Horoscope Today: ఈరాశివారికి ఆకస్మిక ప్రయాణాలు..వారికి ఆదాయానికి మించిన ఖర్చులు..ఈరోజు ఏ రాశివారికి ఎలా ఉండబోతోందంటే..

మన సంప్రదాయంలో జ్యోతిషశాస్త్రం కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది. పూర్వకాలం నుంచి గ్రహాల స్థితి గతులను అనుసరించి మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందొ జ్యోతిషశాస్త్రం ద్వారా తెలుస్తూ వస్తోంది.

Horoscope Today: ఈరాశివారికి ఆకస్మిక ప్రయాణాలు..వారికి ఆదాయానికి మించిన ఖర్చులు..ఈరోజు ఏ రాశివారికి ఎలా ఉండబోతోందంటే..
Horoscope Today
Follow us
KVD Varma

|

Updated on: Aug 23, 2021 | 8:28 AM

Today Rasi Phalalu: మన సంప్రదాయంలో జ్యోతిషశాస్త్రం కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది. పూర్వకాలం నుంచి గ్రహాల స్థితి గతులను అనుసరించి మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందొ జ్యోతిషశాస్త్రం ద్వారా తెలుస్తూ వస్తోంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం ప్రతి మనిషి ఎదో ఒకరాశికి చెందుతారు. ఆయా రాశులను బట్టి వారికి ప్రతిరోజూ ఏరకంగా సాగబోతోందో అంచనా వేస్తారు. ఆయా వ్యక్తులకు జీవన పయనంలో రాశిఫలాలు కొంత వరకూ తమ ఇబ్బందులు ఎదుర్కోవడానికి సిద్ధపడే స్థైర్యాన్ని అందిస్తాయి. వివిధరాశుల వారికి జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈరోజు ఎలా ఉండబోతోందో ఇక్కడ తెలియచేస్తున్నాం.

మేషం

ప్రముఖులతో పరిచయాలు. ఆసక్తికర సమాచారం. ఇంటాబయటా అనుకూలం. కొత్త పనులు చేపడతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం. ఈ రాశివారు సానుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవడం మంచిది.

వృషభం

చిన్ననాటి మిత్రుల నుంచి ముఖ్య సమాచారం. దైవదర్శనాలు. వ్యవహారాలలో విజయం. సోదరుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. ఈ రాశి వారు గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు. కాబట్టి  వీరు కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయడం ద్వారా సానుకూల ఫలితాలు పండవచ్చు.

మిథునం

ప్రయాణాలలో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు. మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు. ఈ రాశి వారు ఈరోజు అనుకూలమైన శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించడం మంచిది.

కర్కాటకం

పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.  ఈ రాశివారికి అనుకూలమైన శుభ ఫలితాల కోసం  గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజ మేలు చేస్తుంది.

సింహం

పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. బాకీలు వసూలవుతాయి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముఖ్య మార్పులు. వినాయకునికి గరికతో పూజచేయడం ద్వారా ఈ రాశివారికి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి.

కన్య

శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో సఖ్యత. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి. ఈ రాశివారు అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి.

తుల

వ్యవహారాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. గోమాతకు గ్రాసం పెట్టడం.. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి ద్వారా ఈ రాశి వారు శుభ ఫలితాలను పొందవచ్చు.

వృశ్చికం

రుణాలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. బంధుమిత్రులతో విభేదాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయడం మంచిదిగా సూచిస్తున్నారు.

ధనుస్సు

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకోని హోదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయడం మంచిది.

మకరం

కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. పనుల్లో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజలు చేయండి.

కుంభం

వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. బంధువులను కలుసుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన స్థాయిలో ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి.

మీనం

పనుల్లో జాప్యం. ఆదాయానికి మించి ఖర్చులు. దూరప్రయాణాలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తప్పవు. శుభ ఫలితాల కోసం ఈ రాశివారు ఈశ్వర పూజ చేయడం మంచిది.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?