దిన ఫలాలు (జూన్ 13, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఇంటా బయటా అనుకూల అనుకూల పరిస్థితులుంటాయి. మాటకు విలువ పెరుగుతుంది. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. మిథున రాశి వారికి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఇంటా బయటా అనుకూల అనుకూల పరిస్థితులుంటాయి. మాటకు విలువ పెరుగుతుంది. ఆదాయం బాగా మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు చాలా వరకు చక్కబడతాయి. పిల్లలు చదువుల్లో ముందుంటారు. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితంలో బిజీ అయిపోతారు. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. నిరుద్యోగులకు మంచి సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. ప్రయాణాలు చాలావరకు లాభిస్తాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో అధికారుల ఆదరణ, ప్రోత్సాహం పెరుగుతాయి. అధికారుల నుంచి ఒకటి రెండు శుభ వార్తలు వినే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఆరో గ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. పిల్లలు చదువుల్లో విజయాలు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కొన్ని శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అనేక విధాలుగాద ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. కుటుంబంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఆర్థిక సమస్యలు తగ్గించుకుంటారు. ఆరోగ్యం ఒక మోస్తరుగా సాగిపోతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. కొద్దిగా శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగ జీవితం బాగానే ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఇంటా బయటా శ్రమ పెరుగుతుంది. ప్రతి పనికీ ఒకటికి రెండుసార్లు తిరగాల్సి వస్తుంది. కొందరు బంధుమిత్రులు మిమ్మల్ని సొంత పనులకు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు. స్నేహితుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. అలవికాని లక్ష్యా లతో అవస్థలు పడతారు. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడికి తగ్గ లాభం ఉంటుంది. వ్యక్తిగత సమ స్యల్ని కొద్ది ప్రయత్నంతో పరిష్కరించుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. బంధువుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. కుటుంబ సమేతంగా ఒకటి రెండు ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. కుటుంబ పరంగా ఆశించిన శుభ వార్తలు వింటారు. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం, సాన్నిహిత్యం పెరుగుతాయి. సహోద్యోగుల సహకారంతో ప్రధాన బాధ్యతలను పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కీలక మార్పులు చేపట్టి బాగా లాభాలు పొందుతారు. దాంపత్య జీవితం హాయిగా గడిచిపోతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. రోజంతా ఆనందంగా సాగిపోతుంది. ఏ పని తలపెట్టినా సంతృప్తికరంగా పూర్తవుతుంది. కొత్త ప్రయత్నాలకు ఇది బాగా అనుకూలమైన సమ యం. అనేక మార్గాల్లో ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరు గుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. విలాస జీవితం మీద ఖర్చు పెరుగుతుంది. మిత్రుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. మీతో అధికారాలను పంచుకునే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో బిజీ అయిపోయే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవ హారాల్ని సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ప్రముఖులతో పరిచ యాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. పిల్లల విషయంలో ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబంతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. లాభదాయక వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవు తుంది. వృత్తి, వ్యాపారాల్లో క్రమంగా నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం సానుకూలంగా, సామరస్యంగా సాగిపోతుంది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారుల నుంచి ఆశించిన ఆదరణ లభిస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక అవసరాల నుంచి విముక్తి లభిస్తుంది. కొందరు స్నేహితులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు బాగా కలిసి వస్తాయి. ఆదాయం, ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ, అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
కుటుంబపరంగా ఒకటి రెండు సమస్యలు ఎదురైనా వాటిని తేలికగా అధిగమిస్తారు. అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తయి, లాభాలు పొందు తారు. సొంత ప్రయత్నాల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇతరులపై ఆధారపడకపోవడం మంచిది. అదనపు ఆదాయ మార్గాలన్నీ ఆశించిన ఫలితాలనిస్తాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపో తాయి. కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తిగత సమస్య ఒకటి తొలగిపోతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదాయం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. బంధుమిత్రుల వల్ల డబ్బు నష్టం అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వమూలక ధన లాభం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుంచి కొద్దిపాటి ఒత్తిడి, వేధింపులు ఉండే అవకాశం ఉంది. బాధ్యతలు, లక్ష్యాల మీద దృష్టిపెట్టడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఉంటుంది. ఇతరులతో కాస్తంత ఆచితూచి వ్యవహరించడం మంచిది. పిల్లలకు సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.