దిన ఫలాలు (ఆగస్టు 15, 2024): మేష రాశి వారి కుటుంబంలో ఈ రోజు ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. వృషభ రాశి వారికి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులు శుభవార్త వింటారు. చిన్నపాటి అనారోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకుని సరదాగా గడుపుతారు. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి జీవితంలో బిజీగా ఉండే అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలో విజ యం సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
తల్లితండ్రుల మధ్యవర్తిత్వంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం కొనసాగుతుంది. వృత్తి జీవితం ప్రోత్సాహకరంగా ఉంటుంది. పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. దాంపత్య జీవితం అనుకూలంగా సాగిపోతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, వ్యాపారాలు చాలావరకు నష్టాల నుంచి బయటపడతాయి. ఉద్యోగంలో అనుకూలతలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. కుటుంబ జీవితంలో సుఖసంతోషాలు వృద్ధి చెందుతాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ప్రయాణాల్లో మంచి పరిచయాలు కూడా ఏర్పడతాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. చిన్నపాటి అనారోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది. ధనపరంగా ఎవరికీ హామీలు ఉండవద్దు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసలుం టాయి. ఆదాయానికి లోటుండదు. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో అధికా రులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. బంధుమిత్రులకు సహాయం చేస్తారు. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఎవరికీ వాగ్దానాలు చేయ వద్దు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆదాయానికి లోటుండదు కానీ, ఖర్చులకు మాత్రం పగ్గాలు వేయాల్సి ఉంటుంది. కొందరు ఇష్ట మైన బంధుమిత్రులతో బాగా ఎంజాయ్ చేస్తారు. కుటుంబసమేతంగా ఇష్టమైన ఆలయాలు సంద ర్శిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా, ఆశాజనకంగా సాగిపోతుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకో కుండా పరిష్కారమవుతుంది. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
రోజంతా ప్రశాంతంగా సాగిపోతుంది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడ తాయి. ఆర్థిక సమస్యల పరిష్కారం మీద శ్రద్ధ పెడతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతల మార్పు చోటు చేసుకుంటుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు. తల్లితండ్రుల్లో ఒకరికి అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండ వద్దు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అధికారులకు మీ శక్తి సామర్థ్యాల మీద నమ్మకం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆదా యం వృద్ధి చెందుతుంది. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆర్థిక ఒత్తిళ్లు తగ్గు తాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధి స్తారు.
వృశ్చికం (విశాఖ, అనూరాధ, జ్యేష్ట)
అధికారులు బాగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. కొద్దిపాటి శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి తప్పకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా మాత్రమే పెరుగుతాయి. ఆర్థిక సమస్యల ఒత్తిడి ఉండకపోవచ్చు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో గానీ పనులు పూర్తి కావు. కుటుంబపరంగా కొద్దిగా సమస్యలుండే అవకాశం ఉంది. ఆరోగ్యం విష యంలో జాగ్రత్తలు అవసరం. బంధువుల విషయంలో ఓర్పు, సహనాలు అవసర మవుతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
రోజంతా హ్యాపీగా గడిచిపోతుంది. కొద్దిపాటి పట్టుదలతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. చాలావరకు రుణ విముక్తులవుతాయి. కొందరు ప్రముఖులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి బాగా ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపారాలు లాభాల బాటపడ తాయి. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. సొంత వ్యవహారాల మీద శ్రద్ధ పెడతారు. ఆర్థిక సమస్యలను ఒక ప్రణాళిక ప్రకారం తగ్గించుకునే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహా రాల్లో బంధుమిత్రులకు ప్రమేయం కల్పించకపోవడం మంచిది. ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. కొత్త బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుంది. వృత్తి జీవితం బాగా బిజీ అవుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయం సిద్ధిస్తుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాలు సాదా సీదాగా సాగిపోతాయి. వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ప్రతిఫలం బాగానే ఉంటుంది. వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలతో ఉక్కిరిబిక్కిరవుతారు. ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు కానీ వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కొత్త ఉద్యోగం విషయంలో దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభ వార్త అందుతుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. అధికారుల నుంచి విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. ఇతరులకు ఆర్థికంగా అండగా నిలబడతారు. కుటుంబసమేతంగా పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సాను కూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.