Rasi Phalalu Today: నిత్యం మనకు అవసరం లేని విషయాల్లో కూడా.. మనం తల దూర్చడానికి ప్రయత్నాలు చేస్తుంటాం. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంటుంది. ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో జీవితాలు చిన్నాభిన్నం అవుతుంటాయి. కావున తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ, చేపట్టే ప్రతీ కార్యక్రమంలోనూ ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆదివారం ముఖ్యంగా పలు రాశుల వారికి పరిస్థితులు అస్సలు అనుకూలంగా లేవు. మరికొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంది. అసలు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలగనున్నాయో.. ఓ సారి పరిశీలిద్దాం..
మేష రాశి: ఈ రాశి వారు ఈ రోజు వ్యక్తిగతమైనటువంగటి కార్యక్రమాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని పనులు చేపట్టే అవకాశముంది. దక్షిణమూర్తి వారి ఆరాధన, దర్శన మేలు చేస్తుంది.
వృషభరాశి: ఈ రాశి వారు ఈ రోజు వ్యక్తిగత అవసరాల కోసం కొన్ని అప్పులు చేస్తుంటారు. ఉద్యోగులు పలు విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మీ పై అధికారుల ఆగ్రహానికి గురికాకుండా చూసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన మేలు చేస్తుంది.
మిథున రాశి: ఈ రాశి వారు స్నేహితులు, బంధువుల నుంచి వేరు వేరు రూపాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటుంటారు. ఆధ్యాత్మిక చింతనలో ఉండటం వలన కొన్ని రకాల శుభఫలితాలు కలుగుతాయి. శంఖ పుష్పాలను శ్రీవేంకటేశ్వర స్వామి వారికి సమర్పిస్తే మేలు జరుగుతుంది.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ది నెమ్మదిగా ప్రారంభమవుతూ ఉంటాయి. కొన్ని రకాల అనారోగ్య భావనలు కూడా ఏర్పడవచ్చు. ముఖ్యమైనటువంటి నిర్ణయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. గణపతియే నమ: నామస్మరణ మేలు చేస్తుంది.
సింహ రాశి: ఈ రాశి వారికి సౌకర్యాలతో కూడుకున్నటువంటి అభివృద్ధి ప్రారంభమవుతూ ఉంటుంది. వాహన సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. నందీశ్వరుని దర్శనం మేలు చేస్తుంది. .
కన్యా రాశి : ఈ రాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటుంటాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే విషయంలో పెద్దవారి సలహాలు తీసుకోవడం మంచిది. లక్ష్మీనారసింహాస్వామి వారి దర్శనం మేలు చేస్తుంది.
తులా రాశి: ఈ రాశి వారు అనుకున్నటువంటి కార్యక్రమాల్లో కొంత మాట విలువను కోల్పోతుంటారు. ఇతరులకు హామీలు ఇచ్చే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టలక్ష్మిస్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
వృశ్చిక రాశి: ఈ రాశి వారు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల సంఘంలో గౌరవం కోల్పోతూ ఉంటారు. జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. హనుమాన్ చాలీసా పారాయణం మేలు చేస్తుంది.
ధనస్సు రాశి: ఈ రాశి వారు చేపట్టిన పనుల వల్ల ఎక్కువగా శ్రమకు గురవుతూ ఉంటారు. ఉద్యోగాది విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. విష్ణుపూజ మేలు చేస్తుంది.
మకర రాశి: ఈ రాశి వారు కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాలు ఏర్పడుతుంటాయి. రావలసిన బాకీలు వసూలు చేసుకుంటుంటారు. రాజరాజేశ్వరీ అమ్మవారి స్తోత్రపారాయణం మేలు చేస్తుంది.
కుంభ రాశి: ఈ రాశి వారు ఈ రోజు అనుకోనటువంటి ప్రయాణాలు చేయాల్సిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుండాలి. దుర్గాసప్తశ్లోక పారాయణం మేలు చేస్తుంది.
మీన రాశి: ఈ రాశి వారు ఆస్థి వివాదాలను పరిష్కరించుకోవాల్సిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ఉద్యోగాది విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మహాగణపతి అర్చన మేలు చేస్తుంది.