దిన ఫలాలు (మే 1, 2024): వృత్తి, ఉద్యోగాల్లో మేష రాశి వారి ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వృషభ రాశి వారి ఆదాయానికి లోటుండదు కానీ, ఖర్చుల్ని తట్టుకోవడం కష్టమవుతుంది. మిథున రాశి వారు ఉద్యోగంలో అధికారులను మీ పని తీరుతో ఆకట్టుకుంటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. గురు, శనుల అనుకూల సంచారం కారణంగా వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ఇంటా బయటా మీ మాట చెల్లుబాటు అవుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందే సూచనలున్నాయి. మంచి స్నేహాలు ఏర్పడతాయి. కొన్ని ముఖ్య వ్యవహా రాలను మిత్రుల సహాయంతో పూర్తి చేస్తారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయానికి లోటుండదు కానీ, ఖర్చుల్ని తట్టుకోవడం కష్టమవుతుంది. వ్యయ ప్రయాసలతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికారులు మీ ప్రతిభను బాగా ఉపయోగించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో రాబడి పెరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు అనుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ పరిస్థితులు చాలావరకు ప్రశాంతంగా సాగిపోతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితులు బాగా చక్కబడతాయి. ఉద్యోగంలో అధికారులను మీ పని తీరుతో ఆకట్టుకుంటారు. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. పిల్లల చదువుల్లో ఘన విజయాలు సాధి స్తారు. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా సాగిపోతాయి. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించినశుభవార్తలు అందే అవకాశం ఉంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
మనసులోని కోరికల్లో ముఖ్యమైనవి నెరవేరుతాయి. ఏ ప్రమయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనుకోకుండా ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. ఉద్యోగానికి సంబంధించి ఒక శుభ పరిణామం కూడా చోటు చేసుకుంటుంది. ఆకస్మిక ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఉద్యో గంలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి జీవితం లాభదాయకంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండాలి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, వ్యాపారాలు చాలావరకు నిలకడగా సాగిపోతాయి. ఉంది. ఉద్యోగంలో కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశముంది. కుటుంబ సభ్యుల సహా యంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆహార, విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. ఆదాయానికి లోటుండదు కానీ వృథా ఖర్చులతో ఇబ్బంది పడతారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, వ్యాపారాలలో అదృష్టం పండుతుంది. రాబడి ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనులు సునాయాసంగా పూర్తవుతాయి. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. దూర ప్రాంతంలో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగం మారడానికి సంబంధించిన ప్రయత్నాలు సఫలమవుతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
అన్ని రంగాల వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ విజ యవంతం అవుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు కానీ, ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో అదనపు సంపాదన పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులు పరిచయమవుతారు. వృత్తి, ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొన సాగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
రోజంతా ఏదో ఒక పనితో తీరిక లేకుండా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో విజయాలు సాధి స్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యక్తి గత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆహార, విహారాల్లో ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశముంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాల్లో బాగా దూసుకుపోతారు. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు వృద్ధి చెందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. బంధుమిత్రులు ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి తీసుకు వస్తారు. మంచి పరిచయాలు పెరుగు తాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. ఎటువంటి ప్రయత్నమైనా సఫలం అవు తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి, కుటుంబ పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో అధికారుల నుంచి కొద్దిగా ఇబ్బందులు ఉండవచ్చు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా పురోగతి చెందుతాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు అదుపులో ఉంటాయి. మంచి పరిచ యాలు ఏర్పడతాయి. ఆర్థిక సమస్యలు క్రమంగా పరిష్కారం అవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నా లకు ఆశించిన స్పందన లభిస్తుంది. కొద్ది శ్రమతో ముఖ్య వ్యవహారాలు పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. హామీలు ఉండడానికి సమయం అనుకూలంగా లేదు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగంలో అధికారులు అండగా ఉంటారు. కీలక బాధ్య తలను అప్పగించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో నిలకడగా సాగుతాయి. ఆస్తి వివాదం అనుకూలమయ్యే అవకాశముంది. రాదనుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబంతో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండకపోవచ్చు. రాబడి కూడా బాగా పెరిగే అవకాశముంది. వ్యక్తిగత సమస్యలు ఒకటి రెండు తొలగిపోయి ఊరట చెందుతారు. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ పరిస్థితులు బాగా చక్కబడతాయి. కొద్దిపాటి శ్రమతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఇంటా బయటా పని ఒత్తిడి బాగా ఎక్కువగానే ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.