దిన ఫలాలు (జూలై 10, 2024): మేష రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. వృషభ రాశి వారు ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. మిథున రాశి వారికి ఉద్యోగ జీవితం చాలావరకు ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, వ్యాపారాల్లో ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. లాభాల పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగులు తమ పనితీరుతో అధికారులను మెప్పిస్తారు. కొందరు ఇష్టమైన బంధువులు, మిత్రులతో సరదాగా గడుపుతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు చాలావరకు ఫలిస్తాయి. ఆర్థికంగా పురోగతి చెందుతారు. ఇంటా బయటా గౌరవమర్యాదలకు లోటుండదు. కొద్ది కొద్దిగా ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు జోరందుకుంటాయి. లాభాలకు లోటుండదు. కీలక వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగ జీవితంలో కాస్తంత ఒత్తిడి ఉన్న ప్పటికీ, అధికారులకు నచ్చిన విధంగా బాధ్యతలు పూర్తి చేస్తారు. కొందరు బంధువులు ఆర్థికంగా ఇబ్బంది పెడతారు. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగ జీవితం చాలావరకు ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు లభిస్తాయి. కుటుంబ పరిస్థితులు చాలావరకు చక్కబడతాయి. కుటుంబ సభ్యుల మీద కొద్దిగా ఖర్చు పెరిగే అవకాశం ఉంది. ఒక శుభ కార్యంలో ఇష్టమైన బంధువులను కలుసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఎదురు చూస్తున్న కొత్త అవకాశాలు అంది వస్తాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆదాయం క్రమంగా పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా, లాభసాటిగా సాగిపోతాయి. పోటీదార్ల సమస్య కూడా బాగా తగ్గే అవకాశం ఉంది. ఉద్యోగంలో అలవికాని లక్ష్యాలతో ఇబ్బంది పడతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఒకరిద్దరు బంధువులతో అపార్థాలు తలెత్తుతాయి. గృహ వాతావరణం సందడిగా, సరదాగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో కొద్దిగా ఒత్తిడి, వేధింపులు ఉండవచ్చు. వ్యాపారాల్లో కొన్ని లాభసాటి మార్పులు చేప డతారు. వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబంతో కలిసి ఇష్టమైన ఆల యాలను సందర్శిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆస్తి వ్యవహా రాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో సాదా సీదాగా సాగిపోతాయి. ఉద్యోగ బాధ్యతల్లో కొద్దిగా మార్పులు చోటు చేసు కుంటాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలుంటాయి. కుటుంబ వ్యవహారాలు సంతృప్తి కరంగా ముందుకు సాగుతాయి. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన శుభవార్త వింటారు. కొందరు బంధువులతో కొద్దిగా ఇబ్బందులుంటాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగిపోతాయి, వ్యక్తి గత సమస్యల నుంచి కొద్దిగా ఊరట లభిస్తుంది. అనవసర ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
గ్రహాల అనుకూలత వల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. ఆరోగ్య సమస్యలు ఉండకపోవచ్చు. అదనపు ఆదాయ మార్గాలు కూడా సత్ఫలితాలనిస్తాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపో తాయి. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొందరు మిత్రుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చికం (విశాఖ 4, అనూరా, జ్యేష్ట)
ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. సన్నిహితుల వల్ల మోసపోయే అవ కాశం ఉంది. పనులు, ప్రయత్నాలు, వ్యవహారాలన్నీ సజావుగా పూర్తవుతాయి. అనేక విధాలుగా ఆదాయం అందే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. అధి కారులతో సామరస్యం పెరుగుతుంది. కొందరు దూరపు బంధువులతో సాన్నిహిత్యం వృద్ధి చెందు తుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ముఖ్యమైన వ్యవహారాల్లో పట్టుదల, చొరవ ప్రదర్శిస్తారు. పెండింగు పనులన్నీ పూర్తవుతాయి. కొందరు ఇష్టమైన బంధువుల రాకపోకల వల్ల ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. జీవిత భాగస్వామితో పూజాదికాలు నిర్వహించే అవకాశం ఉంది. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థికంగా సహా యపడతారు. వృత్తి, వ్యాపారాల్లో అనుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధి కారులకు మీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
బంధువుల తోడ్పాటుతో పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. దీనివల్ల ఊరట లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమా ధిక్యత ఉంటుంది. పెట్టుబడికి, శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. బంధుమిత్రులకు సహాయకారిగా ఉంటారు. దైవ కార్యాలకు సహకారం అందజేస్తారు. ఉద్యోగ ప్రయత్నాల ఒక కొలిక్కి వస్తాయి. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. మొండి బాకీలను, బకాయిలను పట్టుదలగా వసూలు చేసుకుంటారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. కొద్ది శ్రమతో దాదాపు ప్రతి పనీ పూర్తవుతుంది. ఆహార, విహారాల్లో వీలైనంగా జాగ్రత్తలు పాటించడం మంచిది. వీలైతే ప్రయాణాలు వాయిదా వేయాల్సిన అవసరం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పరవాలేదనిపిస్తాయి. ఉద్యోగంలో పని భారం వల్ల శ్రమ పెరుగుతుంది. ఆస్తి వివాదం ఒకటి చాలావరకు పరిష్కారం అవుతుంది. మంచి పరిచ యాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు అవకాశాలు కలిసి వస్తాయి. మాట తొందరపాటు వల్ల మిత్రులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
సమయం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొత్త నిర్ణయాలు తీసుకోవడం, కొత్త ప్రయత్నాలు చేపట్టడం మంచిది. ఆదాయ ప్రయత్నాలన్నీ ఫలించి ఆర్థికంగా ఆశించిన స్థాయి పురోగతి సాధి స్తారు. ఆస్తి సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. షేర్లు లేదా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్ట డానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుం డదు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించవచ్చు.