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి. ఉన్నతస్థాయి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ తాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందు తాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలించి, ఆశించిన సంబంధం ఖాయమవుతుంది. ఆరోగ్యం పరవాలేదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో గౌరవాభిమానాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు ఉంటాయి. ఇంటా బయటా సానుకూల వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులు మీ సలహాలు, సూచనల వల్ల లబ్ధి పొందుతారు. మిత్రుల నుంచి శుభ కార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబ పరిస్థితులు హ్యాపీగా సాగుతాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. విశ్రాంతికి కూడా సమయం ఉండదు. వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు వీలైనం తగా సహాయపడతారు. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీ నుంచి ఆఫర్ అందుతుంది. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. కొందరు బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆస్తి వ్యవహారాలను చక్కబెడతారు. ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారమవుతుంది. తల్లితండ్రులు లేదా దూర ప్రాంతంలో ఉన్న పిల్లలు ఇంటికి వచ్చే సూచనలున్నాయి. అదనపు ఆదాయానికి అవకాశాలు పెరుగుతాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. మోసపోయే అవకాశముంది. వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల నిలకడగా సాగిపో తాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు.