Horoscope Today: రాశి ఫలాలు: ఈ రాశి వారికి రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి.. గౌరవ, మర్యాదలు సంపాదించుకుంటారు
Horoscope Today 24nd June 2021: ప్రస్తుత ఆధునిక కాలంలోనూ.. చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందులో ఇప్పటికీ రాశిఫలాలను..
Horoscope Today 24nd June 2021: ప్రస్తుత ఆధునిక కాలంలోనూ.. చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందులో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించేవారు ఎక్కువగానే ఉన్నారు. తమ రోజు ఎలా ఉండబోతుంది.. ఎలాంటి పనులు మొదలు పెట్టాలి.. అని తెలుసుకోవడానికి చాలా మంది ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో భాగంగానే ఈ రోజు (జూన్ 24న) గురువారం రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రాశివారు ఈ రోజు పట్టే పనుల విషయాలలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అనుకున్న ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. శ్రీవేంకటేశ్వరస్వామి సుప్రభాతసేవ మంచి మేలు చేస్తుంది.
వృషభ రాశి
ఈ రాశివారు ఈ రోజు చేసే కొన్ని పనులలో కొంత ఆలస్యం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితులు నెమ్మిదిగా అనుకూలిస్తాయి. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. శివాభిషేకం మేలు చేస్తుంది.
మిథున రాశి
వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారు శ్రీవేంకటేశ్వరస్వామిని తులసీ దళాలతో పూజించడం ఎంతో మేలు చేస్తుంటుంది.
కర్కాటక రాశి
నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. కుటుంబంలో కొంత ఇబ్బందులు తప్పవు. లక్ష్మీపారాయణం చేయడం ఎంతో మేలు చేస్తుంటుంది.
సింహ రాశి
ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో కొంత మార్పులు ఉంటాయి. జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లడం మంచిది. దుర్గ అమ్మవారికి పూజించడం మేలు జరుగుతుంది.
కన్యరాశి
ఈ రాశివారు విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఆలయాలు దర్శించడం ద్వారా ప్రశాంతత లభిస్తుంది. పేవారికి కాయగూరలు దానం చేయడం మంచిది.
తుల రాశి
నమ్మిన సిద్ధాంతం అవలంబించడం ద్వారా మంచి జరుగుతుంది. చేసిన అప్పులు కొంత మేర తీర్చుకోగల్గుతారు. మహాలక్ష్మీ అమ్మవారికి అర్చన చేయడం మంచి జరుగుతుంది.
వృశ్చిక రాశి
సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. దుర్గ అమ్మవారి కుంకుమార్చన మేలు చేస్తుంది.
ధనుస్సు రాశి
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. ఆర్థికంగా కొంత ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. వస్తువులు దానం చేయడం మంచిది. విష్ణు పూజ చేయడం మేలు జరుగుతుంది.
మకర రాశి
వ్యక్తిగతంగా అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. సంఘంలో మంచి పేరు సంపాదించుకుంటారు. పేదవారికి అన్నదానం చేయడం మంచి జరుగుతుంది. అమ్మవారికి పూజలు చేయడం మంచి జరుగుతుంది.
కుంభరాశి
ఈ రాశివారు ఈ రోజు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. సూర్యనారాయణ స్వామి అర్చన మేలు చేస్తుంది.
మీన రాశి
ఆ రాశి వారికి ఈ ఇతరుల నుంచి మంచి వార్తలు వింటారు. పనుల్లో అనుకూలత, ప్రశాంతత ఏర్పడుతుంది. పేవారికి కాయగూరలు దానం చేయడం మంచి జరుగుతుంది.