దిన ఫలాలు (జూలై 2, 2024): మేష రాశి వారికి ఈ రోజు అధికార యోగం పట్టే అవకాశం ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతంగా నెరవేరుతాయి. వృషభ రాశి వారి కష్టార్జితంలో ఎక్కువ భాగం ఖర్చులకే సరిపోతుంది. మిథున రాశికి చెందిన వారికి వ్యాపారాల్లో లాభాలపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. ఉద్యోగంలో అధికారుల ఆదరణ బాగా పెరుగుతుంది. అధికార యోగం పట్టే అవకాశం ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతంగా నెరవేరుతాయి. కొందరు బంధుమిత్రులను ఆర్థికంగా ఆదుకుంటారు. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. ఇష్టమైన దైవ దర్శనాలు చేసుకుంటారు. చిన్ననాటి మిత్రు లతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశ ముంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
కుటుంబ బాధ్యతల వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు. కష్టార్జితంలో ఎక్కువ భాగం ఖర్చులకే సరిపోతుంది. ప్రయాణాల వల్ల ఆర్థిక ప్రయోజనాలుంటాయి. వ్యాపారాల్లో పోటీదార్ల సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతితో పాటు బాధ్యతల మార్పునకు అవకాశం ఉంది. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించినంతగా ప్రయో జనం ఉండకపోవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని మార్పులు, చేర్పులు తప్పకపోవచ్చు. వ్యాపారాల్లో కూడా లాభాలపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఇతరుల సలహాలు తీసుకోవడం మంచిది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఏ ప్రయత్నం తల పెట్టినా, ఏ పని ప్రారంభించినా విజయవంతం అవుతాయి. వాహన యోగం పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుతుంది. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, వ్యాపారాల్లో జోరు పెరుగుతుంది. సాధారణంగా లాభాలకు లోటుండదు. ఉద్యోగ జీవితం కూడా సానుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం వృద్ధి చెందు తుంది. ఇంటా బయటా పని భారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. ఆస్తి సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారమవుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి కానీ శ్రమ అధికంగా ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. అదనపు రాబడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపా రాల్లో కూడా లాభాలకు లోటుండదు. బంధువుల తోడ్పాటుతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇష్టమైన బంధువులను శుభకార్యంలో కలుసుకునే అవకాశం ఉంది. ఏ రంగంలో ఉన్నా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు వీలైనంతగా సహాయ సహకారాలు అందజేస్తారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లభించడం కష్ట మవుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రతి పనిలోనూ తిప్పట, శ్రమ ఉంటాయి. అనేక విధాలుగా ఖర్చులు పెరుగుతాయి. అవసరాలకు తగ్గట్టుగా డబ్బు అందు తుంది. సొంత పనుల మీద శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరకపోవచ్చు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని శుభవార్తలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి ఆశించిన గుర్తింపు లభించి డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఆస్తి వివాదంలో బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందు తుంది. పెండింగ్ పనులు చాలావరకు పూర్తవుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు, చేర్పులు చేపడతారు. ఆదాయానికి, రాబడికి లోటుండదు. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ఆశించిన గుర్తింపు లభిస్తుంది. రావలసిన డబ్బు, రాదనుకున్న డబ్బు ఎట్టకేలకు చేతికి అందుతాయి. ప్రతి వ్యవహారంలోనూ విజయం సాధిస్తారు. తల్లితండ్రుల నుంచి ఆస్తిపరంగా సానుకూల సమాచారం అందుతుంది. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా, సామరస్యంగా సాగిపోతాయి. బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ వాటిని సకాలంలో పూర్తి చేస్తారు. అధికారులకు నమ్మకం పెరుగుతుంది. ఇంటా బయటా అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయం బాగా వృద్ది చెందే అవకాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
రోజంతా హ్యాపీగా, సాఫీగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం బాగా తగ్గుతుంది. వ్యాపా రాల్లో లాభాలకు లోటుండదు. ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. అనుకోకుండా బంధు వుల్లో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగ స్వామితో అన్యోన్యత పెరుగుతుంది. పిల్లలు పురోభివృద్ధి చెందుతారు. ఎవరికీ హామీలు ఉండవద్దు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాలలో పని భారం, ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరి ణామాలు చోటుచేసుకుంటాయి. పెళ్లి ప్రయత్నాల విషయంలో అనుకోకుండా ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలపరంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. నిరుద్యోగు లకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్య ఒకటి తొలగిపో తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. బంధువుల నుంచి ఒక దుర్వార్త వినే అవకాశ ముంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. అధికారులతో చిన్నా చితకా అపార్థాలు తొలగిపో తాయి. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. వృత్తి జీవితం సానుకూలంగా సాగిపో తుంది. తల్లితండ్రుల కారణంగా ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కుటుంబ సమేతంగా విహార యాత్రకు బయలుదేరే సూచనలున్నాయి. ఆదాయ వృద్ధి ఉంటుంది. ముఖ్య మైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఆరోగ్యం పరవా లేదు.