Horoscope Today: ఈ రాశివారికి ఈ రోజు చేపట్టే పనుల్లో ఆటంకాలు.. శత్రువులపై విజయం సాధిస్తారు..!

|

Jul 24, 2021 | 6:36 AM

Horoscope Today: ప్రస్తుతమున్న కాలంలోనూ చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకునేందుకు ఎంతగానే ఆసక్తి చూపిస్తుంటారు. అందులో ఇప్పటికీ రాశిఫలాలను..

Horoscope Today: ఈ రాశివారికి ఈ రోజు చేపట్టే పనుల్లో ఆటంకాలు.. శత్రువులపై విజయం సాధిస్తారు..!
Follow us on

Horoscope Today: ప్రస్తుతమున్న కాలంలోనూ చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకునేందుకు ఎంతగానే ఆసక్తి చూపిస్తుంటారు. అందులో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించేవారు ఎక్కువగానే ఉన్నారు. తమ రోజు ఎలా ఉండబోతుంది.. ఎలాంటి పనులు మొదలు పెట్టాలి.. అని తెలుసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇందులో భాగంగానే ఈరోజు (జూలై 24) శనివారం రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషరాశి:

ఈ రాశివారు చేపట్టిన కార్యక్రమాల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశాలున్నాయి. కానీ అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. దుర్గాదేవి ఆరాధన మేలు చేస్తుంది.

వృషభరాశి:

కొన్ని పనులు చేపట్టే ప్రయత్నం చేసినా ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. వ్యాపారాలలో మంచి జరుగుతుంది. శివుడిని పూజించడం మంచి జరుగుతుంది.

మిథునరాశి:

వ్యాపారాలలో మంచి ఫలితాలు సాధిస్తారు. శుభవార్తలు వింటారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. గోసేవ చేయడం వల్ల ఈ రోజు మంచి జరుగుతుంది.

కర్కాటకరాశి:

మీరు చేసే వ్యాపారాలలో మంచి ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొన్ని సంఘటనలు బాధపెట్టే అవకాశం ఉంది. లక్ష్మీదేవిని పూజించడం వల్ల మంచి జరుగుతుంది.

సింహరాశి:

వృత్తి, ఉద్యోగులు, వ్యాపారులు శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేలు చేస్తుంది.

కన్యరాశి:

ఈ రాశివారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గణపతిని ఆరాధించడం మంచి జరుగుతుంది.

తులరాశి:

మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. దుర్గాదేవిని పూజించడం మేలు జరుగుతుంది.

వృశ్చికరాశి:

చేపట్టే పనులలో అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. ఆర్థిక విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. శ్రీవేంకటేశ్వరస్వామిని ఆరాధించడం మంచిది.

ధనుస్సురాశి:

శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. లక్ష్మీ స్తోత్రం పటించడం మంచిది.

మకరరాశి:

ఈ రాశివారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ప్రయాణాలు తప్పవు. ఇష్టదైవాన్ని పూజించడం మంచిది.

కుంభరాశి:

ఈ రాశివారికి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కుటుంబం సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆంజనేయస్వామిని పూజించడం మేలు జరుగుతుంది.

మీనరాశి:

కీలక వ్యవహారాలలో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రుల్లో మంచి పేరు సంపాదించుకుంటారు. శ్రమకు తగిన పలితం ఉంటుంది. సుబ్రహ్మణ్యస్వామి స్తోత్రం పటించడం మేలు జరుగుతుంది.

ఇవీ కూడా చదవండి

Darshan Tickets: కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో దర్శన టికెట్స్‌పై టీటీడీ కీలక నిర్ణయం

Guru Purnami: గురు పౌర్ణమి వేడుకలకు సిద్ధమైన రామకృష్ణ మఠం.. ఈ ఏడాది విద్యార్థులతో ప్రత్యక కార్యక్రమాలు..