
దినఫలాలు(అక్టోబర్ 1, 2023): మేష రాశి వారికి దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. వృషభ రాశి వారికి దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. మిథున రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారం నాడు (అక్టోబర్ 1, 2023) దినఫలాలు ఎలా ఎన్నాయో చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో ప్రతి ఫలం ఉంటుంది. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయటా బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. శరీరానికి విశ్రాంతి దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సోదర వర్గంతో సమస్యలు పరిష్కారమవుతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన మీద దృష్టి పెడ తారు. ఎక్కువగా పుణ్యకార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. తీర్థయాత్రలకు కూడా ప్లాన్ చేస్తారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): వృత్తి, వ్యాపారాలలో కొత్త నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు. ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. సహోద్యోగులతో అపా ర్థాలు తొలగిపోయి ఊరట చెందుతారు. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. బంధు వులతో కలిసి ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. రావలసిన డబ్బు వసూలు చేసుకుంటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. ముఖ్యంగా అధికారుల నమ్మకం చూరగొంటారు. వ్యాపారాల్లో బాగా బిజీ అయిపోతారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. పిల్లల చదువులకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఏమాత్రం లోటు ఉండకపోవచ్చు. అనవసర పరిచయాలకు, వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. మనసు లోని కోరికల్లో ఒకటి రెండు నెరవేరుతాయి. నిరుద్యోగులకు అనుకోకుండా కొత్త ఆఫర్లు అందుతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఉద్యోగాలకు సంబంధించిన ప్రతి ప్రయత్నమూ సఫలం అయ్యే అవకాశం ఉంది. ఎటువంటి ఆటంకాలూ లేకుండా ముఖ్యమైన పనులన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. వృత్తి జీవితం ఆశాజనకంగా సాగిపోతుంది. వ్యాపారాలలో విశేషంగా లాభాలు గడిస్తారు. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. గృహ, వాహన సౌకర్యాల విషయంలో అడ్డంకులు, అభ్యంతరాలు తొలగిపోతాయి. పిల్లలకు చదువుల మీద శ్రద్ధ పెరుగుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత ఏర్పడుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఉద్యోగంలో స్థిరత్వం లభించవచ్చు. ప్రస్తుతానికి ఎవరికీ ఎటువంటి వాగ్దానాలు చేయవద్దు. ఇతరులకు డబ్బు ఇవ్వడం కానీ, వారి నుంచి తీసుకోవడం గానీ పెట్టుకోవద్దు. నష్టపోయే అవ కాశం ఉంది. ఆదాయం, ఆరోగ్యం బాగానే ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేసే సూచనలున్నాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కొందరు బంధుమిత్రులతో విభే దాలు తొలగిపోతాయి. వ్యాపారానికి ఢోకా ఉండదు. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభి స్తుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగంలో ఆశించిన విధంగా స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను, పనులను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. మనసులోని విషయా లను ఎవరికీ చెప్పకపోవడం మంచిది. ఆదాయ పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం పరవా లేదు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఆర్థిక విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొందరు స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాల మీద ఆధారపడడం మంచిది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృథా ఖర్చుల్ని చాలావరకు అదుపు చేస్తారు. ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం శ్రేయస్కరం కాదు. విదేశాల్లో ఉద్యోగాలు ఆశిస్తున్న నిరుద్యోగులకు శుభవార్త అందవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. పిల్లల చదువుల విషయంలో శుభ వార్తలు వింటారు. రుణగ్రస్తుల నుంచి డబ్బు వసూలు అవుతుంది. బంధుమిత్రులలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తారు. తోబుట్టువులు ఇంటికి వచ్చే సూచన లున్నాయి. ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): సమయం అన్ని విధాలుగానూ అనుకూలంగా ఉంది. సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. వృత్తి జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వ్యాపా రాలు వేగం పుంజుకుంటాయి. కుటుంబ వ్యవహారాల మీద శ్రద్ధ పెరుగుతుంది. కుటుంబ పెద్దలు సహాయ సహకారాలు అందిస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలలో సానుకూల స్పందన లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు కొద్దిగా నత్తనడక నడిచే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటిం చాలి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అధికారుల అండదండలతో ఉద్యోగ సమస్యలు పరిష్కరించుకుంటారు. ఇంటికి బంధుమిత్రులు వచ్చే అవకాశం ఉంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటి మరమ్మతుల మీద బాగా ఖర్చు చేస్తారు. అవసరమైన కొత్త వస్తు పరికరాలు కొనుగోలు చేస్తారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు అందుకుంటారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశా జనకంగా ఉంటుంది. తలపెట్టిన ముఖ్యమైన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. రాజకీయ వర్గాల వారితో మంచి పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి సన్నాహాలు ప్రారంభిస్తారు. ఉద్యోగ వాతావరణం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొన్ని దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. ప్రయాణాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడం మీద దృష్టి పెడతారు. అదనపు ఆదాయ మార్గాల కోసం ప్రయత్నిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. పట్టుదలగా కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యలను పరిష్క రించుకుంటారు. ఆదాయంలో ఆశించిన పెరుగుదల ఉంటుంది. ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో ప్రాధాన్యం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ సందర్శన చేసుకుంటారు.