దిన ఫలాలు (ఏప్రిల్ 11, 2024): మేష రాశి వారు గురువారంనాడు ఏ పని తలపెట్టినా మిత్రుల నుంచి అవసరమైన సహాయం లభిస్తుంది. వృషభ రాశి వారు వ్యక్తిగత సమస్యల కారణంగా ఒత్తిడికి గురవుతారు. వృథా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మిథున రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆర్థిక పరిస్థితి బాగా ఆశాజనకంగా ఉంటుంది. ఏ పని తలపెట్టినా మిత్రుల నుంచి అవసరమైన సహాయం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రయాణ సూచ నలున్నాయి. సోదరులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండు బాగా పెరుగుతుంది. ఏ విషయంలోనూ తొందరపా టుతో వ్యవహరించవద్దు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వ్యక్తిగత సమస్యల కారణంగా ఒత్తిడికి గురవుతారు. వృథా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాల వల్ల లాభాలుంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారా లను విస్తరించే కార్యక్రమం చేపడతారు. ఉద్యోగంలో అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ పెద్దల్లో ఒకరి ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారేందుకు అవకాశం ఉంది. నిరుద్యోగులు ఆశించిన శుభవార్త వింటారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వ్యత్తి, వ్యాపారాల తీరుతెన్నుల్లో మార్పులు తీసుకు వచ్చి లబ్ధి పొందుతారు. కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. పిల్లల చదువులు బాగానే సాగిపోతాయి. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. కొత్త పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యం పరవాలేదు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో లాభాలను అందుకుంటాయి. నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా మంచి అవకాశాలు అంది వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి రాబడి బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు, శుభకార్యాలకు సంబంధించి ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం విషయంలో దూర ప్రాంతం నుంచి లేదా విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కొందరు బంధువులతో ఏర్పడ్డ వివాదాలు తొలగుతాయి. వ్యాపారాల్లో లావాదేవీలు, కార్యకలాపాలు విస్తరిస్తాయి. ఉద్యోగంలో కొన్ని శుభ వార్తలు వినే అవకాశం ఉంది. వృత్తి జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు నెమ్మదిగా సాగుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో ఉన్నత స్థానానికి వెళ్లే అవకాశముంది. వృత్తి జీవితంలో డిమాండు పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి నుంచి, కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆదాయం పెరిగి ముఖ్యమైన అవసరాలను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యంలో పాల్గొంటారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో స్థాయి, హోదాలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారపరంగా ముందుకు దూసుకు పోతారు. విద్యార్థులు, పిల్లలు విద్యా విషయాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. మిత్రులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగులకు అనుకోకుండా మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి ఇది అనుకూలమైన సమయం. అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆస్తి విషయాల్లో సానుకూలతలు, లాభాలు కాస్తంత ఎక్కువగానే ఉంటాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గి మానసికంగా ప్రశాంతత అనుభవిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాల్లో ఆదరణ, ప్రోత్సాహంతో పాటు ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యాపారాల్లో అంచనా లకు మించిన లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, కొత్త కార్యక్రమాలు చేప ట్టడానికి ఇది బాగా అనుకూల మైన సమయం. మిత్రుల నుంచి విందు వినోదాలకు ఆహ్వానాలందుతాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
మకరం (ఉత్తరాషాడ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
ఉద్యోగుల మీద అధికారులకు గౌరవాభిమానాలు పెరుగుతాయి. హోదాలు పెరిగే అవకాశం కూడా ఉంది. ఇంటా బయటా గౌరవమర్యాదలకు లోటుండదు. శత్రువులు కూడా మిత్రులుగా మారు తారు. చాలా కాలంగా వేధిస్తున్న ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామి సహాయంతో కొత్త ఆదాయ ప్రయత్నాలు చేపడతారు. అనుకోకుండా కొన్ని మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఏ రంగం వారికైనా ప్రస్తుతం సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు ప్రవేశపెట్టి ప్రయోజనాలు పొందు తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశముంది. ఆర్థిక పరిస్థితికి ఇబ్బం దేమీ ఉండదు. అవసరానికి డబ్బు అందుతుంది. వివాహ ప్రయత్నాల్లో శుభ వార్తలు అందే అవకాశముంది. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. గృహ, వాహన కొనుగోలు వ్యవ హారాల మీద దృష్టి పెడతారు. చేపట్టిన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి, కుటుంబ వ్యవ హారాలను చక్కబెడతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి జీవితం ప్రోత్సాహక రంగా సాగిపోతుంది. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాటపడ తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.