Horoscope Today March 15th 2021: ప్రస్తుత కాలంలో రాశిఫలాలను విశ్వసించేవాళ్లు అనేకం. ఉదయాన్నే తమ భవిష్యత్ రోజులో జరిగే విషయాలను ముందుగానే తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఈరోజు మార్చి 15 సోమవారం నాడు చంద్రుడు.. వృషభంలో ఉండగా.. సూర్యుడు మీనంలో ఉండనున్నాడు. ఈరోజు మేషరాశి నుంచి మీన రాశి వరకు రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఈరాశివారికి ఈరోజు నూతన కార్యక్రమాలు ప్రారంభించేందుకు ప్రయాత్నిస్తుంటారు. చేపట్టినటువంటి పనులలో పెద్దవారి ఆశీస్సులు తీసుకోవడం మంచిది. వీరు ఈరోజన హయగ్రీవ స్త్రోత్ర పారాయణం చేయడం మంచిది.
ఈరోజు వీరు వ్యక్తిగత అవసరాల కోసం అప్పులు చేసేందుకు ఆలోచిస్తారు. గతంలో ఉన్న అప్పులు కూడా కొంత ఒత్తిడికి గురిచేస్తుంటాయి. ఓం శరవణ భవః అనే నామస్మరణ చేయడం మంచిది.
ఈరోజు వీరికి దగ్గరి వ్యక్తుల నుంచి కొన్ని కార్యక్రమాల్లో ఆహ్వానాలు అందుతాయి. ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ప్రయత్నిస్తుండాలి. శంఖపుష్పాలతో శ్రీవెంకటేశ్వర స్వామి అర్చన నిర్వహించడం ఉత్తమం.
ఈరోజు వీరికి ఆర్థిక విషయాలలో మంచి అభివృద్ది ఏర్పడుతుంది. ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు. ఓం.. గం. గణపతయే నమః అనే నామస్మరణ మేలు చేస్తుంది.
సింహరాశి..
ఈరోజు వీరికి సౌకర్యాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అదనపు బాధ్యతలు చేపట్టే సందర్బాలు ఉన్నాయి. ఈరోజు వీరికి గరుడ సేవ విశేష శుభఫలితాలను కలుగజేస్తుంది.
ఈరోజు వీరికి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. అలాగే కొన్ని అదనపు బాధ్యతలు చేపట్టే సందర్బాలు ఉంటాయి. ఈరోజు వీరికి లక్ష్మీ నారాయణ స్వామి దర్శనం, పూజా, అర్చన మేలు చేస్తుంది.
ఈరోజు వీరికి అనుకున్నటువంటి పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. మాట విలువను కోల్పోకుండా జాగ్రత్తలు వహించాలి. ఓం.. మహాదేవియే నమః నామా స్మరణ మేలు చేస్తుంది.
ఈరోజు వీరు దూరపు బందువులను కలుసుకుంటారు. అలాగే విలువైనటువంటి వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈరోజు వీరికి హానుమాన్ చాలిసా పారాయణం మేలు చేస్తుంది.
ధనుస్సు రాశి..
ఈరోజు వీరికి చేసే పనులలో శ్రమ తప్ప ఫలితాలు కొంత తక్కువగా ఉంటాయి. ఈ రోజు వీరికి విష్ణు పూజా మేలు చేస్తుంది.
ఈరోజు వీరికి కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రీరాజ రాజేశ్వరి అష్టక స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.
ఈరోజు వీరికి ఆకస్మిక ప్రయణాలు ఉంటాయి. అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈరోజు వీరికి దుర్గా సప్తశ్లోకి పారాయణం మేలు చేస్తుంది.
ఈరోజు వీరు తమకున్న ఆస్తి వివాదాలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. వ్యక్తిగత కుటుంబ శుభకార్యక్రమాలను పూర్తిచేసుకుంటారు. వీరు గరికతో గణపతి అర్చన చేసుకోవడం మంచిది.
Also Read:
మీన సంక్రాంతి 2021: ఈరోజు మీన సంక్రాంతి.. దాని ప్రాముఖ్యత ఈరోజు చేయవలసిన పనులెంటో తెలుసా…