దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయానికి, అదనపు రాబడికి లోటుండదు. వృషభ రాశి వారికి కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు మీకు అనుకూలంగా జరిగిపోతాయి. ఆదాయానికి, అదనపు రాబడికి లోటుండదు. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. వృత్తి, ఉద్యోగాలు బాగా అనుకూ లంగా, ప్రోత్సాహకంగా ఉంటాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ ప్రయ త్నాలు సత్ఫలితాలనిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలకు వెళ్లే అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులతో విందులో పాల్గొంటారు. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
సొంత ఆలోచనల వల్ల ప్రయోజనం ఉంటుంది. పట్టుదలగా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులు మంచి ఆఫర్లు అందుకుంటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారు అంచనాలకు మించి సంపాదిస్తారు. వ్యాపా రాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. కొందరు ఇష్టమైన బంధువులను కలుసుకుంటారు. ఆదాయం, ఆరోగ్యం ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
రోజంతా మీరు ఆశించిన విధంగానే సాగిపోతుంది. పెండింగు పనులు, ప్రధానమైన వ్యవహారాలు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. అధికారులకు మీ ప్రతిభపై నమ్మకం ఏర్పడుతుంది. అవసరానికి డబ్బు అందు తుంది. కొందరు మిత్రులకు సహాయంగా నిలబడతారు. జీవిత భాగస్వామి నుంచి శుభవార్త అందుతుంది. ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశముంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఏ పని తలపెట్టినా వ్యయప్రయాసలుంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరిగే అవకాశముంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరగడం వల్ల విశ్రాంతి లోపిస్తుంది. కుటుంబ పరిస్థి తులు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్య తొలగిపోతుంది. ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులు శుభ వార్త వినే అవకాశముంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
రావలసిన డబ్బు చేతికి అంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు, హామీలు ఉండవద్దు. సొంత వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కొద్దిపాటివ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం సీదా సాదాగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహం పెరుగుతుంది. వ్యాపారాల్లో కొద్దిగా ఆర్థిక సమస్యలుండవచ్చు. వీలైతే ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగులకు శుభ వార్తలు అందే అవకాశం ఉంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వ్యక్తిగత జీవితం మీద ఒత్తిడి ఉంటుంది. ఆర్థికంగా గందరగోళ పరిస్థితులుంటాయి. వృత్తి, ఉద్యో గాలు సాధారణంగా సాగిపోతాయి. నిరుద్యోగులు తప్పకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి జీవితం నిలకడగా ఉంటుంది. వ్యాపారాల్లో కొద్దిగా మాత్రమే లాభాలు పెరుగుతాయి. కుటుంబపరంగా కొత్త బాధ్యతలు మీద పడతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. స్వల్ప అనారోగ్యం తప్పకపోవచ్చు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఒక రిద్దరు మిత్రులకు సహాయం చేసే అవకాశం కూడా ఉంది. కొద్ది ప్రయత్నంతో కుటుంబ పరిస్థి తులు చక్కబడతాయి. ఉద్యోగ వాతావరణం సానుకూలంగా, ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం పరవా లేదు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వ్యక్తిగత సమస్య ఒకటి కాస్తంత ఒత్తిడి కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, ఖర్చులు, అవసరాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారులను మీ పనితీరుతో మెప్పిస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. చిన్ననాటి మిత్రులకు ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలి స్తాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆర్థిక వ్యవహారాలకు ప్రాధాన్యమిస్తారు. రాదనుకుని వదిలేసుకున్న డబ్బును కూడా రాబట్టు కుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. కొందరు బంధుమిత్రులకు సహాయం చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. స్థాన చలనానికి అవకాశం ఉంది. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితులు ఏర్పడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా, సంతృప్తికరంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహా రాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. వృత్తి జీవితం బాగా బిజీ అవుతుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ప్రతి పనిలోనూ శ్రమాధిక్యత ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి రాక ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం, హామీలు ఉండకపోవడం మంచిది. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి కాస్తంత ఎక్కువగానే ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా, అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారులను మీ పని తీరుతో మెప్పిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగానే పెరుగుతుంది. బాగా తెలిసిన కుటుంబంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అంది వస్తాయి. ఉద్యోగులకు కూడా డిమాండు పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామికి అనుకోకుండా బాగా కలిసి వస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు మేలు చేసే పనులు చేస్తారు.