AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: ఈ 3 రాశులవారు మొదటి చూపులోనే ప్రేమలో పడతారట.. అందులో మీరున్నారా.!

ప్రేమ ఒక మధురానుభూతి. ఈ ఫీలింగ్‌ను ప్రతీ మనిషి తన జీవితంలో ఎప్పుడొకప్పుడు అనుభవిస్తారు. 'లవ్ ఎట్ ఫస్ట్ సైట్'..

Zodiac Signs: ఈ 3 రాశులవారు మొదటి చూపులోనే ప్రేమలో పడతారట.. అందులో మీరున్నారా.!
Zodiac Signs
Ravi Kiran
|

Updated on: Nov 19, 2021 | 7:21 PM

Share

ప్రేమ ఒక మధురానుభూతి. ఈ ఫీలింగ్‌ను ప్రతీ మనిషి తన జీవితంలో ఎప్పుడొకప్పుడు అనుభవిస్తారు. ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’.. ప్రేమికులకు ఈ మాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొందరికి దీనిపై నమ్మకం ఉంటుంది. మరికొందరికి ఉండదు. ప్రేమ అనేది ఎప్పుడు ఎలా ఎవరిపై కలుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. దానికి మనం నిర్వచనం ఇవ్వలేం.

లవ్ అనేది మన జీవితంలో వెలుగులు నింపుతుంది. పురుషులు అయితే.. తమ జీవితంలో కొత్త వెలుగులు నింపే అమ్మాయి తమకు భాగస్వామి అవ్వాలని కోరుకుంటారు. అయితే తమకు ఇష్టమైన భాగస్వామిని పొందటం అంత సులభం కాదు.. ముందుగా వారి మనస్సును గెలవాలి. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేయాలి. వారికి నచ్చే విధంగా ఉండాలి. జోతిష్యశాస్త్రం ప్రకారం 3 రాశులవారు మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతారట. మరి ఆ రాశులేంటో తెలుసుకుందాం పదండి.!

సింహరాశి:

ఈ రాశివారు చాలా రొమాంటిక్. వీరు మొదటి చూపులోనే తమ ఇష్టాయిష్టాలకు తగిన వ్యక్తులను గుర్తించగలరు. వీరి అంతర్ దృష్టి బలంగా ఉంటుంది. తరచూ సరైన మార్గంలోనే నడుస్తారు. అంతేకాకుండా వీరు ఎలప్పుడూ మొదటి చూపులోనే ప్రేమలో పడతారు. అస్సలు వెనక్కి తిరిగి చూడరు.

కుంభరాశి:

ఈ రాశివారు మొదటి చూపులోనే ప్రేమలో పడతారు. అది కూడా చాలా ఎమోషనల్‌గా అని చెప్పొచ్చు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా కుంభరాశి వారు ప్రేమించినట్లయితే.. వారు ఖచ్చితంగా మీ జీవితాంతం ఉంటారు. ఏ సమయంలోనూ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లరు.

తులారాశి:

ఈ రాశివారు కూడా రొమాంటిక్ వ్యక్తులు. తమ జీవితంలోకి ఎలాంటి వ్యక్తి రావాలన్న దానిపై వారు ఖచ్చితంగా ఉంటారు. మొదటి చూపులోనే ప్రేమలో పడతారు. ఈ సిద్దాంతాన్ని గట్టిగా నమ్ముతారు.

గమనిక: ఈ వార్త మత విశ్వాసాలు, జానపద విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కేవలం ప్రజల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ప్రచురితమైంది.

Follow Us
సర్వీస్ పిస్టల్‌తో కానిస్టేబుల్ కాల్చుకుని మృతి!
సర్వీస్ పిస్టల్‌తో కానిస్టేబుల్ కాల్చుకుని మృతి!
అధిక వడ్డీ అని ఆశపడ్డారు..కట్‌చేస్తే ఏకంగా రూ. 10కోట్లతో జంప్
అధిక వడ్డీ అని ఆశపడ్డారు..కట్‌చేస్తే ఏకంగా రూ. 10కోట్లతో జంప్
జుట్టు చివర్లు చిట్లిపోతున్నాయా? అసలు కారణం ఇదే..శాశ్వత పరిష్కారం
జుట్టు చివర్లు చిట్లిపోతున్నాయా? అసలు కారణం ఇదే..శాశ్వత పరిష్కారం
కోర్టుల చుట్టూ తిరిగి అవకాశాలు, ఆస్తులు పోగొట్టుకున్నాడు
కోర్టుల చుట్టూ తిరిగి అవకాశాలు, ఆస్తులు పోగొట్టుకున్నాడు
టీమిండియా ప్లేయర్లపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..!
టీమిండియా ప్లేయర్లపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..!
నెమలి గురించి అసలు విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
నెమలి గురించి అసలు విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
వయస్సు 26 ఏళ్లు.. రూ.18 వేల జీతంతో రూ.75 లక్షల ఆస్తులు..
వయస్సు 26 ఏళ్లు.. రూ.18 వేల జీతంతో రూ.75 లక్షల ఆస్తులు..
సత్య సాయిబాబా బయోపిక్ చేయలేను.. కారణమేంటో చెప్పిన హీరో విజయ్
సత్య సాయిబాబా బయోపిక్ చేయలేను.. కారణమేంటో చెప్పిన హీరో విజయ్
నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు
నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు
ఆ హీరోయిన్ ను ఫంక్షన్ లో పిలిస్తే పట్టించుకోకుండా వెళ్లిపోయింది..
ఆ హీరోయిన్ ను ఫంక్షన్ లో పిలిస్తే పట్టించుకోకుండా వెళ్లిపోయింది..