దిన ఫలాలు (నవంబర్ 6, 2023): మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా వ్యాపారాలు, ఇతర రంగాలలోని వారికి సైతం కొద్దో గొప్పో పురోగతి అనుభవానికి వస్తుంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. మిథున రాశి వారికి అన్ని విధాలుగానూ ఆదాయం పెంచుతుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాడు రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా వ్యాపారాలు, ఇతర రంగాలలోని వారికి సైతం కొద్దో గొప్పో పురోగతి అనుభవానికి వస్తుంది. ముఖ్యంగా ఆదాయం పెరగడం మొదలవుతుంది. ఆరోగ్యంలో కూడా ఆశించిన విధంగా మెరుగుదల ఉంటుంది. ఉద్యోగాల్లో మార్పు కోరుకునేవారికి ఇది చాలా అను కూలమైన సమయం. జీవితానికి, కుటుంబానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటే ప్రయో జనం ఉంటుంది. ప్రయత్నాలు, వ్యవహారాలన్నీ సఫలం అవుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగంలో పని భారం పెరిగినా, బరువు బాధ్యతలు అధికమైనా మంచి గుర్తింపుతో పాటు ప్రోత్సాహకాలుంటాయి. ధన వ్యవహారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఇల్లు లేదా స్థలం కొనడం మీద దృష్టి పెడ తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. కుటుంబంలో సుఖ సంతోషాలకు కొరత ఉండదు. సతీమణితో బాగా అన్యోన్యత పెరుగుతుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
లాభ స్థానంలో ఉన్న గురు గ్రహం అన్ని విధాలుగానూ ఆదాయం పెంచుతుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. సోదరులతో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ముందుకు దూసుకుపోయే సూచనలున్నాయి. నిరుద్యోగులకు సానుకూల సమాచారం అందుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. రాదనుకున్న డబ్బు కూడా చేతికి అందే అవకాశం ఉంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉదయమే లేచి శివుడిని ధ్యానిస్తే అష్టమ శని ప్రభావం చాలావరకు తగ్గుతుంది. వృత్తి, ఉద్యోగా లలో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనుకున్నదొకటి, అయింది ఒకటి అన్నట్టుగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహా రాల్లో తిప్పట, వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ముఖ్యమైన పనులు, వ్యవహారాలన్నిటినీ కష్టపడి పూర్తి చేస్తారు. గురు బలం కారణంగా వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు ఎదురుండదు. అధికారులకు బాగా సన్నిహితం అవుతారు. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతూ ఉంటాయి. మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక ప్రయత్నాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల నుంచి సానుకూల సమాచారం అందుతుంది. మంచి పరిచయాలు ఏర్పడ తాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
శని బాగా అనుకూలంగా మారినందువల్ల కొన్ని ప్రధానమైన సమస్యల నుంచి, ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. కొద్దిపాటి ప్రయత్నంతో ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో బాగా ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారాల్లో నష్టాలకు అవకాశం ఉండకపోవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించవచ్చు. దైవ కార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ప్రయత్నాలన్నీ సానుకూలపడతాయి. ఆదా యం పెరుగుతుంది కానీ, దాంతోపాటే వృథా ఖర్చులు కూడా పెరుగుతాయి. అనవసర పరిచ యాల కారణంగా కొద్దిగా ఇబ్బంది పడతారు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చి భంగపడే అవ కాశం కూడా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలపరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
మధ్య మధ్య అర్ధాష్టమ శని తాలూకు దుష్ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. వ్యయ ప్రయాసలతో తప్ప ఏ పనీ పూర్తి కాదు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. గృహ నిర్మాణ వ్యవహారాలు చికాకు పరుస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం ఎక్కువగా ఉంటుంది. బంధు మిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. తల్లి వైపు నుంచి కొద్దిగా శుభవార్తలు వినడం జరుగు తుంది. సతీమణికి వృత్తి, ఉద్యోగాలపరంగా సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాల్లో ప్రమోషన్లకు సంబంధించి ఎటువంటి ఆటంకాలున్నా తొలగిపోతాయి. దాదాపు ప్రతి రంగంలోని వారికీ పురోగతి ఉంటుంది. శుభవార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసు కోవడం జరుగుతుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లలు కానీ, తల్లితండ్రులు కానీ ఇంటికి రావడం జరుగుతుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యక్తిగత జీవితం కూడా బాగా బిజీ అయిపోతుంది. పిల్లలు చదువుల్లో ఆశించిన స్థాయిలో రాణిస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
రాశ్యధిపతి అయిన శనీశ్వరుడు రుజు మార్గం పట్టినందువల్ల, కొన్ని కష్టాలు, ఒత్తిళ్లు తగ్గుముఖం పడతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ప్రము ఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి సానుకూలంగా పురోగతి చెందుతుంది. మన సులోని కోరికలు నెరవేరుతాయి. అనుకోకుండా కొన్ని శుభవార్తలు వింటారు. ప్రయాణాల్లోనూ, ఆహార విహారాల్లోనూ జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ముఖ్యమైన వ్యవహారాలు, పనులన్నీ అతి కష్టం మీద పూర్తవుతాయి. ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసలుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం బాగా పెరిగి, విశ్రాంతి కరువవుతుంది. నిరుద్యోగు లకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. బంధుమిత్రుల రాకపోకలుంటాయి. కుటుంబ సమస్యలు పరిష్కారమయ్యే సూచనలున్నాయి. ఒకరిద్దరు బంధువులకు ఇతోధికంగా ఆర్థిక సహాయం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదాయం పరిస్థితి మెరుగ్గానే ఉన్నప్పటికీ, శుభ కార్యాల మీదా లేదా దైవ కార్యాల మీదా వెనుకా ముందూ చూడకుండా ఖర్చు చేసే సూచనలున్నాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆశిం చిన సహాయ సహకారాలుంటాయి. సతీమణితో అన్యోన్యత సామరస్యం పెరుగుతాయి. వృత్తి, ఉద్యో గాల్లో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయ త్నాల్లో విజయం చేకూరుతుంది. కొందరు రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
(Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము)
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి