Horoscope Today: వారు ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

| Edited By: Janardhan Veluru

Sep 28, 2024 | 5:01 AM

దిన ఫలాలు (సెప్టెంబర్ 28, 2024): మేష రాశి వారు ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో ఇతరుల జోక్యానికి అవకాశం ఇవ్వవద్దు. వృషభ రాశి వారు ఉద్యోగంలో కొన్ని సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. మిథున రాశి వారికి రుణ సంబంధమైన ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: వారు ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు
Horoscope Today 28th September 2024
Follow us on

దిన ఫలాలు (సెప్టెంబర్ 28, 2024): మేష రాశి వారు ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో ఇతరుల జోక్యానికి అవకాశం ఇవ్వవద్దు. వృషభ రాశి వారు ఉద్యోగంలో కొన్ని సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. మిథున రాశి వారికి రుణ సంబంధమైన ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. కీలక వ్యవహారాల్లో శ్రమ, తిప్పట తప్పకపోవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో ఇతరుల జోక్యానికి అవకాశం ఇవ్వవద్దు. ఇంటా బయటా ఊహించని విధంగా అనుకూలతలు పెరుగుతాయి. ఆదా యం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. నిరు ద్యోగులకు సొంత ఊర్లోనే ఆఫర్లు అందుతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చు బాగా పెరుగుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో కొన్ని సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ముఖ్యమైన పనులు, వ్యవహా రాల్లో అవాంతరాలు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. కొన్ని సమస్యలను, వివాదాలను పరిష్కరించు కుంటారు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. నూతన వాహన యోగం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించవచ్చు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగ వాతావరణం సానుకూలంగా సాగిపోతుంది కానీ, వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా చికాకులు తప్పకపోవచ్చు. రుణ సంబంధమైన ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటికి దగ్గర బంధువుల రాకపోకలుంటాయి. బంధుమిత్రులతో కొన్ని వివాదాలు, అపార్థాల నుంచి బయటపడతారు. ప్రయాణాలు బాగా లాభసాటిగా సాగిపోతాయి. పిల్లలు కొద్ది శ్రమతో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆశించినంత కాకపోయినా ఆదాయం బాగానే పెరుగుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

మంచి పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో కొన్ని ముఖ్యమైన సమస్యలను అధి గమిస్తారు. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి జీవితం సజావుగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు కొన్ని మంచి ఆఫర్లు అందుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధి స్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల మీద ఆసక్తి పెరుగుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృథా ఖర్చులను తగ్గించాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో అధికారులకు నమ్మకం పెరిగి కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. వృత్తి, వ్యాపారాలను విస్త రించే ఆలోచన చేస్తారు. చేపట్టిన పనులు, వ్యవహారాలన్నీ ఎటువంటి అవాంతరాలూ లేకుండా తేలికగా పూర్తవుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు లాభదాయకంగా సాగిపోతాయి. పెళ్లి ప్రయ త్నాల విషయంలో బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. కొద్ది ప్రయత్నంతో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యానికి ఢోకా లేదు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, వ్యాపారాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో పనిభారం, ఒత్తిడి ఉన్నప్పటికీ పనితీరుతో అధికారులకు సంతృప్తికలిగిస్తారు. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటుతో వ్యవహరిం చకపోవడం మంచిది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఆదాయానికి లోటు ఉండడకపోవచ్చు. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో అధికారులు, సహోద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. దాయాదులతో ఆస్తి వివాదాలను రాజీమార్గంలో పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. సొంత ఇంటి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. బంధు మిత్రుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ప్రతివారితోనూ, ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. కొందరు బంధు మిత్రులతో అపార్థాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో సామాన్య లాభాలుంటాయి. చేప ట్టిన పనులు, కార్యక్రమాలు సవ్యంగా సాగిపోతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. పిల్లల చదువుల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆర్థిక వ్యవహారాల్లో వీలైనంత అప్రమత్తంగా ఉండడం మంచిది. ప్రయాణాల వల్ల ఆశించిన లాభాలు పొందుతారు. ఆర్థిక ఇబ్బందులు, సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. సోద రులతో విభేదాలు తొలగిపోతాయి. ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకో వద్దు. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో ఆలోచించి ముందుకు వెళ్లడం మంచిది. సొంత ఇంటి కోసం ప్రయత్నాలు సాగిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కీలక మార్పులు చేపడతారు. ఉద్యోగ జీవితం ఉత్సా హంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించక నిరుత్సాహపడతారు. పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆదా యానికి తగ్గట్టుగా ఖర్చులు పెరుగుతాయి. లాభదాయక పరిచయాలు వృద్ధి చెందుతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

స్థిరాస్తి వ్యవహారాల్లో చిక్కులు తలెత్తుతాయి. కీలక విషయాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. చేపట్టిన పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెడతారు. ఉద్యోగ జీవితంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి జీవితం ఆశాజనకంగా సాగిపోతుంది. ఆదా యం నిలకడగా సాగిపోతుంది. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆరోగ్యం మీద కొంత శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అయి, సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపా రాల్లో లాభాలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. కుటుంబ జీవితం ఉత్సా హంగా సాగిపోతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందు తుంది. ఆర్థిక వ్యవహారాలను మరింత జాగ్రత్తగా నిర్వహించడం అవసరం. ఆరోగ్యం బాగానే ఉంటుంది.