దిన ఫలాలు (మే 20, 2024): మేష రాశి వారికి ఈ రోజు అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా పూర్తవుతాయి. వృషభ రాశి వారు ఈ రోజు సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఇతరుల బాధ్యతలను తలకెత్తుకోవడం వల్ల ఇబ్బందుల పాలవుతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా పూర్తవుతాయి. ముఖ్యంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు దాదాపు రెట్టింపవుతాయి. ఆర్థిక ప్రయ త్నాల్లో విజయాలు సాధిస్తారు. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ పని తీరుతో అధికారుల్ని ఆకట్టుకుంటారు. మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండడం వల్ల ముఖ్యమైన అవసరాలు తీరిపో తాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఇతరుల బాధ్యతలను తలకెత్తుకోవడం వల్ల ఇబ్బందుల పాలవుతారు. ఆస్తి వ్యవహారాలు ఒక పట్టాన తేలకపోవచ్చు. ఆర్థిక లావాదేవీలను ప్రస్తుతా నికి వాయిదా వేసుకోవడం మంచిది. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. బంధు మిత్రుల సహాయ సహకారాలుంటాయి. రావలసిన డబ్బు అనుకోకుండా చేతికి అందు తుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా పురోగతి చెందుతాయి. ఉద్యోగంలో ఆదరణ పెరుగు తుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగపరంగా ఆశించిన శుభ వార్తలు వింటారు. సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపో తుంది. వృత్తి జీవితంలో రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఆస్తి విష యంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగా పూర్తవు తాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
రోజంతా సీదా సాదాగా గడిచిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది కానీ, ఖర్చుల్ని అదుపు చేయడం మంచిది. సొంత పనుల మీద శ్రద్ద పెట్టడం మంచిది. మితిమీరిన ఔదార్యం మంచిది కాదని గ్రహించండి. వృత్తి జీవితం ఆశాజనకంగా సాగిపోతుంది. లాభాలపరంగా వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కు తాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆదాయానికి, ఉద్యోగానికి ఢోకా ఉండదు. వృత్తి జీవితంలో శ్రమాధిక్యత తప్పకపోవచ్చు. వ్యాపా రాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలకు లోటుండదు. బంధుమిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఇత రులకు సహాయం చేసే స్థితిలో ఉంటుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. విందు వినోదాల్లో చురుకుగా పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం పరవాలేద నిపిస్తుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఒకటి రెండు శుభ వార్తలు వినడంతో పాటు ఒక శుభ పరిణామం కూడా చోటు చేసుకుంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. ఆర్థిక ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో మీ మాట చెల్లుబాటవుతుంది. వృత్తి, వ్యాపా రాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దైవ కార్యాల మీద ఖర్చు పెరుగుతుంది. కుటుంబ జీవితం చాలావరకు ప్రశాంతంగా సాగిపోతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
రోజంతా మిశ్రమంగా గడిచిపోతుంది. ఆర్థికంగా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరగడానికి, ప్రాధాన్యం పెరగడానికి అవకాశం ఉంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెంచడం మంచిది. అనుకోకుండా ఒక చిన్నపాటి అదృష్టం పడుతుంది. రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగుల ప్రయ త్నాలు సఫలం అవుతాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ప్రయాణాలు లాభి స్తాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
కుటుంబపరంగా బరువు బాధ్యతలు పెరుగుతాయి. బంధువుల రాకపోకలుంటాయి. ఇంటి ఖర్చులు బాగా పెరిగే అవకాశముంది. ముఖ్యమైన పనులు సంతృప్తికరంగా పూర్తి అవుతాయి. బంధువులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ వాతావరణం సానుకూలంగా సాగిపో తుంది. వృత్తి జీవితంలో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. వ్యాపారాలు కలిసి వస్తాయి. నిరు ద్యోగులు ప్రయత్నాలను పెంచాల్సి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆదాయాన్ని పెంచుకోవడం మీద, ఆర్థిక సమస్యలను తగ్గించుకోవడం మీద దృష్టి కేంద్రీకరిస్తారు. అనారోగ్య సమస్య నుంచి కూడా చాలావరకు విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ శక్తి సామ ర్థ్యాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఇంటి వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఖర్చుల్ని వీలై నంతగా తగ్గించుకుని పొదుపు పాటించడం మంచిది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగు తుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
రావలసిన సొమ్ము చేతికి అందడానికి ఆలస్యం అవుతుంది. ముఖ్యమైన అవసరాల కారణంగా కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిపాటి మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల పడే అవకాశముంది. ఇష్టమైన వ్యక్తులను కలుసుకోవడం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. అనుకున్న సమయానికి పనులన్నీ చాలావరకు పూర్తవుతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
క్షణం తీరికి ఉండదు, దమ్మిడీ ఆదాయం ఉండదు అన్నట్టుగా ఉంటుంది. అటు ఉద్యోగంలోనూ, ఇటు కుటుంబపరంగానూ ఉపయోగం లేని పనులతో ఇబ్బంది పడతారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది కానీ, వృథా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. చిన్ననాటి మిత్రు లతో సరదాగా కాలక్షేపం చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికా రులతో బాధ్యతలు పంచుకుంటారు. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఇష్ట మైన ఆలయాలను సందర్శిస్తారు. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. ఆశించిన శుభవార్త అందుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. కొద్దిపాటి శ్రమతో ముఖ్యమైన పనులన్నిటినీ పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. రావలసిన డబ్బు అందుతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యో గంలో అధికారుల నుంచి ఇబ్బందులుండే అవకాశం ఉంది. ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇంటా బయటా అనుకూలతలుంటాయి. సతీమణికి ఉద్యోగపరంగా శుభ వార్త అందుతుంది.