Horoscope Today: ఆ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో శుభ యోగాలు.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు..

| Edited By: Janardhan Veluru

Feb 17, 2024 | 5:01 AM

దిన ఫలాలు (ఫిబ్రవరి 17, 2024): మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు అనుకోకుండా మంచి అవకాశాలు అందివస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో శుభ యోగాలు.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు..
Horoscope Today 17th February 2024
Follow us on

దిన ఫలాలు (ఫిబ్రవరి 17, 2024): మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు అనుకోకుండా మంచి అవకాశాలు అందివస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ముందుకు సాగుతాయి. మిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలం దుతాయి. కొత్త వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఇంటా బయటా ప్రోత్సాహకర వాతావరణం నెల కొంటుంది. బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలందుతాయి. మీ మాటకు, చేతకు బాగా విలువ పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుని ఇబ్బంది పడతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. నిరుద్యోగులకు ఆఫర్లు అందే సూచనలున్నాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గు ముఖం పడతాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆర్థిక సంబంధమైన విష యాలు ఆశాజనకంగా సాగిపోతాయి. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు.

మిథునం (మృగశిర, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

సామాజికంగా గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. నిరుద్యోగులకు అనుకోకుండా మంచి అవకాశాలు అందివస్తాయి. ఆస్తి సంబంధమైన వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు తదితర వృత్తులవారు బాగా బిజీ అవుతారు. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. దాంపత్య జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది. దాదాపు ప్రతి ప్రయత్నమూ లాభిస్తుంది. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో సఖ్యత ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులు తమకు అందిన ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆరోగ్యం పరవాలేదు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాలు ఆశించిన విధంగా ప్రోత్సాహకరంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి నిల కడగా ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇంటి సమస్యల నుంచి కూడా చాలావరకు బయటపడతారు. అనవసర ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు వెడతాయి. వృత్తి, ఉద్యోగాలలో ప్రాభవం, ప్రాధాన్యం పెరిగే సూ నలున్నాయి. ఆరోగ్యం పరవాలేదు. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. రోజంతా ఆశాజనకంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. అనుకోకుండా ఒకటి రెండు కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. శుభ కార్యాల మీదా, పుణ్య కార్యాల మీదా ఖర్చు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ వ్యక్తిగత వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని నివారించడం మంచిది. పిల్ల లకు సంబంధించి శుభ వార్త అందుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో శుభ యోగాలకు అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితంలో ఆశించిన పురోగతి ఉంటుంది. ఆర్థికంగా ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఎటువంటి ముఖ్య వ్యవహారాన్నయినా తేలికగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన స్నేహితుల నుంచి ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం లభిస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. వ్యాపారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వ్యక్తిగత జీవితంలో శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మీ సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. కుటుంబ జీవితం సామరస్యంగా ఉంటుంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యో గాలు ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిపోతాయి. ప్రస్తుతానికి ఇతరులకు హామీలు ఉండడం, వాగ్దానాలు చేయడం శ్రేయస్కరం కాదు. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది. ఆర్థికంగా స్థితిగతుల్లో బాగా మార్పు వస్తుంది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనుల్ని పూర్తి చేస్తారు. బంధు మిత్రుల మీద అతిగా ఖర్చు పెట్టడం మంచిది కాదు. వృత్తి, ఉద్యోగాలలో పనిభారం పెరిగినప్పటికీ ప్రతిఫలం ఉంటుంది. ఆరోగ్యానికి లోపమేమీ ఉండదు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఇంటా బయటా పని ఒత్తిడి బాగా పెరిగే అవకాశం ఉంది. విశ్రాంతి తక్కువవుతుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థికంగా కొద్దిపాటి అదృష్టం పట్టే అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందడం, బాకీలు వసూలు కావడం వంటివి జరుగుతాయి. కుటుంబంలో శుభ కార్యాలకు సంబంధించి ఆశించిన సమాచారం అందుకుంటారు. తోబుట్టువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. వ్యాపారాలు కూడా లాభిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, వృథా ఖర్చులు పెరుగుతాయి. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేయడం కూడా జరుగుతుంది. రాదనుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. బంధు మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. కుటుంబ వ్యవ హారాలను సొంతగా పరిష్కరించుకోవడం మంచిది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి జీవితంలో గుర్తింపు లభిస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండక పోవచ్చు. ఉద్యోగంలో తగిన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. బాగా ఆలోచించి కీలక నిర్ణయాలు తీసుకోవడం మంచిది. జీవిత భాగస్వామి సలహాల వల్ల ఉప యోగం ఉంటుంది. ఆర్థిక ప్రయత్నాలను కొనసాగించడం మంచిది. అనుకూల ఫలితాలుంటాయి.