Horoscope Today 11th October 2024
దిన ఫలాలు (అక్టోబర్ 11, 2024): మేష రాశి వారికి ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృషభ రాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు తప్పకుండా శుభవార్త అందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
- మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): బ్యాంక్ బ్యాలెన్స్ బాగానే ఉంటుంది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. అధికారులతో సామరస్యం పెరుగుతుంది కానీ, సహోద్యోగులతో ఇబ్బందులుండే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపా రాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. దూర ప్రయాణ సూచనలున్నాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్య క్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఆర్థిక విషయాలు, లావాదేవీల్లో కొద్దిగా ఇబ్బందులు తప్పకపోవచ్చు.
- వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): వృత్తి, ఉద్యోగాల్లో పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడడం మంచిది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు చేకూరుతాయి. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహం కలిగిస్తాయి. షేర్లు, స్పెక్యులేష న్లలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సమయం కాదు. పెళ్లి సంబంధానికి సంబంధించిన శుభ వార్తలు అందుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
- మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఎదురు చూస్తున్న శుభవార్తులు అందుతాయి. ఇంటికి బంధువులు రావడం వల్ల పండుగ వాతా వరణం నెలకొంటుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారాలకు ఆశించిన లాభాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. నిరుద్యోగులకు తప్పకుండా శుభవార్త అందుతుంది. ఏ పని తల పెట్టినా కొద్దిగా శ్రమ, తిప్పట ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది.
- కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): మొండి బాకీలు వసూలవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగు తాయి. ఉద్యోగంలో మంచి పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనుకున్న పనులన్నీ సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆఫర్ల విష యంలో నిరుద్యోగులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
- సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం చాలా మంచిది. దైవ సేవా కార్యక్రమాలకు ధన వ్యయం చేస్తారు. కొందరు చిన్ననాటి మిత్రులతో విహార యాత్ర చేస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. వ్యాపారాలను విస్తరించే ఆలోచన చేస్తారు. వ్యక్తి గతంగా, కుటుంబపరంగా చిన్నా చితకా సమస్యలు తప్పకపోవచ్చు. ఆదాయం నిలకడగా సాగిపో తుంది. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండకపోవచ్చు.
- కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఒత్తిడి, శ్రమ ఉన్నప్పటికీ, చేపట్టిన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వకపోవడం మంచిది. పిల్లలు చదువుల్లో, పోటీ పరీక్షల్లో ఘన విజయాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. వృత్తి జీవితంలో డిమాండ్ పెరిగి, విశ్రాంతి తగ్గుతుంది. ఉద్యోగంలో ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది.
- తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): వ్యాపార వ్యవహారాలు కొద్దిగా నిదానంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కాస్తంత అప్రమత్తంగా ఉండడం మంచిది. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. సోదర వర్గంతో ఆస్తి వివా దాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కొత్త కార్యక్రమాలు, ప్రయత్నాలు చేపట్టడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్త వినే అవకాశం ఉంది.
- వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): ఆర్థిక పరిస్థితి కొద్దిగా గందరగోళంగా ఉండే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టడంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఉంది. దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరు అధికారులకు సంతృప్తి కలిగి స్తుంది. నిరుద్యోగులు కొద్దిగా నిరుత్సాహపడడం జరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి.
- ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): అన్ని వైపుల నుంచి ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగావకాశాలు అందుతాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్న తులకు అవకాశం ఉంది. వ్యాపారాల్లో మార్పులు చేపట్టి ఆశించిన లాభాలు అందుకుంటారు. రాదనుకున్న డబ్బు, రావాల్సిన డబ్బు చేతికి అందుతాయి. మొండి బాకీలు కూడా వసూలవు తాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చు బాగా పెరుగుతుంది. స్వల్ప అనారోగ్యం తప్పకపోవచ్చు.
- మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2): వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో కొన్ని సమస్యలు చికాకు పెడతాయి. వ్యాపారాల్లో కొన్ని ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ధనపరంగా కొన్ని ఇబ్బందులను అధిగమిస్తారు. ముఖ్యంగా రుణ సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. దైవ సేవా కార్య క్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెంచడం మంచిది. ఉద్యోగం విషయంలో ఆశించిన శుభవార్త అందుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.
- కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వృత్తి, వ్యాపారాలు కొంత అనుకూలంగా సాగుతాయి. రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబం ధాలు ఏర్పడతాయి. అవసరానికి తగ్గట్టుగా డబ్బు అందుతుంది. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో బాధ్యతల మార్పు ఉంటుంది. స్థాన చలనానికి కూడా అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగావకాశాలు అందుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం శ్రేయస్కరం.
- మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): కొద్దిపాటి శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు అంది వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు అమలు చేసి లాభం పొందుతారు. ఉద్యోగంలో సహోద్యోగులతో కొద్దిపాటి వివా దాలు తప్పకపోవచ్చు. ఆదాయ పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది.