Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రోజు ఈ రాశివారికి వ్యాపారంలో మంచి లాభలు..
Horoscope Today (October 25-10-2021): రాశిఫలాల ఆధారంగా పనులు మొదలు పెట్టేవారు చాలామంది ఉన్నారు. జాతకాలను విశ్వసిస్తూ మంచి..
Horoscope Today (October 25-10-2021): రాశిఫలాల ఆధారంగా పనులు మొదలు పెట్టేవారు చాలామంది ఉన్నారు. జాతకాలను విశ్వసిస్తూ మంచి చెడుల గురించి తెలుసుకోవాలని.. తమ జాతకం ఈరోజు ఎలా ఉందో చూసుకోవాలనే ఆసక్తి చాలామందికి ఉంటుంది. ఇలాంటివారు తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 25న ) సోమవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. తెలుసుకుందాం..!
మేష రాశి: ఈ రాశివారికి ఈరోజు చేపట్టిన పనులను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండడం మేలు చేస్తుంది. ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
వృషభ రాశి: ఈ రాశివారికి ఈరోజు పాత స్నేహితులను కలుస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండడం మంచిది.
మిధున రాశి: ఈరాశివారికి ఈరోజు సృజనాత్మకంగా పనులు చేసేవారికి మేలు జరుగుతుంది. ఖర్చులను నియంత్రిచుకోవడం మంచిది. వివాదాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. మానసికంగా ధృడంగా ఉంటారు.
కర్కాటక రాశి: ఈ రాశివారికి ఈరోజు అనవసర విషయాల్లో కలుగజేసుకోకపోవడం మంచిది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
సింహ రాశి: ఈరోజు ఈరాశివారు ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. పెట్టుబడుల నుంచి మంచి లాభాలు ఆర్జిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రంగాల్లోని వారు మంచి లాభాలు పొందుతారు. చేపట్టిన పనుల్లో అనుకోని అవాంతరాలు ఎదురవుతాయి. పట్టుదలతో పనిని పూర్తి చేస్తారు.
కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చేపట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపార రంగంలోని వారు మంచి ఒప్పందాన్ని చేసుకొనే అవకాశం ఉంది. లాభాలను ఆర్జిస్తారు.
తులా రాశి: ఈ రాశివారికి ఈరోజు చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలను అందుకుంటారు. విద్యా రంగంలో ఉన్నవారు మంచి విజయాలను సొంతం చేసుకుంటారు.
వృశ్చిక రాశి: ఈ రాశివారు ఈరోజు ఆకస్మిక ధన లాభం పొందుతారు. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర విషయాల్లో తలదూర్చుకుండా ఉంటే మంచిది.
ధనుస్సు రాశి: ఈ రాశి వారు ఈరోజు భార్యాభర్తల మధ్య మంచి సంఖ్యత ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామి నుంచి మంచిజ సహకారం లభిస్తుంది. చేపట్టిన పనులల్లో కుటుంబ సభ్యుల అండ ఉంటుంది.
మకర రాశి: ఈరోజు ఈ రాశి వారు చేపట్టిన పనులను ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండడం మేలు చేకూరుస్తుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
కుంభ రాశి: ఈ రాశి వారికి ఈరోజు విద్యార్థులకు అనుకూలంగా ఉంది. శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో సంతోషముగా గడుపుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభఫలితాలను పొందుతారు. అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి.
మీన రాశి: ఈ రాశివారికి ఈరోజు అనుకూలంగా ఉంది. అనవసర తగాదాలకు దూరంగా ఉండడం మంచిది. తల్లి ఆరోగ్య విషయంలో ఆందోళన కలిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు.
Also Read: పుట్టిన రోజున హిందూ మతాన్ని స్వీకరించనున్న ఇండోనేషియా వ్యవస్థాపక అధ్యక్షుడి తనయ