
దిన ఫలాలు (జూన్ 5, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయానికి లోటుండదు. ఖర్చు కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటుంది. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మిథున రాశి వారికి ఈ రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ముఖ్యమైన పనులన్నిటినీ సకాలంలో పూర్తి చేస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
పెండింగులో ఉన్న ప్రతి పనినీ దాదాపు పూర్తి చేస్తారు. ఆదాయానికి లోటుండదు. ఖర్చు కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగానే సాగిపోతుంది. ఉద్యోగంలో మీ ప్రాభవం బాగా పెరుగుతుంది. అధికారులు మీ సలహాలు, సూచనల వల్ల లాభం పొందుతారు. ఇష్ట మైన వ్యక్తితో పెళ్లి ఖాయమయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపో తాయి. ఒకరిద్దరు మిత్రులకు బాగా సహాయం చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయాలను సంద ర్శిస్తారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి ఆశించిన సహకారం అందుతుంది. వృత్తి జీవితంలో ప్రాభవం బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. స్వల్ప అనారోగ్యంతో ఇబ్బంది పడతారు. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా, సానుకూలంగా ఉంటుంది. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే సూచనలు న్నాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ముఖ్యమైన పనులన్నిటినీ సకాలంలో పూర్తి చేస్తారు. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో అధికారులతో బాధ్యతల్ని పంచుకోవడం జరుగుతుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి శ్రమాధిక్యత తప్పకపోవచ్చు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజ యం వరిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, వ్యాపారాల్లో కొద్ది శ్రమతో రాబడి బాగా పెరుగుతుంది. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగి పోతుంది. కుటుంబ బాధ్యతలు పెరిగి కొద్దిగా ఒత్తిడికి గురవుతుతారు. సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది. కుటుంబ సభ్యులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. బంధువుల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. ఆదాయానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాల్లో ఆర్థికంగా ఒకటి రెండు సమస్యలున్నా పరిష్కరించుకుంటారు. కుటుంబంలో కొద్దిగా బరువు బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. ఆదాయం బాగా అనుకూలంగా ఉంటుంది. రావలసిన డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. ఆర్థిక సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగిపోతాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. ఏ పని తలపెట్టినా సంతృప్తికరంగా పూర్తవుతుంది. నిరుద్యోగులు ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆదాయం, ఆరోగ్యం మెరుగ్గా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సానుకూల దృక్పథంతో వ్యవ హరించాల్సి ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. కొందరు మిత్రులకు సాయం చేస్తారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే సూచనలున్నాయి. పెళ్లి ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. విలాసాల మీద బాగా ఖర్చు చేయడం జరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రయాణాల వల్ల బాగా లాభం ఉంటుంది. ఆర్థిక ప్రయత్నాలు ఫలి స్తాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. జీతభత్యాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు బాగా తగ్గుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు కొద్దిగా నిరుత్సాహం కలుగుతాయి. అదనపు ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి ఊహించని శుభవార్తలు వింటారు. నిరుద్యోగుల విషయంలో ఒక శుభ పరిణామం కూడా చోటు చేసుకుంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు చాలా వరకు విజయాలు సాధిస్తాయి. ఇష్టమైన బంధుమిత్రులకు అండగా నిలబడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సకాలంలో పూర్తి అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో దూసుకుపోతారు. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పొందడం జరుగుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4), శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, వ్యాపారాల్లో కొన్ని కీలక మార్పులు చేపడతారు. కుటుంబపరంగా మంచి నిర్ణయాలు తీసు కుంటారు. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. ఆదాయం బాగానే పెరుగు తుంది. ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. అదనపు ఆదాయ మార్గాల విషయంలో మిత్రుల సహ కారం లభిస్తుంది. తోబుట్టువులతో అపార్థాలు తొలగిపోతాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. కొందరు మిత్రుల కారణంగా ఆర్థిక నష్టం తప్పకపో వచ్చు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
కుటుంబపరంగా అనుకూలతలు పెరుగుతాయి. రోజంగా సాదా సీదాగా సాగిపోతుంది. ఉద్యోగ పరంగా కొన్ని సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితంలో బాగా బిజీ అయి పోతారు. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. కుటుంబ సభ్యుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభిస్తుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. వ్యాపారాలను విస్తరించే ఆలోచన చేస్తారు. చాలా కాలంగా పెండింగులో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఇష్టమైన బంధుమిత్రులతో మంచి కాలక్షేపం చేస్తారు. ఆధ్యాత్మిక చింతనకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. పెళ్లి ప్రయత్నాలకు బంధువుల సహాయం లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.