Horoscope Today: ఈ రాశివారు ఒకట్రెండు శుభవార్తలు వింటారు.. మంగళవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.?

| Edited By: Ravi Kiran

Feb 06, 2024 | 7:20 AM

ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఒక శుభ పరిణామం కూడా చోటు చేసుకుంటుంది. ఇంటా బయటా సమర్థవంతంగా బాధ్యతలను నిర్వర్తిస్తారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతాయి.

Horoscope Today: ఈ రాశివారు ఒకట్రెండు శుభవార్తలు వింటారు.. మంగళవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.?
Horoscope
Follow us on

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగాల్లో అధికారుల సహాయంతో పదోన్నతులు పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో మీ శక్తి సామ ర్థ్యాలను చాటుకుంటారు. దగ్గర బంధువులతో శుభకార్యంలో పాల్గొంటారు. రాజకీయ ప్రముఖు లతో పరిచయాలు పెరుగుతాయి. వస్తు లాభాలు పొందుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి ఆఫర్లు అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగి పోతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనుల్లో కొద్దిగా ఆటంకాలు ఉండవచ్చు. ఆదా యం బాగున్నప్పటికీ వృథా ఖర్చులతో ఇబ్బంది పడతారు. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగి పోతాయి. బంధుమిత్రులతో స్వల్ప విభేదాలకు అవకాశం ఉంది. కుటుంబ విషయాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపో తాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో సమస్యలను, లోపాలను అధిగమిస్తారు. ఆస్తి విషయంలో సోదరుల నుంచి శుభవార్త వింటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగంలో ఉత్సాహంగా ముందుకు వెడతారు. ఆదాయం గతం కంటే మెరుగుపడుతుంది. ఇంటా బయటా సానుకూల తలు పెరుగుతాయి. ఎక్కువగా శుభవార్తలు వింటారు. అనుకోకుండా ఒక శుభ పరిణామం కూడా చోటు చేసుకుంటుంది. ఆర్థిక ప్రయత్నాలు, అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాలు చాలావరకు సానుకూలంగా సాగిపోతాయి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరిం చడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిళ్లు కొద్దిగా చికాకు పెడతాయి. చేపట్టిన పనులు సవ్యంగా సాగిపోతాయి. వ్యాపారాలలో సమస్యలు పరిష్కారమై, లాభాలు పెరుగుతాయి. మిత్రులతో స్వల్ప వివాదాలు తప్పకపోవచ్చు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండకపోవచ్చు. అదనపు ఆదాయ మార్గాలకు సంబంధించి శుభవార్త వినే అవకాశం ఉంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఒక శుభ పరిణామం కూడా చోటు చేసుకుంటుంది. ఇంటా బయటా సమర్థవంతంగా బాధ్యతలను నిర్వర్తిస్తారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. బంధుమిత్రుల్లోనే కాకుండా సామాజి కంగా కూడా మీ విలువ పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో యత్న కార్యసిద్ధి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవాలి. ఇష్టమైన ఆలయాలు సందర్శి స్తారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగులకే కాకుండా విద్యార్థులకు కూడా సమయం బాగా అనుకూలంగా ఉంది. విద్యార్థులకు విద్యావకాశాలు పెరుగుతాయి. విజయాలు సాధిస్తారు. ఉద్యోగులకు కూడా అవకాశాలు అంది వస్తాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆదాయం నిలకడగా ముందుకు సాగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో కీలక బాధ్యతలను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. బంధువుల విషయంలో కల్పించుకోకపోవడం మంచిది. పిల్లల నుంచి సంతోషకరమైన సమాచారం అందు కుం టారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో అంచనాలను అందుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతికి లేదా ఇంక్రిమెంట్లుఝ పెరగడానికి అవకాశం ఉంది. లాభసాటి ప్రయాణాలు చేయడం జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ధనాదాయం ఆశాజనకంగా కొనసాగుతుంది. మీ సలహాలు, సూచనల వల్ల బంధువులు ప్రయోజనం పొందుతారు. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయాల్సి వస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందులో పాల్గొంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు పెరుగుతాయి. సహోద్యోగుల నుంచి ఆశించిన సహకారం అందు తుంది. వృత్తి జీవితంలో ప్రతిభా పాటవాలకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరుగుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి బంధువుల ద్వారా శుభవార్త అందుతుంది. ఆదాయానికి లోటు ఉండదు కానీ, వృథా ఖర్చులు పెరుగు తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీ మాటకు, చేతకు విలువ పెరుగు తుంది. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు. కొత్త వ్యాపారాలకు అవసరమైన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం పొందుతారు. పెద్దల నుంచి ఆర్థిక సంబంధ మైన శుభవార్తలు అందుతాయి. సంతానపరంగా శుభవార్తలు వింటారు. విద్య, ఉద్యోగాల విషయంలో విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4), శ్రవణం, ధనిష్ట 1,2)

సోదరులతో స్థిరాస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగి పోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కు వగా ఉంటుంది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలలో బరువు బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. ఆదాయం బాగానే ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ప్రస్తుతానికి ఎవరి తోనూ ఆర్థిక వ్యవహారాలు పెట్టుకోకపోవడం మంచిది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగిపోతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బం దేమీ ఉండదు. సన్నిహితుల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ముఖ్యమైన పనులు, వ్యవహారాలన్నీ లాభదాయకంగా సాగిపోతాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహా రాలు సత్ఫలితాలనిస్తాయి. ఇష్టమైన బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో రాణిస్తాయి. నిరుద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆఫర్లు అందుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. దూరపు బంధువులతో ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.