Horoscope Today: ఈ రాశివారు వృత్తి, వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు.. తొందరపాటు వల్ల ఇబ్బందులు

|

Jun 23, 2021 | 8:18 AM

Horoscope Today 23nd June 2021: ప్రస్తుత ఆధునిక కాలంలోనూ.. చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందులో ఇప్పటికీ రాశిఫలాలను..

Horoscope Today: ఈ రాశివారు వృత్తి, వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు.. తొందరపాటు వల్ల ఇబ్బందులు
Follow us on

Horoscope Today 23nd June 2021: ప్రస్తుత ఆధునిక కాలంలోనూ.. చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందులో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించేవారు ఎక్కువగానే ఉన్నారు. తమ రోజు ఎలా ఉండబోతుంది.. ఎలాంటి పనులు మొదలు పెట్టాలి.. అని తెలుసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇందులో భాగంగానే ఈరోజు (జూన్ 23న) బుధవారం రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

మేష రాశి

ఈ రాశివారు ఈ రోజు చేపట్టే పనులు సకాలంలో పూర్తవుతాయి. మంచి ప్రయోజనాలు పొందుతారు. దుర్గమ్మను దర్శించుకోవడం మంచిది. అలాగే పేదవారికి అన్నదానం, కూరగాయలు ధనం చేయడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది.

వృషభ రాశి

వృత్తి, వ్యాపారాలు నిర్వహించే వారికి చక్కని పురోగతి లభిస్తుంది. అనుకూలత ఏర్పడుతుంది. మహాలక్ష్మీ అమ్మవారికి పుష్పాలు సమర్పించడం ద్వారా మేలు జరుగుతుంది.

మిథున రాశి

ముఖ్యమైన కార్యక్రమాలలో తొందరపాటు పని చేయదు. ఆలోచించి చేయడం మంచిది. పెద్దవారి సూచనలు, సలహాలు పాటించి నిర్ణయాలు తీసుకోవాలి. ఏదైనా స్వామివారి అభిషేకం చేయడం మంచిది.

కర్కాటక రాశి

ఈ రాశివారు రుణాలు చేసే అవకాశం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే ప్రయత్నాలు కొనసాగిస్తుంటారు. శివాలయంలో రుద్రాభిషేకం చేస్తే ఎంతో మేలు జరుగుతుంది.

సింహరాశి

వ్యవహారిక విషయాలలో మంచి జరుతుంది ఈ రాశివారికి. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కే అవకాశాలు ఉంటాయి. నవగ్రహ పారాయణం ఎంతో మేలు చేస్తుంటుంది.

కన్యరాశి

గతంలో బకాయిలు ఉన్న వారికి నుంచి ఒత్తిడిలు తప్పవు. ఆర్థిక విషయాలలో కొంత ఇబ్బందులు తప్పవు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. ఇష్టపడే దైవాన్ని పూజించడం మంచిది.

తుల రాశి

ఈ రాశివారు ఈ రోజు స్నేహితులను కలుసుకుంటారు. కుటుంబపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా కొంత ఇబ్బందులు పడే అకాశం ఉంటుంది. దుర్గమ్మను దర్శించుకోవడం మేలు జరుగుతుంది.

వృశ్చిక రాశి

ఈ రాశివారు సంపాదించిన దానిలో కొంత ధన ధర్మాలకు ఉపయోగించడం ఎంతో మంచి జరుగుతుంది. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది.

ధనుస్సు రాశి

ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. చేపట్టే పనుల్లో పురోగతి సాధిస్తారు. ఆరోగ్య విషయాలలో కొంత జాగ్రత్తగా వహించడం మంచిది. ఈ రాశివారు ఆ రోజు ఆంజనేయ స్వామి స్తోత్రపారాయణం చేయడం ఎంతో మంచిది.

మకర రాశి

ఈ రాశివారు నూతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఉంటుంది. పలు రంగాలలో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. దేవి అమ్మవారిని పూజించడం మేలు జరుగుతుంది.

కుంభరాశి

ఈ రాశివారు ఈ రోజు పట్టే పనులలో సకాలంలో పూర్తి చేసుకుంటారు. పెద్దల తోడ్పాటు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. గణపతి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంటుంది.

మీన రాశి

కుటుంబంలో కలహాలు ఉంటే నెమ్మదిగా దూరం అవుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఇతర సమస్యలు కూడా దూరమవుతాయి. శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం మేలు చేస్తుంది.