Horoscope Today: ఆ రాశివారికి ఆకస్మిక ధనలాభం, సొంత ఊర్లోనే ఉద్యోగం.. శనివారం రాశిఫలాలు ఇలా..
సమయం బాగా అనుకూలంగా ఉంది. ఎక్కువగా శుభవార్తలు వినడం జరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో అధికారులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. జీవిత భాగస్వామికి అనుకూలతలకు లోటుండదు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఇష్టమైన బంధువులతో శుభ కార్యంలో పాల్గొంటారు. నూతన వస్తు లాభాలు పొందుతారు. చిన్న నాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశముంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. కొందరు సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు తొలగి ఊరట చెందుతారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా, లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగంలో శ్రమాధిక్యత ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులకు అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల ఖర్చులు పెరగడం తప్ప ఉపయోగం ఉండదు. వృత్తి, వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. రావలసిన డబ్బు సరైన సమయానికి చేతికి అందుతుంది. అను కున్న సమయానికి పనులు పూర్తి చేసుకోగలుగుతారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
సమయం బాగా అనుకూలంగా ఉంది. ఎక్కువగా శుభవార్తలు వినడం జరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో అధికారులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. జీవిత భాగస్వామికి అనుకూలతలకు లోటుండదు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది కానీ, అందుకు దీటుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. శక్తి సామర్థ్యాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. పిల్లలు పురోగతి సాధిస్తారు. కుటుంబ పరిస్థితి చక్కబడు తుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వ్యయ ప్రయాసలు, పనిభారం కాస్తంత ఎక్కువగా ఉంటాయి. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. పెండింగు పనులు నిదానంగా పూర్తి అవుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభ సాటిగా సాగుతాయి. ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కొన్ని ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి శుభవార్త అందుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. తలపెట్టిన పనులు, వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను చేరుకుంటాయి. సమయం అను కూలంగా ఉన్నందువల్ల కొత్త ప్రయత్నాలు చేపట్టడం మంచిది. లాభదాయక పరిచయాలు ఏర్ప డతాయి. దైవ చింతన పెరుగుతుంది. పిల్లలు పురోగతి చెందుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆర్థికంగా ఇతరులకు బాగా సహాయం చేసి నష్టపోతారు. విలాసాలను తగ్గించుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. అధికారుల వల్ల అనేక ప్రయోజనాలను పొందు తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తు లతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో సొంత ఆలోచనలు లబ్ధి చేకూరుస్తాయి. నిరుద్యో గులకు శుభవార్తలు అందుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లలు విజయాలు సాధి స్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
కుటుంబ బాధ్యతల కారణంగా బాగా శ్రమకు గురవుతారు. వ్యయప్రయాసలు పెరుగుతాయి. ఆర్థికంగా ఆశించిన మేరకు పురోగతి ఉంటుంది కానీ, ఖర్చులు ఇబ్బంది పెడతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో మూడు పువ్వులు ఆరు కాయల్లా కొనసాగుతాయి. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. పిల్లలకు శ్రమ తప్పదు. ఆరోగ్యం పరవా లేదు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఎవరికైనా వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం గానీ చేయవద్దు. ఆర్థిక ప్రయత్నాలు బాగా మందగిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిపాటి శ్రమ, ఒత్తిడి ఉండవచ్చు. వ్యాపారంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ బాధ్య తలు పెరిగి, శ్రమ ఎక్కువగా ఉంటుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. రావలసిన డబ్బు అవసరానికి చేతికి అందుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
అనుకున్న పనులు పెండింగ్‌లో లేకుండా పూర్తవుతాయి. ఆస్తి వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందివస్తాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. రాజకీయ నేతలతో పరిచయాలు పెరుగుతాయి. పిల్లలకు సమయం బాగా అనుకూలంగా ఉంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఏలిన్నాటి శని కారణంగా బరువు బాధ్యతలు, పనిభారం ఎక్కువగా ఉంటాయి. కష్టానికి తగ్గ ఫలితం అందకపోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. అనుకోకుండా ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన ఆలయాలు సందర్శిస్తారు. చేపట్టిన పనులు చురుకుగా పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. పిల్లలు బాగా రాణిస్తారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆదాయం పెరగడమే తప్ప తగ్గే అవకాశం లేదు. గృహ, వాహన యోగాల మీద దృష్టి పెడతారు. శుభ కార్యాల మీద ఖర్చు చేస్తారు. ప్రముఖులతో పరి చయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో హ్యాపీగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా దూసుకు పోతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. ఆరోగ్యానికి లోటు ఉండదు.