Horoscope Today
దిన ఫలాలు (మార్చి 13, 2024): మేష రాశి వారికి రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగాల్లో పదోన్నతులు లభిస్తాయి. స్వల్పంగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
- మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఆదాయం పరంగా, ఆరోగ్యపరంగా ఆశించిన మెరుగుదల ఉంటుంది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. సంతాన యోగానికి సంబంధించిన శుభవార్త అందుతుంది. విద్యార్థులు సునా యాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి.
- వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగాల్లో పదోన్నతులు లభిస్తాయి. స్వల్పంగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ, వృథా ఖర్చులు పెరుగుతాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనల వల్ల ఉపయోగం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకూలతలు బాగా పెరుగుతాయి. విద్యార్థులు కొద్దిపాటి శ్రమతో ఉత్తీర్ణత సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.
- మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అన్ని రంగాల వారికి శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. కొద్ది వ్యయ ప్రయాసలతో పనులన్నీ పూర్తి చేస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం కావచ్చు. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. బంధువులతో మాట పట్టింపులుండే అవకాశముంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు బాగుంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఖర్చులు పెరుగుతాయి.
- కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సొంత నిర్ణ యాలు సత్ఫలితాలనిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వ్యవహారా లను సకాలంలో పూర్తి చేస్తారు. ఇష్టమైన బంధుమిత్రులతో ఇంట్లో ఆనందంగా గడుపుతారు. దాదాపు అన్ని రంగాలవారికి అనుకూల వాతావరణం ఉంటుంది. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహరాలు అనుకూలిస్తాయి.
- సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాయి. ఏ పని చేపట్టినా విజయాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. కొద్దిగా శ్రమ, తిప్పట ఉన్నప్పటికీ, ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు గతం కంటే కొద్దిగా మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు బాగా అనుకూలంగా ఉంటాయి.
- కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఉద్యోగాలలో అధికారులతో ఆచి తూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రతి పనీ నిరాటంకంగా సాగిపోతుంది. సోదరుల నుంచి ఆస్తి వివాదాల్లో శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు చాలావరకు తగ్గిపోతాయి. ఎవరికీ వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం గానీ చేయవద్దు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులుంటాయి.
- తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ముందుకు సాగిపోతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి మంచి ఆఫర్లు అందివస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఆశించిన స్థాయిలో జీత భత్యాలు పెరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు నెమ్మదిగా పూర్తవుతాయి. విద్యార్థులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో కొత్త పుంతలు తొక్కుతారు.
- వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. కొన్ని ప్రయత్నాలు, నిర్ణయాలు విశేషంగా శుభ ఫలితాలనిస్తాయి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులకు ఆశించిన అవకాశాలు లభిస్తాయి. సంఘంలో విశేష గౌరవ మర్యాదలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తలెత్తుతాయి.
- ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): అనేక విధాలుగా సమయం అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాలలో కొన్ని చికాకులు, సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు బాగా మెరుగుపడతాయి. కుటుంబంలో ఆనందానికి లోటుండదు. విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది.
- మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలను విస్తరించే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదాలు చాలావరకు పరిష్కారమవుతాయి. గృహ నిర్మాణ కార్యక్రమాలకు సమయం అనుకూలంగా ఉంది. ముఖ్య వ్యవహారాల్లో ఆటంకాలున్నా పట్టుదలగా పూర్తి చేస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. విద్యార్థులు రికార్డులు సృష్టిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి.
- కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగి ఇబ్బందులు పడతారు. వృత్తి, వ్యాపారాలు ఓ మోస్తరుగా సాగిపోతాయి. పెండింగు పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. పిల్లల చదువులకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో చిక్కులు తొలగిపోతాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. కొందరు మిత్రులతో అపార్థాలు తలెత్తవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో సత్ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.
- మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. శుభకార్యాలు, దైవ కార్యాల మీద ఖర్చులు పెడతారు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు శుభవార్తలందుతాయి. సన్నిహితుల నుంచి సహకారం లభిస్తుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.