Horoscope Today (November 19-11-2021): కొంతమంది ఏ కొత్తపనిని మొదలు పెట్టాలన్నా.. శుభకార్యాలు మొదలు పెట్టాలన్నా ఈరోజు తమ జాతకం ఎలా ఉంది అంటూ.. తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (నవంబర్ 19వ తేదీ ) శుక్రవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!
మేష రాశి: ఈరాశివారు వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. చేపట్టిన పనుల్లో వ్యతిరేక ఫలితాలు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. కొత్త పనులను వాయిదావేసుకుంటే మంచిది.
వృషభ రాశి: ఈ రాశివారు ఆర్ధికంగా బలపడతారు. శుభవార్త వింటారు. కుటుంబంలో సంతోషం వెల్లువిరుస్తుంది. ప్రశంసలను అందుకుంటారు. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్త్రీలు సంతోషంగా గడుపుతారు.
మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు వృధా ప్రయాణాలు చేస్తారు. మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాల్సి ఉంచడం మంచిది. శారీరకంగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ధన వ్యయం చేస్తారు. కుటుంబంలో ఇబ్బందులు ఏర్పడతాయి.
కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు మంచి అవకాశాలను మిస్ చేసుకుంటారు. ఆర్ధిక పరిస్థితి యధావిధిగా కొనసాగుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది.పిల్లల విషయం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.
సింహ రాశి: ఈ రాశివారు ఈరోజు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. రుణ ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబంలో శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. భయాందోళనలు దూరమవుతారు.
కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు చేపట్టిన ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొత్త వ్యక్తులకు దూరంగా ఉండడం మేలు చేస్తుంది. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో విరోధం కలిగే అవకాశం ఉంది.
తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు తినే ఆహారం వలన అనారోగ్య బాధలను అనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. మనస్సు చంచలంగా ఉంటుంది. చెడు సావాసాలు దూరంగా ఉండడం మంచిది.
వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారికి బంధుమిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. కొత్త పనులు చేపడతారు. స్వల్పలాభం చేకూరుతుంది. వృత్తి, వ్యాపార రంగంలో లాభాలు పొందుతారు. అప్పులు చేస్తారు.
ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కొత్త వస్తువులు, నగలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులల్లో విజయం సొంతం చేసుకుంటారు. శుభవార్తలు వింటారు. కుటుంబంలో సుఖసంతోషాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధన లాభం ఉంది.
మకర రాశి: ఈరోజు ఈ రాశివారు స్థిరమైన నిర్ణయాలను తీసుకోలేరు. బంధు మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తవహించడం మంచిది. మానసిక ఆందోళన కాలుతుంది. కొత్త పనుల కోసం ప్రణాళికలు వేస్తారు. అపకీర్తికి గురయ్యే అవకాశం ఉంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు.
కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు చేపట్టినపనుల్లో శారీరక శ్రమ అధికమవుతుంది. బంధు మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొత్తపనులు వాయిదా వేసుకోవడం మేలు చేస్తుంది. ప్రయాణాల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేసే పనుల్లో ఇబ్బందులు ఉంటాయి.
మీన రాశి: ఈ రాశివారు ఈరోజు మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు. ఆకస్మిక ధన నష్టం కలుగుతుంది. వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి.
Also Read: