జూలై 27 దిన ఫలాలు: వీరి టైమ్ మారబోతుంది! మరి మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి!

దిన ఫలాలు (జూలై 27, 2026): మేషం నుండి మీనం వరకు అన్ని రాశుల వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి, ఆర్థిక లాభాలు ఉంటాయి. కొందరికి కుటుంబ సంబంధాలు మెరుగుపడి, శుభవార్తలు వింటారు. అలాగే పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

జూలై 27 దిన ఫలాలు: వీరి టైమ్ మారబోతుంది! మరి మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి!
Horoscope Today 27 July 202

Edited By:

Updated on: Jul 27, 2026 | 6:30 AM

దిన ఫలాలు (జూలై 27, 2026): ఈ రోజు దిన ఫలాలు మీ భవిష్యత్తును వెల్లడిస్తున్నాయి. ఈ రోజు మేషం నుండి మీనం వరకు అన్ని రాశుల వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి, ఆర్థిక లాభాలు ఉంటాయి. కొందరికి కుటుంబ సంబంధాలు మెరుగుపడి, శుభవార్తలు వింటారు. ఆరోగ్యం, వ్యక్తిగత విషయాలపై దృష్టి సారించాల్సిన రాశులు కూడా ఉన్నాయి. మీ రాశి ఫలం తెలుసుకుని, రోజును ప్రణాళిక చేసుకోండి.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాట చెల్లుబాటవు తుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. అదనపు ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు బాగా సఫలం అవుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కొందరు ముఖ్యమైన స్నేహితుల సహాయంతో వ్యక్తి గత పనులను పూర్తి చేస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆశించిన శుభవార్తలు వింటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా పురోగమిస్తాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆదాయ వృద్ధికి కొత్త మార్గాలు అందుబాటులోకి వస్తాయి. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారమవుతుంది. కుటుంబ సభ్యుల మీద బాగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఉద్యోగం మారే ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. పిల్లల వృద్ధిలోకి వస్తారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

రోజంతా అనుకూలంగా గడిచిపోతుంది. ముఖ్యంగా ఏ పని తలపెట్టినా విజయం సాధించే అవ కాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో సమర్థవంతంగా బాధ్యతలను నిర్వర్తిస్తారు. అధికారుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు ఇది బాగా అనుకూల సమయం. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొం టారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్త వింటారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

సొంత పనులు, బాధ్యతల మీద దృష్టి కేంద్రీకరించడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్య తలు బాగా పెరుగుతాయి. ఉద్యోగ వాతావరణం బాగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటా బయటా పని ఒత్తిడి ఉంటుంది. తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశా జనకంగా ముందుకు సాగుతాయి. కొత్త వ్యాపారాలకు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యులతో కొద్దిగా మాట పట్టింపులకు అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు కొన్ని ప్రత్యేక లక్ష్యాలను అప్పగించడం జరుగుతుంది. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. తోబుట్టువులతో ఉన్న స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగు తాయి. కొద్ది ప్రయత్నంతో ఏ ముఖ్యమైన వ్యవహారమైనా పూర్తి అవుతుంది. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి.ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆదాయం పెరిగినా అనుకోని ఖర్చులుంటాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో మరింతగా పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా పురోగమిస్తాయి. ఆక స్మిక ధన లాభ సూచనలున్నాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. జీవిత భాగ స్వామితో కలిసి నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కొన్ని దీర్ఘకాలిక వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. స్థిరాస్తికి సంబంధించిన క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం అవసరం.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో రాబడి, లాభాలు నిలకడగా కొనసాగుతాయి. పెట్టుబడులకు తగ్గట్టు ఆదాయం గడించే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతికి బాగా అవకాశం ఉంది. తల్లితండ్రుల నుంచి ఆశిం చిన సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ పరిస్థితులు చాలావరకు అనుకూలంగా సాగు తాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. బంధువర్గం నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ వ్యవహారాల్లో ఇతరుల్ని జోక్యం చేసుకోనివ్వవద్దు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి.ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. ఉద్యోగం మారే ప్రయత్నాల్ని వాయిదా వేయడం మంచిది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. భూ సంబంధమైన క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుం టారు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామికి గుర్తింపు లభిస్తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు బరువు బాధ్యతలు పెంచుతారు. కొన్ని ముఖ్యమైన లక్ష్యాల్ని అప్ప గించే అవకాశం ఉంది. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి ఆశించిన లాభాలను పొందుతారు. కొందరు బంధువులు, స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది. కుటుంబసమేతంగా తీర్థయాత్ర లేదా విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. చిన్న నాటి స్నేహితులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. ఆర్థిక సమస్యల్ని బాగా తగ్గించుకుంటారు. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం కానీ చేయవద్దు. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దాల్సిన అవసరం ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం పరవాలేదు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఇతరుల బాధ్యతల్ని తలకెత్తుకుని ఇబ్బంది పడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది కానీ, వృథా ఖర్చులు అదుపు తప్పుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూ లంగా సాగిపోతాయి కానీ, కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. చేప ట్టిన పనుల్లో శ్రమాధిక్యత ఉంటుంది. ఇంటా బయటా పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. కొందరు స్నేహితుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అందుకు తగిన ప్రతిఫలం ఉంటుంది. వృత్తి, వ్యాపా రాల్లో లాభాలకు లోటుండదు. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు లాభ సాటిగా ఉంటాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. గృహ నిర్మాణానికి సంబంధించిన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

Follow Us