దిన ఫలాలు (మే 25, 2024): మేష రాశి వారికి బంధువుల నుంచి ఆదరణ లభిస్తుంది. వృషభ రాశి వారు ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడే అవకాశముంది. మిథున రాశి వారికి అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సమాజంలో మాటకు, చేతకు విలువ ఉంటుంది. బంధువుల నుంచి ఆదరణ లభిస్తుంది. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం కావచ్చు. నిరుద్యో గులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఉద్యోగ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. పనులు, వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృథా ఖర్చులు వృద్ధి చెందుతాయి. కుటుంబ పరిస్థితులు బాగానే ఉంటాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడే అవకాశముంది. కొద్దిగా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాలు, అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఎంజాయ్ చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలను నిర్వర్తిం చాల్సి వస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
దాదాపు ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగు తుంది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు తొలగిపోయే అవకాశముంది. వ్యాపారంలో లాభాలపరంగా దూసుకు పోతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొం టారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
కొన్ని వ్యక్తిగత సమస్యలు, వివాదాలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. కొందరు స్నేహితులకు అండగా నిలబడతారు. అత్యవసర వ్యవహారాలు, పనులు చాలావరకు సానుకూలంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్ర మాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృథా ఖర్చులకు కళ్లెం వేయాలి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా వృద్ధి చెందుతాయి. దూరపు బంధువులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. బంధువులతో చిన్నా చితకా వివాదాలు, విభేదాలు పరిష్కారమవు తాయి. కుటుంబ సభ్యులతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. తల్లితండ్రులు ఇంటికి రావడం జరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా మారతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాల్లో పని భారం తగ్గి అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితికి ఇబ్బందేమీ ఉండదు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదాలు పెరిగే అవకాశం ఉంది. ఇష్టమైన బంధుమిత్రుల్ని కలుసుకుంటారు. వ్యాపారాల్లో అంచ నాలకు తగ్గట్టుగా లాభాలు అందుకుంటారు. దాంపత్య జీవితం అనుకూలంగా సాగిపోతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక వ్యవహారాలు బాగా సాను కూలంగా పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీల వల్ల లాభాలుంటాయి. సోదరులకు, ఇతర కుటుంబ సభ్యులకు ఆర్థికంగా సహాయం చేయడం కూడా జరుగు తుంది. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. వ్యాపారంలో కొద్ది పాటి మార్పులు చేసి లాభాలను పెంచుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. నష్టాల నుంచి విముక్తి లభించే అవకాశముంది. ఉద్యోగంలో కొత్త లక్ష్యాలు చేపట్టడం జరుగుతుంది. వృత్తి జీవి తంలో రాబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆర్థిక వ్యవహా రాలు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పిల్లల చదువుల మీద దృష్టి పెడతారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. పనులు, ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో దూసుకుపోతారు. వ్యాపారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. ఇష్టమైన బంధుమిత్రులతో శుభ కార్యంలో పాల్గొంటారు. నిరు ద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. ముఖ్యమైన విషయాల్లో సొంత నిర్ణయాలు మంచివి. కొందరు మిత్రుల వల్ల ఇరకాట పరిస్థితులు తలెత్తుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్త వుతాయి. డాక్టర్లు, లాయర్లకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవ హరించడం చాలా మంచిది. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఆశించిన ఫలితాలను పొందు తారు. ఆదాయ వ్యయాలు దాదాపు సమానంగా ఉంటాయి. కొందరు మిత్రుల వల్ల నష్టపోవడం జరుగుతుంది. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. ఇంటా బయటా అనుకూలతలుంటాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
రోజంగా చాలావరకు ఉత్సాహంగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాలలో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కొందరు ఉన్నత స్థాయి వ్యక్తులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఇష్టమైన బంధువుల్ని కలుసుకుంటారు. కుటుంబ సభ్యులతో విహార యాత్రకు వెడతారు. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. రావాల్సిన డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో అధికారులను మీ పనితీరు, ప్రతిభా పాటవాలతో ఆకట్టుకుంటారు. అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయడం మంచిది. అనవసర సహాయాల వల్ల ఇబ్బంది పడతారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవు తాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.