దిన ఫలాలు (సెప్టెంబర్ 14, 2024): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది కానీ, వృథా ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. మిథున రాశి వారికి అనారోగ్య సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
కొందరు బందుమిత్రులతో మాట తొందరపాటుతో వ్యవహరించే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలు సానుకూలంగా గడిచిపోతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాల్లో స్వల్ప లాభాలను అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది కానీ, వృథా ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఆరోగ్యం పరవాలేదు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆర్థిక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. అనుకున్న పనుల్ని అనుకూల సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభకు, సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. విలువైన వస్తువులు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో అంచనాలను అందుకుంటారు. ఇంటా బయటా గౌరవమర్యాదలు బాగా పెరుగుతాయి. మాటకు, చేతకు విలువ ఉంటుంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. స్వల్ప అనారోగ్యాలు తప్పకపోవచ్చు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
చేపట్టిన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, వృథా ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆస్తి వివాదం ఒకటి ఇబ్బంది పెడుతుంది. అనారోగ్య సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ వాతావ రణం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. అనుకున్న పనులు, వ్యవహారాలు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొం టారు. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. ఉద్యోగంలో సమర్థవంతంగా బాధ్యతలను నిర్వర్తిస్తారు. వ్యాపారాల్లో లాభాలపరంగా మరింత మెరుగైన పరిస్థి తులుంటాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబం మీద ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ లాభిస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ప్రయాణాల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇంటా బయటా అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ జీవితంలో స్థిరత్వం లభిస్తుంది. ధనపరంగా అనుకున్న పనులు అనుకున్నట్టు సాగిపోతాయి. ఆరోగ్యం గతం కన్నా మెరుగ్గా ఉంటుంది. కుటుంబసమేతంగా పుణ్యక్షేత్రం సందర్శి స్తారు. వృత్తి, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనుకోకుండా కొన్ని శుభ వార్తలు అందే అవకాశం ఉంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల్ని తేలికగా పరిష్కరించుకుంటారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఒకటి రెండు దీర్ఘకాలిక వివాదాల నుంచి, సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆదా యం సంతృప్తికరంగా ఉంటుంది. నిరుద్యోగులు నూతన ఉద్యోగావకాశాలు పొందుతారు. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాల్లో శత్రువులు కూడా మిత్రులుగా మార తారు. నూతన వాహన యోగానికి అవకాశం ఉంది. గృహోపకరణాలు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆదాయం పెరుగుతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
దీర్ఘకాలిక ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాల క్షేపం చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా, ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగులకు జీత భత్యాల విషయంలో శుభ వార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి సజావుగా సాగిపోతుంది. ఎటు వంటి ప్రయత్నం తలపెట్టినా దిగ్విజయంగా పూర్తవుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఏ పని తలపెట్టినా కొద్దిపాటి ఆటంకాలు తప్పకపోవచ్చు. కొన్ని వ్యవహారాలు వ్యయ ప్రయాస లతో పూర్తవుతాయి. ప్రయాణాలను ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల పరిస్థితులుంటాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ఖర్చుల్ని బాగా తగ్గించుకుంటారు. ఆధ్యాత్మిక వ్యవహారాలు ఎక్కువవుతాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది కానీ, వృథా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మీద ఖర్చులు ఎక్కువవుతాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగంలో అందరినీ మీ పనితీరుతో మెప్పిస్తారు. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ప్రముఖు లతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరే అవకాశం ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
సమాజంలో పెద్దలతో పరిచయాలు, సంబంధాలు విస్తృతం అవుతాయి. ఇల్లు కొనడానికి ప్రయ త్నాలు సాగిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. బంధుమిత్రులు కొందరికి ఉదారంగా సహాయం చేస్తారు. ఉద్యోగ జీవితంలో పని భారం ఎక్కువగా ఉన్నా ఉత్సాహంగా బాధ్యతలను నిర్వర్తిస్తారు. వృత్తి, వ్యాపారాలు మరింత ప్రోత్సాహకరంగా సాగు తాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా చేతికి వస్తుంది. బాకీలు వసూలవుతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
పెళ్లి ప్రయత్నాల విషయంలో కొందరు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ప్రయాణాల్లో మంచి పరిచయాలు కలుగుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో కొన్ని ఇబ్బందుల్ని అధిగమి స్తారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బం దేమీ ఉండదు. మీ సలహాలు, సూచనల వల్ల కుటుంబ సభ్యులు బాగా లాభపడతారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
చేపట్టిన ప్రతి పనీ విజయవంతంగా పూర్తవుతుంది. ఆస్తి తగాదాలు సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు బాగా ఉపకరిస్తాయి. బంధు వులకు వీలైనంతగా సహాయ సహకారాలు అందిస్తారు. దూర ప్రయాణాలకు ప్లాన్లు వేస్తారు. నిరు ద్యోగుల ప్రయత్నాలకు ఆశించిన సమాధానం లభిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధ చూపి స్తారు. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా ఆగిపోతాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కనిపిస్తాయి.