
దిన ఫలాలు (మార్చి 9, 2024): మేష రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి కొద్దిగా ఇబ్బందులుంటాయి. వృషభ రాశి వారికి కుటుంబపరంగా చిన్నపాటి సమస్యలు తప్పకపోవచ్చు. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. వ్యాపారం నిలకడగా సాగిపోతుంది. మేష రాశి మొదుల మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో అధికారుల నుంచి కొద్దిగా ఇబ్బందులుంటాయి. లక్ష్యాలను, బాధ్యతలను పట్టుదలగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరగడంతో పాటు, మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి కొన్ని ఆశించిన శుభవార్తలు వింటారు. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. పిల్లలు విజయాలు సాధిస్తారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
కుటుంబపరంగా చిన్నపాటి సమస్యలు తప్పకపోవచ్చు. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. మధ్య మధ్య కుటుంబ సంబంధమైన ఇబ్బందులు, అనారోగ్యాలు తప్పక పోవచ్చు. అయితే, వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకర పరిస్థితులు ఉండడం, పిల్లలు వృద్ధిలోకి రావడం జరుగుతుంది. ఒకటి రెండు శుభవార్తలు వినే సూచనలు కూడా ఉన్నాయి. ఫలితంగా చాలావరకు ఊరట చెందడం జరుగుతుంది. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకోవడం జరుగుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. వ్యాపారం నిలకడగా సాగిపోతుంది. అవసరానికి తగ్గట్టుగా చేతిలో డబ్బుండే అవ కాశం ఉంది. కొందరు బంధుమిత్రులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. సర్వత్రా పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఒకటి రెండు ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుం టారు. ఆర్థిక లావాదేవీలు ఆశించిన విధంగా ప్రయోజనాలను ఇస్తాయి. బంధుమిత్రులతో విందుల్లో పాల్గొంటారు. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమవుతుంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. దైవ కార్యాల్లో, సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం పరవాలేదు. కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాలపరంగానే శుభవార్తలు వింటారు. ముఖ్యంగా ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వ్యాపారాలు సాధారణంగా కొనసాగుతున్నప్పటికీ ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబపరంగా ఆశించిన అభివృద్ధి కనిపి స్తోంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి ఊహించని సమాచారం అందుతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో మీ మాటకు ఎదురుండదు. వృత్తి జీవితంలో వేగం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలకు కొరత ఉండదు. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి కానీ, వృథా ఖర్చుల మీద అదుపు ఉండదు. ఆదాయ ప్రయత్నాలను విస్తరించుకునే ప్రయత్నం చేస్తారు. విలాసాల మీద ఎక్కువగా ఖర్చయ్యే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఉద్యోగంలో తప్పకుండా ప్రాధాన్యం పెరు గుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటా బయటా గౌరవ మర్యా దలకు లోటు ఉండదు. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. వృత్తి జీవితం సానుకూల మలుపు తిరుగుతుంది. పెద్దల సలహాలు, సూచనలతో కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండకపోవచ్చు. మిమ్మల్ని విమర్శించేవారిలో మార్పు వస్తుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగం పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. చేపట్టిన పనులను సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఖర్చులకు కళ్లెం వేస్తారు. అయితే, ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం కానీ మంచిది కాదు. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కుటుంబ వ్యవ హారాల్లో స్థిర నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టడం మంచిది. బంధుమిత్రులతో మంచి కాల క్షేపం చేస్తారు. జీవిత భాగస్వామి స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో కొన్ని అనుకూలతలుంటాయి కానీ, పనిభారం పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చు చేయడం జరుగుతుంది. ముఖ్యమైన పనులు నిదానంగా, ప్రశాంతంగా పూర్తవుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రయాణాల వల్ల కష్టనష్టాలు అనుభవించాల్సి వస్తుంది. శుభవార్త వింటారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగ జీవితంలో ఒత్తిడి, వేధింపులు ఉండే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులు కొందరు బాగా సన్నిహితులవుతారు. విందు కార్యక్రమంలో పాల్గొంటారు. దూర ప్రాంతంలో ఉన్న బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవ కాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు మంచి స్పందన లభిస్తుంది. సరికొత్త పరిచయాలు ఏర్ప డతాయి. తలపెట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడించే అవకాశం ఉంది. ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకుని మంచి కాలక్షేపం చేస్తారు. ఊహించని ధన యోగం పడుతుంది. తలపెట్టిన పనులు, పెండింగ్ పనులు సజావుగా సాగిపో తాయి. దైవ చింతన పెరుగుతుంది. పిల్లల నుంచి శుభ వార్తలందుకుంటారు. కుటుంబ సమస్యల పరిష్కారంపై దృష్టి పెడతారు. నిరుద్యోగులు అనుకోకుండా మంచి అవకాశాలు అందుకుంటారు.