Horoscope Today: ఆ రాశి వారికి సహోద్యోగుల నుంచి ఇబ్బందులు ఎదురుకావొచ్చు.. 12 రాశుల వారికి గురువారం రాశిఫలాలు

| Edited By: Janardhan Veluru

May 02, 2024 | 5:01 AM

దిన ఫలాలు (మే 2, 2024): మేష రాశి వారికి ఆస్తి సంబంధమైన వివాదం పరిష్కారమవుతుంది. వృషభ రాశి వారికి వ్యక్తిగత సమస్యలు, వ్యవహారాల్లో స్నేహితుల నుంచి సహాయం లభిస్తుంది. మిథున రాశి వారు ఉద్యోగపరంగా ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశి వారికి సహోద్యోగుల నుంచి ఇబ్బందులు ఎదురుకావొచ్చు.. 12 రాశుల వారికి గురువారం రాశిఫలాలు
Horoscope Today 02nd May 2024
Follow us on

దిన ఫలాలు (మే 2, 2024): మేష రాశి వారికి ఆస్తి సంబంధమైన వివాదం పరిష్కారమవుతుంది. వృషభ రాశి వారికి వ్యక్తిగత సమస్యలు, వ్యవహారాల్లో స్నేహితుల నుంచి సహాయం లభిస్తుంది. మిథున రాశి వారు ఉద్యోగపరంగా ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, వ్యాపారాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక లావాదేవీల్లో సొంత ఆలోచనలు మంచివి. కొందరు మిత్రులతో కలిసి ఒక విందు కార్యక్రమంలో పాల్గొంటారు. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఆస్తి సంబంధమైన వివాదం పరిష్కారమవుతుంది. వృత్తి, ఉద్యో గంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఇంటా బయటా ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎవరి విష యంలోనూ తలదూర్చవద్దు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాలలో హోదా పెరిగే అవకాశముంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. వ్యక్తిగత సమస్యలు, వ్యవహారాల్లో స్నేహితుల నుంచి సహాయం లభిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. గతంలో చేపట్టిన ప్రయత్నాలు శుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. రాజీ మార్గంలో సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగపరంగా ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. కుటుంబ పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. పిల్లల అభివృద్ధి గురించి ఆశించిన సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు సమ యం అనుకూలంగా ఉంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారు బాగా బిజీ అవుతారు. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. బంధుమిత్రుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యంత ఉంటుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అన్ని విధాలు గానూ ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు లోటుం డదు. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. నిరుద్యోగులకు తగిన ఉద్యోగం లభించే అవకాశముంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ పెద్దల సలహాలు ఉపయోగ పడ తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో మీ మాటకు చెల్లుబాటవుతుంది. అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. కుటుంబసమేతంగా ఇష్టమైన ఆలయాలు సందర్శి స్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. ఇంటా బయటా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. అనవసర పరిచయాలకు కాస్తంత దూరంగా ఉండటం మంచిది. ప్రయా ణాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు విముక్తి పొందుతారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగాలలో పని భారం బాగా పెరుగుతుంది. సహోద్యోగులతో బాధ్యతలు పంచుకోవాల్సి వస్తుంది. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరి స్తారు. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో దైవ కార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే సూచనలున్నాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. పిల్లల చదువుల మీద దృష్టి పెడతారు. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

తుల (చిత్త 3,4,స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో ఆశించిన శుభ వార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబంలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. పెద్దల కార ణంగా ఆస్తి వివాదం సమసిపోతుంది. ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయవద్దు. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. ఆరోగ్యం పరవా లేదు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉంటుంది. కాస్తంత ఎక్కువగా శ్రమపడాల్సి ఉంటుంది. ఉద్యో గంలో అధికారుల వేధింపులు తప్పకపోవచ్చు. సహోద్యోగుల నుంచి కూడా ఇబ్బందులు ఎదురు కావచ్చు. కొందరు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి తోడ్పాటుతో కుటుంబ సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సానుకూలంగా పూర్తవుతుంది. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపో తుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ పరిస్థితులు చాలావరకు చక్కబడతాయి. ఆర్థిక పరిస్థితికి లోటుండదు. ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటారు. వ్యక్తిగత విషయాలను ఇతరులతో చర్చించకపోవడం మంచిది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. శ్రమాధిక్యత ఎక్కువగా ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఆర్థిక పరిస్థితి చాలావరకు నిలకడగా ఉంటుంది. బంధుమిత్రుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి అప్రయత్నంగా పరిష్కారమ వుతుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

సొంత పనుల మీద, సొంత సమస్యల మీద దృష్టి పెట్టడం మంచిది. కొన్ని ముఖ్యమైన పనులు కొద్ది ప్రయత్నంతో పూర్తవుతాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశముంది. వృత్తి, వ్యాపారాలలో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని కష్టనష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. కొందరు మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం పరవా లేదు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడానికి, పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శుభ పరి ణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు ఆఫర్లు అందే అవకాశముంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుంచి అనుకోకుండా ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా సాగిపోతుంది. ఆరోగ్యం చాలావరకు మెరుగ్గా ఉంటుంది.