Horoscope Today (October 08-10-2021): ఈరోజులో కొత్తపనిని మొదలు పెట్టాలన్నా , శుభకార్యాలు మొదలు పెట్టాలన్నా జాతకాలు, రాశిఫలాల ఆధారంగా చేసేవారు చాలామంది ఉన్నారు. జాతకాలను విశ్వసిస్తూ పనిని మొదలుపెట్టే ముందు కొంతమంది ఈరోజు తమ జాతకం ఎలా ఉంది అంటూ.. తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 8న ) శుక్రవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. తెలుసుకుందాం..!
మేష రాశి: ఈ రోజు ఈ రాశివారు సులభంగా, వేగంగా అనేక సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇతరుల నుంచి ఎక్కువ ఆశించకుండా ఉండటం మంచిది. ఈ రకమైన ఆలోచనలను అధిగమించండి. అంతేకాకుండా ఉన్న స్థాయికి చేరుకోవడానికి మీ వంతుగా కృషి చేయాల్సి ఉంటుంది.
వృషభ రాశి: ఈ రాశివారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. వ్యాపారాన్ని విస్తరించుకుంటారు. వ్యక్తిగత సంబంధాల్లో అనుకూలంగా ఉంటుంది. మీరు మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. కార్యాలయంలో దొంగతనానికి అవకాశముంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి.
మిధున రాశి: ఈ రాశివారికి ఈ రోజు వ్యక్తిగత సంబంధాల విషయాల్లో విభేదాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ కారణంగా మీరు నిరాశ చెందుతారు. జీవితంలో కఠినమైన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం మంచిది.
కర్కాటక రాశి: ఈ రాశివారు కూతురు కెరీర్ కు సంబంధించిన స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబం పట్ల మీ వైఖరి ఉదారంగా ఉంటుంది. యువకులను ప్రోత్సహించడంలో మీరు విజయం సాధిస్తారు. మీ ఉదారతను, తెలివితేటలను స్నేహితులను ఉపయోగించుకోవాలనుకుంటారు. మానసిక స్థితి చెదిరిపోతుంది.
సింహరాశి: ఈ రాశివారు ఈ రోజు వ్యాపారంలో విజయం సాధిస్తారు. అంతేకాకుండా అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ కారణంగా మీరు స్వేచ్ఛగా షాపింగ్ చేస్తారు. కార్యాలయంలో నిజాయితీగా పనిచేయాలనుకుంటారు. ఈ రోజు మీరు సంతోషంగా ఉంటారు.
కన్యారాశి: ఈ రాశివారికి నూతన అవకాశాలు సిద్ధిస్తాయి. మీ అభిప్రాయాలను బహిరంగంగా తెలియజేయాల్సిన సమయం వచ్చింది. ఇది మీ మనస్సును తేలికపరుస్తుంది. ఇతరులను క్షమించడం నేర్చుకోండి. నిర్ణయాలు తీసుకునే ముందు మనస్సు మాట వినండి.
తులారాశి: తులా రాశి వారికి గతకాలం ముగుస్తుంది. ఈ రోజు నూతన అవకాశాలు సిద్ధిస్తాయి. సరికొత్త దృక్పథంతో మీ సృజనాత్మక సామర్థ్యం పెరుగుతుంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. అనవసర విషయాల్లో తలదూర్చకపోతే మంచిది.
వృశ్చిక రాశి: ఈ రోజు ఈ రాశివారు వ్యక్తిగత, వ్యాపార విషయాల్లో శక్తిమంతంగా ఉండటం ద్వారా ధైర్యంగా ఉంటారు. ప్రేమ వ్యవహారంలో మీ మానసిక స్థితి ఆహ్లాదకరంగా ఉంటుంది. షాపింగ్ చేయడం వల్ల డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు.
ధనుస్సు రాశి: ఈ రాశివారు ప్రతికూల ఆలోచనలు తొలగించడానికి ప్రయత్నిస్తే మంచిది. మీరు మానసిక అసంతృప్తి చెందుతారు. మిథున రాశి వారు మీ జీవితంలో సంతోషం తీసుకొస్తారు. వ్యక్తిగత సంబంధాల విషయంలో మీరు ప్రస్తుతానికి వాగ్ధానాలు చేయకపోతే మంచిది.
మకరరాశి: ఈ రాశివారు పాత పద్ధతులను మెరుగుపరుస్తారు. భావోద్వేగాన్ని నివారించాలి. ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. భావోద్వేగాలు వ్యక్తిగత సంబంధాలపై ఆధిపత్యం చెలాయిస్తాయి. పాత వ్యసనాలు మానేయాల్సిన సమయం వచ్చింది. అనవసర విషయాల్లో తలదూర్చకుండా ఉండండి.
కుంభ రాశి: ఈ రాశివారు ఈరోజు వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటూ వర్తమానాన్ని మర్చిపోకుండా ఉండాలి. ప్రతి క్షణాన్ని ఆస్వాదించేందుకు ప్రయత్నించండి. అద్భుతమైన వ్యక్తిగత అనుభవాన్ని కోల్పోయే అవకాశముంది.
మీనరాశి: ఈ రాశివారికి తల్లిదండ్రుల సహకారం ఉంటుంది. వ్యక్తిగత సంబంధాలు, కుటుంబ పరిస్థితుల విషయంలో గజిబిజిగా ఉండే వైఖరిని తీసుకోవద్దు. అనవసర విషయాల్లో తలదూర్చకుండా ఉంటే మంచిది. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.