Horoscope Today: ఆరోగ్యం పట్ల ఆ రాశి వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు..

| Edited By: Janardhan Veluru

Feb 29, 2024 | 5:01 AM

దిన ఫలాలు (ఫిబ్రవరి 29, 2024): మేష రాశి వారు వృత్తి, ఉద్యోగాలకు సంబంధించినంత వరకు ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో వృషభ రాశి వారి మాట చెల్లుబాటు అవుతుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. పదోన్నతికి అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆరోగ్యం పట్ల ఆ రాశి వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు..
Horoscope Today 29th February 2024
Follow us on

దిన ఫలాలు (ఫిబ్రవరి 29, 2024): మేష రాశి వారు వృత్తి, ఉద్యోగాలకు సంబంధించినంత వరకు ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో వృషభ రాశి వారి మాట చెల్లుబాటు అవుతుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. పదోన్నతికి అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాలకు సంబంధించినంత వరకు ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. జీవితంలో మరింతగా వృద్ధిలోకి రావడానికి సంబంధించి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించుకుంటారు. వ్యాపారంలో మీ సరికొత్త నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబ వ్యవహారాలు చాలా వరకు చక్కబడతాయి. వ్యక్తిగత విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. కొందరు స్నేహితుల ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాట చెల్లుబాటు అవుతుంది. వ్యాపారంలో లాభాలకు లోటుండకపోవచ్చు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవు తుంది. మనసులోని కోరిక నెరవేరుతుంది. సమాజంలో పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు కొద్దిగా నిరుత్సాహం కలిగించే అవకాశం ఉంది. సోదరులతో వివాదం సమసిపోతుంది. కుటుంబ జీవితంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. ఆరోగ్యం పరవాలేదు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. పదోన్నతికి అవకాశం ఉంది. చేపట్టిన పనులు విజ యవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులు పరిచయమవుతారు. బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందు తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల సమాచారం అందుతుంది. ఆహార, విహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో ఒకటి రెండు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని విధంగా సంపాదన పెరుగుతుంది. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. అనుకోని ఖర్చులు మీద పడే అవకాశముంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. జీవిత భాగ స్వామితో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉండవచ్చు. పిల్లల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగ జీవితం సాఫీగా, ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా పురోగతి చెందుతాయి. సొంత పనుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. మితిమీరిన ఔదార్యంతో ఇత రులకు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. స్నేహితుల వల్ల నష్టపోయే సూచనలున్నాయి. నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు అంది వస్తాయి. ఆరోగ్యం అన్నివిధాలా అనుకూలిస్తుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాబాల బాట పడతాయి. ముఖ్యమైన పనుల్లో మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. సోదర వర్గంతో ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే సూచనలున్నాయి. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకు న్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. కొత్త నిర్ణయాలకు, కొత్త కార్యక్రమాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

అన్ని రంగాలవారికి సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలి స్తాయి. వృత్తి, వ్యాపారాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. లాభాలకు, రాబడికి లోటుం డక పోవచ్చు. ఉద్యోగంలో మీ పని తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. బంధు వర్గంలో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో అధికారుల నుంచి కొద్దిగా ఇబ్బందులుంటాయి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. కుటుంబ సభ్యులతో తొందరపడి మాట్లా డడం మంచిది కాదు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా ముందుకు సాగుతాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపా రాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. చేపట్టిన పనులు అవరోధాలు లేకుండా పూర్తవు తాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఆధ్యాత్మిక వ్యవహారా లపై దృష్టి సారిస్తారు. ప్రస్తుతానికి ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. అదనపు ఆర్థిక ప్రయత్నాలు కొద్దిగా మందగిస్తాయి. ఆరోగ్యం పరవాలేదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో మీ పని తీరుకు అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. బాగా ఇష్టమైన వ్యక్తుల్ని, బంధువుల్ని కలుసుకుంటారు. కుటుంబ సభ్యులతో విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. అవసరాలకు తగ్గట్టుగా చేతికి డబ్బు అందుతుంది. స్వల్ప అనారోగ్యానికి, మానసిక ఒత్తిడికి అవకాశం ఉంది. ఆహార విహారాల్లోనే కాక, ప్రయాణాల్లోనూ జాగ్రత్తలు పాటించడం మంచిది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. అధికారులు బాధ్యతలు పెంచుతారు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్త అందుతుంది. వివాహ ప్రయత్నాలు సానుకూలపడతాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాలపై శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్త వుతాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో అధికారులు అతిగా ఆధారపడడం వల్ల పని భారం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభసాటి వాతావరణం ఉంటుంది. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ సభ్యుల ద్వారా ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశముంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం పరవాలేదు. ప్రయాణాలు వాయిదా పడతాయి.