ఉద్యోగంలో పని భారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలి స్తాయి. వృత్తి, వ్యాపారాలు చాలావరకు నిలకడగా సాగిపోతాయి. ఇంటా బయటా అనుకూల పరిస్థి తులుంటాయి. ఆరోగ్యం విషయంలో డాక్టర్ ను సంప్రదించాల్సి వస్తుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు, కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికి రావు. బంధుమిత్రుల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంపాదన బాగా పెరుగుతుంది.
వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. దీర్ఘకాలిక రుణ భారం చాలావరకు తగ్గి పోయి, ఊరట చెందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. ప్రతి పనీ, ప్రయత్నమూ సకాలంలో పూర్తవుతుంది. ఒక శుభ కార్యం గురించి ప్లాన్ చేస్తారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి.
వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు మీ పనితీరు సంతృప్తి కలిగిస్తుంది. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. కొందరు మిత్రులతో వివాదాలు తలెత్తుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. ఆదా యం బాగానే వృద్ధి చెందుతుంది. కుటుంబ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ప్రయా ణాల వల్ల విశ్రాంతి తగ్గుతుంది. ఆధ్యాత్మికత మీద శ్రద్ధ పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.
వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుకు ప్రశంసలు పొందుతారు. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం కూడా ఉంది. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా సాగు తాయి. చేపట్టిన పనుల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. అవసరాలకు తగ్గట్టుగా చేతికి డబ్బు అందుతుంది. ఆహార విహారాల్లోనే కాక, ప్రయాణాల్లోనూ జాగ్రత్తలు పాటించడం మంచిది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.
ఉద్యోగం అనుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం అందుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలున్నాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన పనుల్లో కొందరు మిత్రుల సహా యం లభిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో ఊహించని శుభవార్త అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి.
వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అవుతాయి. ఉద్యోగంలో కూడా యాక్టివిటీ పెరుగుతుంది. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఇతరుల వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందు తాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవు తుంది.
ఉద్యోగులకు పని భారం పెరిగే అవకాశం ఉంది. వ్యాపార వ్యవహారాలు నిలకడగా సాగిపోతాయి. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఆఫర్లు పెరుగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ద పెరుగు తుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారు. వ్యక్తిగత సమస్యల విషయంలో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. అనుకోకుండా మంచి పరిచయాలు ఏర్పడ తాయి.
ఉద్యోగులు, అధికారుల మధ్య సామరస్యం పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలు బాగా అనుకూలి స్తాయి. వృత్తి జీవితంలో తీరిక ఉండదు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ప్రముఖులతో పరి చయాలు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక పురోగతి ఉంటుంది. కుటుంబంతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడే అవకాశం ఉంది. ఆశించిన శుభవార్తలు వింటారు.
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. సొంత ఇంటి కోసం ప్రయత్నాలు సాగి స్తారు. ఆస్తి విషయంలో సోదరుల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి మంచి ఆఫర్లు అందుతాయి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆర్థిక లావాదేవీలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. ఆర్థిక సహాయం కోసం సన్నిహితుల నుంచి ఒత్తిడి పెరు గుతుంది. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో వ్యయ ప్రయాసలుంటాయి. అనారోగ్య సమస్యల వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
ఉద్యోగం సాదా సీదాగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు కొద్దిగా నిరాశ కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. దాయాదులతో ఆస్తి సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండక తప్పదు. ఆరోగ్యం అన్ని విధాలా అనుకూలిస్తుంది. సొంత పనుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం మంచిది.
వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగులకు హోదాతో పాటు వేతనాలు పెరిగే అవకాశం ఉంది. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు, కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి