Horoscope Today: ఈరాశుల వారికి మిత్రులతో విభేదాలు ఉంటాయి.. అనారోగ్య సమస్యలు ఎక్కువ.. రాశి ఫలాలు..

ప్రస్తుత ఆధునిక కాలంలోనూ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. రోజులో తమ జీవితంలో జరగబోతున్న విషయాలను

Horoscope Today: ఈరాశుల వారికి మిత్రులతో విభేదాలు ఉంటాయి.. అనారోగ్య సమస్యలు ఎక్కువ.. రాశి ఫలాలు..
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 18, 2022 | 7:02 AM

ప్రస్తుత ఆధునిక కాలంలోనూ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. రోజులో తమ జీవితంలో జరగబోతున్న విషయాలను ముందుగానే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అలాగే జ్యోతిష్యశాస్త్రం, రాశి చక్రం వంటి అంశాల జనాలు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో ప్రతి రోజూ రాశి ఫలాలను తెలుసుకుంటారు. మరి ఈరోజు మేషం నుంచి మీనం వరకు రాశి పలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.

మేష రాశి.. ఈరోజు వీరు ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. వృథా ఖర్చులు ఎక్కువవుతాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల సహాకారం లభిస్తుంది. వ్యాపారం, ఉద్యోగరంగాల్లో స్థానచలనం ఉంటుంది.

వృషభ రాశి.. ఈరోజు వీరు ఆస్తి వివాదంలో చిక్కుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గుతాయి. కొత్త వారితో జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. చేసే పనులలో జాగ్రత్తగా ఉండాలి. వృథా ప్రయాణాలు చేస్తారు. సన్నిహితులతో విభేధాలు ఏర్పడతాయి.

మిథున రాశి.. ఈరోజు వీరు చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆకస్మిక ప్రయణాలు చేస్తారు. స్థానచలన సూచనలు ఉంటాయి. కుటుంబసభ్యులు, సన్నిహితులతో విభేదాలు ఏర్పడతాయి. ఖర్చులు పెరుగుతాయి.

కర్కాటక రాశి.. ఈరజో వీరికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబసభ్యుల మద్దతు ఉంటుంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. శత్రుబాధలు ఉండవు.

సింహ రాశి.. కొత్త ఇంటి నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు.

కన్యరాశి.. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేస్తారు. మానసిక ఆందోళన ఏర్పడుతుంది. బంధుమిత్రులు, సన్నిహితులతో జాగ్రత్తగా ఉండాలి. విందులు, వినోదాల్లో పాల్గోంటారు.

తుల రాశి.. ఈరోజు వీరు తోటి వారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి. వృథా ఖర్చులు పెరుగుతాయి. వృథ ప్రయణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబసభ్యులతో విభేదాలు ఏర్పడతాయి. స్త్రీలకు విశ్రాంతి అవసరం.

వృశ్చిక రాశి.. కుటుంబసభ్యులతో విభేదాలు ఏర్పడతాయి. ఆకస్మిక ప్రయణాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులను తగ్గిస్తాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రుల సహాయసహకారాలు అందుతాయి.

ధనుస్సు రాశి.. ఈరోజు వీరికి ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. మానసిక ఆందోళన పెరుగుతుంది. ప్రయత్న లోపం లేకున్న పనులు వాయిదా పడతాయి. బంధుమిత్రులతో విరోధం ఏర్పడుతుంది.

మకర రాశి.. ఈరోజు వీరికి ఖర్చులు ఎక్కువవుతాయి. ప్రతి విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. వృత్తి రీత్యా కొత్త సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గుతాయి.

మీన రాశి.. ఆనందంగా ఉంటారు. సోదరులతో వైరం ఏర్పడే అవకాశం ఉంటుంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోంటారు. కొత్త వ్యక్తులతో పరిచయం విషయంలో జాగ్రత్తలు అవసరం.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు మరియు జానపద విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)